Fashion

వర్క్ ఫ్రం హోం కారణంగా పెరిగిన భుజం నొప్పులు

వర్క్ ఫ్రం హోం కారణంగా పెరిగిన భుజం నొప్పులు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఉద్యోగుల్లో భుజం, వెన్ను, మెడ నొప్పులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ‘కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రకటించిన తర్వాత సిక్‌ స్కాప్యులా సిండ్రోమ్‌(భుజం నొప్పి) కేసులు 20-25శాతం పెరిగాయి. 30-45 ఏండ్ల మధ్య వయసు వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది’ అని బెంగళూరులోని ఫోర్టిస్‌ దవాఖాన వైద్యుడు రఘునాగరాజ్‌ తెలిపారు. పనిచేసేప్పుడు కూర్చోవడానికి ఇండ్లలో సరైన కుర్చీలు లేకపోవడం, గంటల తరబడి కండరాలపై ఒత్తిడి పెరగడంతోనే ఈ ఇబ్బందులని చెప్పారు.