Business

ఇంటి నుండి పనిచేసే ఉద్యోగుల వేతనల్లో కోతలు-వాణిజ్యం

ఇంటి నుండి పనిచేసే ఉద్యోగుల వేతనల్లో కోతలు-వాణిజ్యం

* రివీజన్‌లో భాగంగా ప్లాన్లను ధరలను మార్చకుండా ప్లాన్ల వ్యాలిడీటీ కుదించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు అందుబాటులో ఉన్న రూ. 49, రూ. 75, రూ. 94 ప్లాన్ల వ్యాలిడీటీను తగ్గించింది. అంతేకాకుండా రూ. 106, రూ.107, రూ.197, రూ. 397 ప్లాన్లను ​కూడా రివైజ్‌ చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.49 ప్లాన్‌ వ్యాలిడిటీని 24 రోజులుగా, రూ.75 ప్లాన్‌ వ్యాలిడిటీని 50 రోజులుగా, రూ. 94 ప్లాన్‌ వ్యాలిడిటీని 75 రోజులుగా నిర్ణయించింది. దాంతోపాటుగా రూ.106, రూ. 107, ప్లాన్లకు అందించే 100 రోజుల వ్యాలిడిటీని 84 రోజులకు కుదించింది. రూ. 197 ప్లాన్‌కు అందించే 180 రోజుల వ్యాలిడిటీని 150 రోజులకు కుదించింది. రూ. 397 ప్లాన్‌కు అందించే 365 రోజుల వ్యాలిడిటీని 300 రోజులకు కుదించింది.

* మహిళా సంఘాలకు ఆర్‌బీఐ శుభవార్త అందించింది. దీన్ దయాళ్ అంత్యోదయ యోజన (డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం) కింద స్వయం సహాయక బృందాలకు తనఖా లేకుండానే రూ.20 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఇప్పటి వరకు డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం కింద ఇస్తున్న రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం నోటిఫై చేసింది. మహిళల సహాయంతో బలమైన సంస్థలను నిర్మించడం ద్వారా పేదరికాన్ని తగ్గించడం, జీవనోపాధిని కల్పించడానికి భారత ప్రభుత్వం డీఏవై-ఎన్ఆర్ఎల్ఎం పథకాన్ని తీసుకొచ్చింది.

* ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగుల వేతనంలో కంపెనీలు కొంత మొత్తం కట్ చేసే అవకాశం ఉందా? అంటే అవును, అనే సమాధానం వినిపిస్తుంది. ఈ మహమ్మారికి ముందు కార్యాలయంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులు శాశ్వతంగా ఇంటి నుంచి పనిచేయడానికి మారితే వేతనంలో కొతలు విధించే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ఇప్పుడు ఈ విషయం గురుంచి సిలికాన్ వ్యాలీ అంతటా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సంస్థలు తక్కువ ఖరీదైన ప్రాంతాలకు వెళ్ళే రిమోట్ ఉద్యోగులకు వేతనాన్ని తగ్గించాయి.

* దేశంలో అపరకుబేరుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 2019-20లో భారత్‌లో 141 మంది బిలియనీర్లు ఉండగా.. 2020-21లో ఆ సంఖ్య 136గా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం రాజ్యసభలో వెల్లడించారు. ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు సమయంలో రూ.100కోట్లకు పైగా ఆదాయాన్ని వెల్లడించిన వ్యక్తులను ఈ జాబితాలో చేరుస్తారు. 2018-19లో 77 మంది బిలియనీర్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు రెట్టింపునకు చేరుకోవడం గమనార్హం. ఇక 2016 నుంచి సంపద పన్నును రద్దు చేయడంతో ఈ కుబేరుల పూర్తి సంపద వివరాలు సీబీడీటీ వద్ద లేవని కేంద్రమంత్రి తెలిపారు.