Politics

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ప్రకటన. రేపు ఆశ్రమానికి జగన్-తాజావార్తలు

ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ప్రకటన. రేపు ఆశ్రమానికి జగన్-తాజావార్తలు

* ఆదివారం ఉదయం హైదరాబాద్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

* రేపు సచ్చిదానంద ఆశ్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ అన్న రాక. విజయవాడ పటమట దత్తానగర్‌లోని శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఆశ్రమాన్ని సోమవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిసందర్శించనున్నారు. ఉదయం 10.15 గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయలుదేరి….10.30కి ఆశ్రమానికి చేరుకుంటారు. 10.50 వరకూ ఆశ్రమంలోని ఆలయాన్ని దర్శిస్తారు. అనంతరం స్వామి సచ్చిదానందతో సమావేశమవుతారు. 11.30 గంటలకు ఆయన నివాసానికి తిరుగు ప్రయాణమవుతారు. ఇదిలా ఉండగా ఆశ్రమంలో సీఎం పర్యటన ఏర్పాట్లను.. సీఎం భద్రతాధికారులు, ఇతర పోలీస్‌ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ శనివారం పరిశీలించారు.

* చంద్రబాబు ఒక పగటి వేషగాడు, పిట్టలదొర అంటూ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో ఫైర్‌ అయ్యారు. ఆదివారం గొల్లపూడిలో నిర్వహించిన ‘వైఎస్సార్‌ ఆసరా’ కార్యక్రమం సంబరాలకు మంత్రి కొడాలి నాని ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. డ్వాక్రా సంఘాలను తనే ప్రవేశపెట్టానని చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నాడు. 2014లో అధికారంలోకి రావడానికి డ్వాక్రా సంఘాలను అడ్డం పెట్టుకున్నాడు. డ్వాక్రా సంఘాలను మోసం చేసిన గజమోసగాడు. దేశ చరిత్రలో డ్వాక్రా సంఘాలను మోసం చేసిన వాడిగా చంద్రబాబు పేరు సువర్ణాక్షరాలతో లిఖించవచ్చు.

* ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నిక‌లు ముగిసి వారం రోజులు గడుస్తున్నా… వివాదం మాత్రం త‌గ్గ‌డం లేదు. మంచు విష్ణు, ప్ర‌కాశ్ రాజ్ ప్యాన‌ల్ మ‌ధ్య హోరా హోరిగా జ‌రిగిన ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యాన‌ల్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. రిగ్గింగ్ చేశారని మంచు విష్ణు ప్యానల్ పై ఆరోపణలు చేశారు ప్రకాశ్‌ రాజ్. అంతేకాదు ఎన్నిక‌ల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామాలు కూడా చేశారు. ఓట్ల కౌంటింగ్‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని, ఎలక్షన్ రోజున మోహన్ బాబు, నరేష్ ఇతరులు తమపై దాడి, దౌర్జన్యం చేశారంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు ఆరోపించారు. ఎలక్షన్ టైం సీసీ ఫుటేజ్ కావాలంటూ ఎన్నిక‌ల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు. కానీ ఎన్నిక‌ల అధికారి కృష్ణమోహన్ అలా సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని వెల్లడించారు. తాజాగా ఈ వివాదం కొత్త కోణం చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ను మాయం చేసే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ప్రకాష్ రాజ్ ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్ర‌కాశ్ రాజ్ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. తాజాగా సీసీ ఫుటేజ్ సర్వర్ రూమ్ కు తాళం వేశారు. మ‌రి ఈ వివాదం ఎక్క‌డికి దారి తీస్తూందో చూడాలి.

* తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం ముగిసింది. అధ్యక్ష ఎన్నిక, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరిగింది. హుజురాబాద్‌ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్‌ చర్చించారు. పార్టీ భవిష్యత్‌ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. హుజరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ నెల 27న సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో హుజరాబాద్‌లో సభ నిర్వహించడానికి సమావేశంలో నిర్ణయించారు. హుజురాబాద్‌లో విజయం మనదేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. ఇంకా రెండేళ్లు ఉంది. అన్ని పనులు చేసుకుందామని కేసీఆర్‌ అన్నారు. భవిష్యత్‌లో టీఆర్‌ఎస్‌ ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్‌లో ప్రజాగర్జన సభ నిర్వహించాలని సీఎం సూచించారు. వరంగల్‌ సభపై కేటీఆర్‌ అధ్యక్షతన నియోజకవర్గాలవారీ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.

* రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. ఓవైపు సంస్థాగత కార్యక్రమాలకు సిద్ధమవుతూనే మరోవైపు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ, అధ్యక్ష ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ శాసన, పార్లమెంటరీ పార్టీ సంయుక్తంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు, టీఆర్‌ఎస్‌ ప్రస్థానం, పార్టీ భవిష్యత్తు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అంశాలను అధినేత కేసీఆర్‌ ప్రస్తావించే అవకాశముంది.

* సుమారు మూడు నెలల క్రితం బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు.

* నగరంలోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్‌ బలయ్‌ ఉత్సవం సందడిగా జరిగింది. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ తమిళిసైతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. కుల, మత, భాష, ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేదే అలయ్‌ బలయ్‌ ఉత్సవ సందేశం అని చెప్పారు. మన సాంప్రదాయాలు, ఆచారాలు, ప్రాచీన భారతీయ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని వివరించారు. బతుకమ్మ, బోనాల తెలంగాణ సంస్కృతులను ప్రతిబింబిస్తాయని వెంకయ్య చెప్పారు.

* అణు సామర్థ్యమున్న హైపర్‌సోనిక్‌ క్షిపణిని చైనా ఆగస్టులో పరీక్షించింది. ఈ పరీక్షతో సంబంధం ఉన్న వ్యక్తి దీనిని ప్రముఖ ఆంగ్ల వార్తపత్రిక ‘ఫైనాన్షియల్‌ టైమ్స్‌’ వద్ద ధ్రువీకరించారు. ఈ క్షిపణి భూమి చుట్టూ లోఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రయాణించింది. కాకపోతే లక్ష్యాన్ని తప్పి 32 కిలోమీటర్లు పక్కకు వెళ్లింది. ఈ క్షిపణిని లాంగ్‌ మార్చ్‌ రాకెట్‌ కొంత దూరం తీసుకెళ్లింది. ఆ తర్వాత దాని నుంచి విడిపోయి ఇది ప్రయాణించింది. ఆగస్టులో చైనా లాంగ్‌మార్చ్‌ రాకెట్‌ను ప్రయోగించినా.. ఈ క్షిపణి విషయాన్ని గోప్యంగా ఉంచింది. ఈ ప్రయోగంపై స్పందించేందుకు పెంటగాన్‌ ప్రతినిధి జాన్‌ కిర్బే నిరాకరించారు. కానీ, చైనా నిరంతరాయంగా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడంపై మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో డ్రాగన్‌ చర్యలు ఉద్రిక్తలను పెంచుతాయని.. ఆ కారణంగానే చైనా తమకు తొలి సవాల్‌ అని పేర్కొన్నారు. ఇప్పటికే హైపర్‌ సోనిక్‌ సామర్థ్యంలో ఆధిపత్యం సాధించేందుకు చైనా, రష్యా, అమెరికా సహా దాదాపు ఐదు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. హైపర్‌ సోనిక్‌ ఆయుధాలు బాలిస్టిక్‌ మిసైల్‌ వలే అణ్వాయుధాలను ప్రయోగించగలవు.. అంతేకాదు.. శబ్దానికి ఐదు రెట్ల వేగంతో ప్రయాణించగలవు.

* రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. సీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారని పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆక్షేపించారు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు, అనంత జిల్లాలోని అన్ని చెరువులకు వెంటనే నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

* వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను అందులో పొందుపరిచారు. అలాగే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివరించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 15న లేఖ రాశారు. దాన్ని నేడు ట్విటర్‌లో ఉంచారు.

* నేటినుంచి రానున్న రెండు మూడు రోజులు ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన చమోలీ జిల్లా యంత్రాంగం.. ఆదివారం బద్రీనాథ్ యాత్రను నిలిపివేసింది. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా యాత్రికులంతా జోషిమఠ్‌, పాండుకేశ్వర్ వద్దే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చమోలీ డిస్టిక్‌ మేజిస్ట్రేట్‌ హిమాన్షు ఖురానా విజ్ఞప్తి చేశారు.

* తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌ పేరును ప్రతిపాదిస్తూ ఆ పార్టీ నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో కేసీఆర్‌ తరఫున ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కి మంత్రులు మహమూద్‌ అలీ, సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాఠోడ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జగదీశ్‌ రెడ్డి, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్‌ నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

* మూడు రాజధానుల అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరధిలోనిదే అని కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే స్పష్టం చేశారు. విశాఖలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌ తనకు మంచి మిత్రుడని.. తను ఎన్డీఏలో చేరాలని కోరారు. ఎన్డీయేలో చేరితే హైవేలు, నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఏపీకి మేలు జరుగుతుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందని.. అయితే ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామన్నారు.

* రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పస్టం చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు.

* హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో మంత్రి హరీశ్‌రావు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్‌ గోయల్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి హోదాలో ఉన్న హరీశ్‌రావు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. నెల రోజుల నుంచి హుజూరాబాద్‌ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేస్తున్నారన్నారు.

* టీమ్‌ఇండియా మాజీ కోచ్‌, స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఆదివారం 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి సన్నిహితుల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు బీసీసీఐ సైతం ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పింది. ‘403 అంతర్జాతీయ మ్యాచ్‌లు 956 వికెట్లు తీయడమే కాకుండా టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన రెండో క్రికెటర్‌గా టీమ్‌ఇండియా మాజీ సారథి అనిల్‌ కుంబ్లే నిలిచాడు. ఆ దిగ్గజానికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ 1999లో పాకిస్థాన్‌పై దిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన వీడియోను అభిమానులతో పంచుకుంది.

* గత కొన్నేళ్లుగా అంతరిక్ష యాత్రల్లో ప్రపంచ దేశాలు దూసుకువెళ్తున్న విషయం తెలిసిందే. ప్రైవేటులోనూ అంతరిక్ష పర్యాటకం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో కేవలం యాత్రలే కాదు తాజాగా అక్కడ సినిమా షూటింగ్‌లు కూడా మొదలయ్యాయి. ఇందులో భాగంగా రష్యాకు చెందిన చిత్ర బృందం ఏకంగా 12రోజుల పాటు అంతరిక్షంలో షూటింగ్‌ నిర్వహించారు. ఓ సినిమా కోసం ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌కు (ISS) వెళ్లిన చిత్ర దర్శకుడు, కథానాయిక.. అక్కడ కొన్ని సన్నివేశాలను చిత్రీకరించుకొని తాజాగా విజయవంతంగా భూమిని చేరుకున్నారు.

* కాలం మారింది.. సాంకేతికత సాయంతో కష్టసాధ్యమైన పనులు కూడా సులువుగా జరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ లేనిదే పొద్దుపోని పరిస్థితి. అత్యవసర పనుల నుంచి పిచ్చాపాటీ కబుర్ల కోసం దూరంగా ఉన్న బంధుమిత్రులు, స్నేహితులతో సంభాషించేందుకు మొబైల్‌ఫోన్ ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫీస్‌ సమావేశాల వరకూ ఎన్నో విధాలుగా స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించాం. దీంతో ఫోన్‌లోని యూజర్‌ డేటా లక్ష్యంగా జరిగే సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరిగిందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెబుతున్నాయి.

* కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచదేశాలు ఎంతగా వణికిపోయాయో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో విధించిన లాక్‌డౌన్‌ చాలా మంది జీవితాలపై ప్రభావం చూపింది. ఇతరులకు దగ్గరగా వెళ్లి మాట్లాడాలంటేనే భయపడిపోయాం. ఇంట్లో ఉన్న బంధువులతో, చుట్టుపక్కల వారితో, స్నేహితులతో చనువుగా ఉండలేకపోయాం. తాజాగా కరోనా వ్యాప్తి సమయంలో.. మనం ఒకరు నుంచి ఏం కోరుకున్నాం? మన జీవితాల్ని మహమ్మారి ఏవిధంగా మార్చిందనే విషయాల్ని ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

* వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ శాఖ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూ.. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ల అజెండాను అందులో పొందుపరిచారు. అలాగే మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వివరించేందుకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన అక్టోబరు 15న లేఖ రాశారు. దాన్ని నేడు ట్విటర్‌లో ఉంచారు.