DailyDose

తిరుపతిలో వ్యభిచారం-నేరవార్తలు

తిరుపతిలో వ్యభిచారం-నేరవార్తలు

* తిరుపతి…బ్రేకింగ్.? వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య.?తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీనివసపురం లో ఘటన.?మృతుడు టి. పి.మోహన్ (35)గా పోలీసులు గుర్తింపు.? రైల్వే లోవిధులు నిర్వహిస్తున్న అతడు తాను చేసిన అప్పులు బాధ తాళలేక ఆత్మహత్య చేసుకొన్నట్లు పోలిసులు వెల్లడి.?పోస్ట్ మార్టం నిమిత్తం రుయాకు తరలింపు.?కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న తిరుచానూరు ఏ.ఎస్. ఐ .జగన్ మోహన్.

* తిరుపతిలో హైటెక్ వ్యభిచారం….బేరాలన్నీ వాట్సాప్లో…. నిర్వాహకులు అమ్మాయిలే. ఆంధ్రప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తిరుపతి శ్రీనగర్ కాలనీలో రహస్యంగా కొనసాగుతున్న వ్యభిచార దందా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్ ద్వారా విటులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మంగళవారం ఓ ఇంట్లో ఆసస్మికంగా దాడి చేసి నలుగురు విటులు, నిర్వాహకులను అరెస్టు చేసినట్లు తిరుపతి పోలీసులు వెల్లడించారు.పోలీసుల విచారణలో నిజాలు బయటకు వచ్చాయి. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఇద్దరు మహిళలని తేలింది. ఈ దందా నిర్వహిస్తోంది కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా గుర్తించినట్లు సీఐ శివప్రసాద్ రెడ్డి తెలిపారు. యువతుల ఫొటోలను సాయిచరణ్, అనిరుధ్ కుమార్ లు విటులకు పంపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి.. జీవకోన శ్రీనగర్ కాలనీకి చెందిన సాయిచరణ్, అనిరుధ్ ద్వారా లక్ష్మిప్రియ, స్వప్నలు వ్యభిచారం నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నామని సీఐ తెలిపారు.

* పోలీస్ కంట్రోల్ రూములో నే ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్.కడపలోని జిల్లా కోర్టు సముదాయంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూములో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఆత్మ హత్య చేసుకున్నాడు.

* టప్ప చబుత్ర్ర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ ఎస్.ఐ. ఉయ్యాల మధు ను సస్పెండ్ చేసిన సీపీ. మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఎస్ఐ. బేగంపేట్ పిఎస్ లో మధు పై కేసు నమోదు. ఈనెల 15వ తేదీ నాడు మధు ను సస్పెండ్ చేశారు.

* పోలీస్ కంట్రోల్ రూములో నే ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్.కడపలోని జిల్లా కోర్టు సముదాయంలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూములో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఆత్మ హత్య చేసుకున్నాడు. ?దిశ చట్టం రెండు రకాలు. (1) ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019, (2) ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగైనెస్ట్ వుమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 అంటారు. సింపుల్‌గా దిశ చట్టం అంటారు.?నిర్భయ చట్టం ప్రకారం రేప్ చేసిన వాళ్లకు జైలు శిక్ష లేదా ఉరి శిక్ష విధిస్తారు. దిశ చట్టం ప్రకారం రేపిస్టులకు ఉరి తప్పదు.?నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు, నెక్ట్స్ రెండు నెలల్లో శిక్ష పడాలి. దిశ చట్టం ప్రకారం 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తవ్వాలి. 21 రోజుల్లో ఉరి శిక్ష పడాలి.?పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించి కేంద్రం పోక్సో చట్టం తెచ్చింది. దాని ప్రకారం మూడేళ్ల నుంచీ ఏడేళ్ల వరకూ శిక్ష ఉంటుంది. ?దిశ చట్టం ప్రకారం పిల్లలపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడిన జీవిత ఖైదు లేదా ఉరి శిక్ష తప్పదు.? పిల్లలపై లైంగిక దాడులకు సంబంధించి పోక్సో ప్రకారం ఏడాదిలో దర్యాప్తు పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. దిశ చట్టం ప్రకారం 7 రోజుల్లో దర్యాప్తు కంప్లీట్ చేసి, 14 రోజుల్లో శిక్ష వెయ్యాలి.? సోషల్ మీడియాలో మహిళలపై పిచ్చి పిచ్చి రాతలు రాసినా, ఇష్టమొచ్చినట్లు వాగినా ఇకపై యాక్షన్ తప్పదు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే తొలిసారి రెండేళ్లు, మళ్లీ అలా చేస్తే రెండోసారి 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు.?దిశ చట్టంలో రెండో భాగమైన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్ట్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగైనెస్ట్ వుమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 ప్రకారం… ప్రతి జిల్లాలో ఓ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటవుతుంది. ఈ కోర్టు రేప్, యాసిడ్ ఎటాక్, సోషల్ మీడియాలో వేధింపులు, పిల్లలపై నేరాల్ని విచారిస్తుంది.?నిర్భయ చట్టంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసి, పై కోర్టుకు వెళ్లేందుకు దోషులకు 6 నెలల టైమ్ ఉంది. దిశ చట్టం ప్రకారం ఆ టైమ్ 3 నెలలే ఉంటుంది. ఐతే… 21 రోజుల్లోనే శిక్ష అమలవుతుంది కాబట్టి… 3 నెలలు గడువున్నా… 21 రోజుల్లోనే పై కోర్టుకు అప్పీల్ చేసుకోవాల్సి రావచ్చు.