NRI-NRT

కువైట్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

Kuwait Telugu News - KTR Birthday By NRITRS Kuwait-కువైట్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సంబరాలు తెరాస కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన “ముక్కోటి వృక్షార్చన”లో భాగంగా కువైట్ లో కూడా తెరాస కువైట్ సభ్యులు కోవిద్ నిబంధనలు పాటిస్తూ కేక్ కట్ చేసి మొక్కలు నాటి KTRకు శుభాకాంక్షలు తెలిపారు. అభిలాష మాట్లాడుతూ తెలంగాణలో అభివృద్ధి కేవలం తెరాస ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతోందని అన్నారు. ఖ్టృ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస కువైట్ కమిటీ సభ్యులు రవి గన్నరపు, సురేష్ గౌడ్, జగదీశ్, సుభాన్, రవి సుధగాని, సమియుద్దీన్, జమీల్, దస్తగిర్ తదితరులు పాల్గొన్నారు.
Kuwait Telugu News - KTR Birthday By NRITRS Kuwait-కువైట్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు
Kuwait Telugu News - KTR Birthday By NRITRS Kuwait-కువైట్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు