DailyDose

గాంధీ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలు ఏమైంది?-నేరవార్తలు

గాంధీ ఆసుపత్రిలో అత్యాచార బాధితురాలు ఏమైంది?-నేరవార్తలు

* ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఆటో డ్రైవర్‌ పై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు.ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఆటో డ్రైవర్‌పై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు.అజిత్‌సింగ్‌ నగర్‌ వాసి ఆటోడ్రైవర్ సయ్యద్ అలీ.. తమ కుమార్తెను వేధిస్తున్నాడని బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు.పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేశామని, కిడ్నాప్ కేసు సైతం నమోదు చేశామని నున్న గ్రామీణ పోలీసులు తెలిపారు.

* తాలిబన్లు అధికారంలోకి వస్తే రెండు దశాబ్దాల క్రితం నాటి వారి అరాచక పాలన మళ్లీ వస్తుందని భయపడుతున్న ప్రజల అంచనాలే నిజమవుతున్నాయి.హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రాహాన్ని వారు పేల్చి వేశారు.బామియాన్​లో ఉన్న ఈ ప్రతిమను నామరూపాల్లేకుండా చేశారు.గతంలో ఈ ప్రాంతంలోనే బుద్ధుని విగ్రహం, చారిత్రక కట్టడాలను తాలిబన్లు ధ్వంసం చేశారు.ఈ విషయాన్ని మానవహక్కుల ఉద్యమకారుడు సలీ జావేద్ వెల్లడించారు.అఫ్గాన్​ ప్రజలకు తాలిబన్లు చాలా పెద్ద క్షమాభిక్ష పెట్టారని మండిపడ్డారు.హజారా నేత అబ్దుల్​ అలీని 1995లోనే తాలిబన్లు ఉరితీశారు. చాలా ఏళ్లుగా ఆ వర్గం వారిపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు.హజారాలు ఓ సంప్రదాయ తెగ. మధ్య అఫ్గాన్​లోని పర్వత ప్రాంతం హజారత్​లో వారు అధికంగా ఉంటారు.

* నెల్లూరులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తనిఖీలు కలకలం రేపాయి.నెల్లూరు పట్టణంలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు.టౌన్‌ ప్లానింగ్‌ విభాగంపై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ సోదాలు చేసింది.ఈ సందర్బంగా కార్యాలయంలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.పలు పనుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగినట్లు సమాచారం

* గాంధీ ఆస్పత్రిలో రేప్ అండ్ మిస్సింగ్ కేస్ పై కొనసాగుతున్న సస్పెన్షన్.గాంధీ కేసులో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు.మత్తుమందిచ్చి రేప్ చేశారంటూ పోలీసులకు పిర్యాదు చేసిన మహిళ..తన అక్క తో పాటు ఉ తన పైన గ్యాంగ్ రేప్ జరిగిందట ఫిర్యాదు.గాంధీ ఆస్పత్రి నుంచి కనిపించకుండా పోయిన రేప్ బాధితురాలి సోదరి.గాంధీ ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న మహిళను గుర్తించి సోదరి కుమారుడు..గాంధీ ఆసుపత్రిలో పిర్యాదు చేయకుండా నేరుగా మహబూబు నగర్ కు బాధిత మహిళ తీసుకువెళ్లిన కుమారుడు..గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చెప్పాపెట్టకుండా వెళ్లిపోయిన బాధిత మహిళ బావ..గాంధీ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయకుండా మహబూబ్నగర్ కి వెళ్లడం పై అనుమానం.నాలుగు రోజులుగా బాధిత మహిళా సోదరి ఆచూకీ లేకుండా పోవడం పై అనుమానిస్తున్న పోలీసులు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, రోళ్ళపాడు క్రాస్ రోడ్ కల్వర్టు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ఘటనలో టేకులపల్లి మండలం, మద్రాసు తండాకు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను మాళోతు జగదీష్ బాబు మృతి చెందారు. ఆయన చెన్నైలో సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితం సెలవుపై ఇంటికి వచ్చారు. ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.