DailyDose

నూజివీడు ATM దొంగ పట్టివేత-నేరవార్తలు

నూజివీడు ATM దొంగ పట్టివేత-నేరవార్తలు

* నూజివీడులో దొంగలు హల్ చల్,వరుస చోరీలు.ఏటీఎం మెషిన్ బ్రేక్ చేయటానికి ప్రత్త్నించిన వ్యక్తిని 24గంటల్లో అరెస్ట్ చేసిన పోలీసులు.నూజివీడు పట్టణంలోని బస్టాండ్ కి వెళ్లే రోడ్డులో మున్సిపల్ ఆఫీస్ దగ్గర యస్బిఐ ఏటిఎం లో చోరికి యత్నించిన తానంకి స్యామ్ బాబు.ముద్దాయి విస్సన్నపేట మండలం నర్సాపురంకి చెందిన వ్యక్తిగా గుర్తింపు.ముద్దాయి అరెస్ట్ చేసి నేడు కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.

* తిరుపతి సమీపంలోని కరకంబాడీ పరిధి అడవుల్లో మంగళవారం తెల్లవారుజామున 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఒక స్మగ్లర్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర రావు ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ లు సురేష్, విశ్వనాధ్ కరకంబాడీ బీట్ పరిధి లో కూంబింగ్ చేపట్టారు.తిరుపతి రేంజ్ కృష్ణాపురం సెక్షన్ ఎస్వీ బాయ్స్ హాస్టల్ వద్ద కొంతమంది ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారు.అక్కడకు చేరుకుని వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దుంగలు పడవేసి పారిపోయారు.అందులో ఒక స్మగ్లర్ ను పట్టుకో గలిగారు.అతనిని తమిళనాడు వేలూరు జిల్లా వసంతపురం గ్రామానికి చెందిన అన్నామలై లక్ష్మణన్ (51)గా గుర్తించారు. అతనిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అక్కడ పడి ఉన్న 23 దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

* అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన సిద్ధ లింగ ( 32) అనే వ్యక్తి మంగళవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో టీవీ పేలి పోయి అక్కడికక్కడే మృతి చెందాడు.టైలరింగ్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించారు.షార్ట్ సర్క్యూట్ కు కారణాలు తెలుసుకుంటున్న విద్యుత్ శాఖ అధికారులు.మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

* చండ్రుగొండ లో…. పురుగుల మందుల షాపు యజమాని దగ్గర…. 90,000 వేలు లంచం తీసుకుంటూ…. ఉండగా రెడ్ హ్యాండెడ్ గా….ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.అధికారులు మీడియాకు ఇచ్చిన సమాచారం ప్రకారం…. మండల వ్యవసాయ అధికారి చటర్జీ మండల కేంద్రం అయినా….చండ్రుగొండలో…. ఉన్న పురుగు మందు షాపుల వారి అందరినీ కలుపుకొని ఒక వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేశారని, గ్రూపుల ద్వారా తమ అవినీతి బాగోతాన్ని నడిపించే వారు అని , వారి షాపులను ఇన్స్పెక్షన్ చేయకుండా….ఉండేందుకు ప్రతి షాప్ నుండి 15000 వేలు ఇవ్వాల్సిందిగా…. డిమాండ్ చేయడంతో….స్థానిక పెట్టి లైజర్ షాపు యజమానులు గోదా సత్యం , సీతారాములు, మరో నలుగురి వద్దనుండి ఒక్కొక్కరికి 15000 వేలు చొప్పున ఆరుగురి వద్దా 90000 వేలు డిమాండ్ చేయడంతో…..డబ్బులు ఇచ్చేందుకు ఇష్టపడని షాపు యజమానులు అవినీతి నిరోధక శాఖ ఆశ్రయించారని, అన్నారు.సమాచారం తెలుసుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో…. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని, అన్నారు.