DailyDose

గుంటూరులో పాస్టర్ల ఫ్యాక్షన్. నల్గొండలో నకిలీబాబా-నేరవార్తలు

గుంటూరులో పాస్టర్ల ఫ్యాక్షన్. నల్గొండలో నకిలీబాబా-నేరవార్తలు

* నల్గొండ జిల్లా…* బాబా అవతారమెత్తిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్….* పీఏ పల్లి (మం)అజమాపురంలో పది ఎకరాల స్థలంలో ఆశ్రమం…* కొంతకాలంగా ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని ఆరోపణలు..* హోమాల పేరుతో మోసాలు…దేవుడి ముసుగులో దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు..* రోగం నయం చేస్తానని భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేసిన బురిడీ బాబా….*ప్రవచనాలు,హోమాలు, తాయిత్తులే పెట్టుబడిగా దందా….* విశ్వ చైతన్య పేరుతో యూ ట్యూబ్ చానల్…* ఛానెల్ వేదికగా భక్తులను ఆకర్షిస్తున్న బాబా…..* భాదిత మహిళ పిర్యాదుతో బట్టబయలయిన బాబా బాగోతం….* టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో బాబా విశ్వ చైతన్య….* పట్టుబడ్డ బాబా నుంచి లక్షల్లో నగదు,నగలు, కోట్ల విలువ గల ల్యాండ్ డ్యాక్యుమెంట్స్ స్వాధీనం…..* బాబా మోసాలపై కొనసాగుతున్న విచారణ.

* విజయనగరం బొబ్బిలి లో కిలాడి లేడి విజయ రాణి అరెస్ట్.ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా.నిరుద్యోగుల నుంచి రెండు కోట్లు కొట్టేసిన విజయ రాణి.మంత్రులు ఉన్నత అధికారుల పేర్లు చెప్పి నిరుద్యోగులకు వల.కోట్లు కొట్టేసి పరారైన కిలాడి లేడి విజయ రాణి.బొబ్బిలిలో విజయ రాణి ని పట్టుకుని దాడి చేసిన బాధితులు.కిలాడి లేడి విజయ రాణి అరెస్ట్ చేసిన పోలీసులు.

* ప్రకాశం జిల్లా గిద్దలూరు టూ నంద్యాల మధ్య గలా నల్లమల ఘట్రోడ్డులో దొరబావి వంతెనవద్ద రాత్రి ప్రమాదవశాత్తు లోయలోపడ్డ లారీ ఈ ప్రమాదంలో క్లినర్ మృతిచెందగా డ్రైవర్ కు గాయాలు అయ్యాయి ప్రమాద విషయం తెలుసుకున్న సిరివెళ్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి గాయపడిన డ్రైవర్ ను వైద్యశాలకు తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

* గుంటూరులో ఫాస్టర్ల మధ్య గొడవలు ఆగడంలేదు. గత ఆదివారం వెస్ట్ ప్యారిస్ చర్చిలో గొడవ జరగ్గా.. ఈ ఆదివారం ఈస్ట్ ప్యారిస్‌లో గొడవ జరిగింది. పాత బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఈస్టు ప్యారిస్ చర్చిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొంతకాలంగా గుంటూరులో ఏఈఎల్సీలు ఆధిపత్యం కోసం రెండు వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా రెండు వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. దీంతో ప్రతి ఆదివారం ప్రార్థనల సమయంలో సంఘపెద్దలు, సంఘస్థుల మధ్య వాగ్వాదం జరుగుతోంది.