NRI-NRT

తాకా తదుపరి అధ్యక్షురాలిగా మోటూరి కల్పన

తాకా తదుపరి అధ్యక్షురాలిగా మోటూరి కల్పన

తెలుగు అలయెన్సస్ ఆఫ్ కెనడా-తాకా 2021-23 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఈ నెల 3వ తేదీన బ్రాంప్టన్‌లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. ఆగష్టు 25న ప్రారంభమయిన తాకా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 3వ తేదీన నూతన కార్యవర్గ సభ్యులను, ట్రస్ట్ బోర్డు సభ్యులను ఎన్నికల అధికారులు ప్రకటించారు. నూతన అధ్యక్షురాలిగా మోటూరి కల్పన, ఉపాధ్యక్షుడిగా హంసల నాగేంద్రకుమార్, కార్యదర్శిగా శ్యాంసుందర్ ప్రసన్న కుమార్, కోశాధికారిగా పదిర మల్లిఖార్జున చారిలు ఎన్నికయ్యారు. ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్ మునాఫ్ ఎన్నికయ్యారు. పూర్తి సభ్యుల వివరాలు దిగువ చూడవచ్చు. వీరి పదవీకాలం నవంబర్ 16న ప్రారంభమయి 2023 నవంబర్ 15తో ముగుస్తుంది.
TACA Canada 2021-23 EC
TACA Canada 2021-23 EC