NRI-NRT

న్యూజెర్సీ ప్రవాసుడు అరవపల్లి శ్రీరంగను అందుకే కాల్చాడు

న్యూజెర్సీ ప్రవాసుడు అరవపల్లి శ్రీరంగను అందుకే కాల్చాడు

న్యూజెర్సీలో మంగళవారం ఉదయం దుండగుడి కాల్పుల్లో చనిపోయిన ప్రవాస తెలుగు వ్యక్తి అరవపల్లి శ్రీ రంగ(54) హత్యకు గల కారణాలను పోలీసులు తెలిపారు. పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెన్సలెంలో గల పార్క్స్ క్యాసినోలో అరవపల్లి 10వేల డాలర్లు గెలుచుకున్నాడు. ఇది గమనించి అతనిని సుమారు 45కి.మీ. (30మైళ్లు) న్యూజెర్సీ రాష్ట్రంలోని ప్లెయిన్స్‌బరోలోని అతని గృహం వరకు జెకై రీడ్ జాన్ (27) అనే వ్యక్తి వెంబడించి ఇంటి వెనుక వైపు తలుపు గుండా లోపలికి చొరబడి కాల్చి చంపాడని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో అరవపల్లి భార్య, కుమార్తె పై అంతస్థులో నిద్రిస్తున్నారు. కేవలం క్యాసినోలో భారీమొత్తంలో అరవపల్లి శ్రీరంగ డబ్బులు గెలుపొందడం చూసిన జాన్ అతడిని పొట్టనబెట్టుకున్నాదని, అరవపల్లి కుటుంబానికి తమ సానుభూతిని తెలుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.