Politics

తెదేపాలో ఇక కుమ్మక్కులు ఉండవు. యువరక్తాన్ని ఎక్కిస్తా.

తెదేపాలో ఇక కుమ్మక్కులు ఉండవు. యువరక్తాన్ని ఎక్కిస్తా.

తెలుగుదేశం పార్టీలో ఇకపై కుమ్మక్కు రాజకీయాలు సాగవని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. నెల్లూరు కార్పొరేషన్‌ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు కార్పొరేషన్‌ ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని నెల్లూరు నగరానికి చెందిన ఇద్దరు నేతలను సస్పెండ్‌ చేశారు. అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత నాయకులపై లేదా?అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేసేవారు ఇకపై పార్టీలో అవసరం లేదన్నారు. పార్టీని ఏ విధంగా పటిష్ఠం చేయాలో తనకు తెలుసునన్నారు. తెదేపాలోకి యువరక్తాన్ని తీసుకొస్తానని.. క్షేత్రస్థాయిలో నిబద్ధతతో పనిచేసేవారికే ఇకపై పార్టీ పదవులు ఉంటాయని చెప్పారు. నెల్లూరు నగర పార్టీ డివిజన్‌ కమిటీలన్నీ రద్దు చేసిన చంద్రబాబు.. త్వరలోనే కొత్త కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కోవర్టులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. పూర్తి స్థాయి నివేదికల తర్వాత మరికొందరిపై వేటు పడుతుందని చంద్రబాబు హెచ్చరించారు.