Videos

నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట దందా

నాగశౌర్య ఫామ్‌హౌజ్‌లో పేకాట దందా

హైదరాబాద్‌ శివారులో పేకాట దందా జోరుగా కొనసాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతోన్న ఈ దందా గుట్టురట్టయ్యింది. ఎస్‌ఓటీ పోలీసుల దాడిలో రూ.6 లక్షల 77 వేల నగదు, 34 మొబైళ్లు, ఖరీదైన కార్లు స్వాధీనం చేసుకున్నారు. మంచిరేవుల ప్రాంతంలో నటుడు నాగశౌర్య ఫామ్‌హౌస్‌‌లో ఈ పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేశారు. బెజవాడ- కర్నూల్- నిజామాబాద్- మహబూబా బాద్ జిల్లాల నుంచి.. పాతిక మంది వరకు ఇందులో పాల్గొని భారీ ఎత్తున డబ్బులు పెట్టి ఈ దందా నిర్వహిస్తున్నట్లు తేలింది. మొత్తం పేకాటలో సూత్రదారి యంగ్‌ హీరో నాగశౌర్య అని తేలడం సంచలనంగా మారింది. ఇదొక ఐఏఎస్‌ అధికారికి చెందిన ఫామ్‌ హౌజ్‌. దీనిని నాగశౌర్య ఐదేళ్ల పాటు లీజుకు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. లీజుకు తీసుకున్న ఇంట్లోనే ఈ దందా నడుస్తోంది. వీకెండ్‌ ఏపీ నుంచి కూడా ప్రముఖులు వస్తున్నట్లు తేలింది. క్లబ్‌ నిర్వాహుకుడు సుమంత్‌ చౌదరిగా పోలీసులు గుర్తించారు.