DailyDose

TNI నేటి కరోనా బులెటిన్ – 19/01/2022

TNI నేటి కరోనా బులెటిన్ – 19/01/2022

1.భారత్ లో గడిచిన 24 గంట్లో కరోనా కేసులు 2,82,970 మరణాలు 441దేశంలో రోజూవారీ కరోనా కేేసులు మూడు లక్షలకు చేరువ అవుతున్నాయి. చాపకింద నీరులా కోవిడ్ కేసులు విస్తరిస్తున్నాయి. గత కొంత కాలం నుంచి రోజూవారీ కేసుల సంఖ్య లక్ష, రెండు లక్షలను దాటి మూడు లక్షలకు చేరువ అయింది. తాజాగా ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం ఇండియాలో గడిచిన 24 గంటల్లో 2,82,970 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 44,889 ఎక్కువ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 24 గంటల్లో 441 మరణాలు సంభవించగా.. 1,88,157 మంది రికవరీలు అయ్యారు.దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000 ఉండగా… పాజిటివిటీ రేటు 15.13 శాతంగా నమోదయ్యాయి. మరోవైపు ఓమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. దేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసుల సంఖ్య 8,961కు చేరింది. నిన్నటితో పోలిస్తే 0.79 శాతం కేసులు పెరిగాయి. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు ఆంక్షలు, నైట్ కర్ప్యూలు విధిస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 2500 దాటింది.

2.కొవిడ్ కు భయపడవద్దు.. లక్షణాలు కనబడగానే..ఈ క్రింది విధంగా ఫాలో అవ్వండి.1. గాస్ట్రిక్ టాబ్లెట్ Omez D పరగడుపున వేసుకోండి.
2. ఉదయం పాలు లో కొంచెం పసుపు వేసుకుని బాగా కాచి త్రాగాలి…
3.టిఫిన్ గా ఇడ్లీ అల్లం చట్నీ.
4  9 గంటలకు Azithrol 500 mg టాబ్లెట్ + Zincovit ( రోజుకు ఒకటి మాత్రమే )
5. మధ్యాహ్నం12 లోపు కొబ్బరి నీళ్ళు లేదా బార్లీ లేదా ముగ్గిన బొబ్బాస పండు లేదా గుమ్మడి కాయ సూప్ లేదా దానిమ్మ జ్యూస్..6. 2 గంటలకు వేపుడు జావ చారుతో ( మిరియాలు , ధనియాలు , పసుపు, జీలకర్ర , కరివేపాకు, కాస్త చింతపండు వేసి కాస్తారు )7. 4 గంటలకు మళ్ళీ ఏదైనా స్నాక్ విత్ హెర్బల్ టీ..( 3 రోజేస్ నాచురల్ ) 
సప్లిమెంట్ విటమిన్ C & D వేసుకోండి.8. 7 గంటలకు వేపుడు జావ మజ్జిగ తో..
9.రాత్రి 8 గంటలకు DOXT Sl 100 ( రోజుకు ఒకటి మాత్రమే )
10. పడుకునే ముందు ORS (ఎలక్ట్రోల్ పౌడర్) పెద్ద గ్లాస్ మంచినీళ్లు లో కలుపుకుని త్రాగండి. 
జ్వరం తీవ్రత ను బట్టి DOLO 650 రెండు పూటలా లేక మూడు సార్లు వేసుకోండి.దగ్గు వస్తుంటే Brozine X+ సిరప్..బాగా జ్వరం ఉంటే నుదిటి పై కర్చీఫ్ చన్నిటిలో ముంచి పిండి నుదిటి మీద పలుమార్లు వేయాలి. ఆవిరి ( పసుపు, తులసి, పచ్చ కర్పూరం నీళ్ళ లో వేసి ) తప్పని సరిగా రెండు పూటలా పట్టాలి..పూర్తి విశ్రాంతి తీసుకోండి..తప్పక తగ్గుతుంది..5/7 రోజులు పడుతుంది.భయం తో హాస్పిటల్స్ కు పరుగులు పెట్టకండి.అక్కడ అత్యవసర కేసులుకు ఆటంకం కలుగుతుంది.బాగా నీరసం వేస్తే సెలైన్ కూడా ఇంటి వద్దే అర్ ఎం పి లేక నర్సు తో గాని పెట్టించుకొండి.ఊపిరి సమస్య వస్తే ఆక్సిజన్ పెట్టాలి. అప్పుడు 104 కాల్ చెయ్యండి..ధైర్యం గా ఉండండి. ఇతర లకు దైర్యం చెప్పండి..

3.గుడ్‌ న్యూస్‌ చెప్పిన టాప్‌ సైంటిస్ట్‌ దాదాపు మూడు లక్షలకు చేరువలో కొత్త కేసులతో దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్న తరుణంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) భారీ ఊరట నిచ్చే అంశాన్ని ప్రకటించింది. మార్చి 11 నాటికి కరోనా ఎండమిక్‌ స్టేజ్‌కు చేరుకుంటుందని ఎపిడెమియోలాజికల్ విభాగానికి చెందిన సైంటిస్ట్‌ డి సమీరన్ పాండా వెల్లడించారు. డెల్టాను ఒమిక్రాన్‌ అధిగమిస్తే ఇక కరోనా అంతమైనట్టేనని భావించవచ్చన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్లేవీ ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ స్థానికంగా సాధారణ ఫ్లూగా మారుతుందని ఆయన చెప్పారు.తమ గణాంకాల ప్రకారం డిసెంబరు 11 నుండి ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు కొనసాగనుందన్నారు. దీని ప్రకారం మార్చి 11 తరువాత నుంచి కరోనా నుంచి ఉపశమనం లబించవచ్చని పాండా తెలిపారు. అయితే ఢిల్లీ, ముంబై కోవిడ్ కేసుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయా, ఇంతటితో ఉదృతి ముగిసిందా అని చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో మహమ్మారి వివిధ దశల్లో ఉందనీ, వైరస్‌లోని ఎపిడెమియోలాజికల్ వైవిధ్యాలు, కరోనా రూపాంతరాల నేపథ్యంలో ఐసీఎంఆర్‌ తన టెస్టింగ్‌ వ్యూహాన్ని కూడా మార్చుకుంది, పరీక్షల్ని తగ్గించాలని చెప్పలేదని సమీరన్ పాండా అన్నారు. హై రిస్క్‌ కాకపోతే కరోనా రోగులు కాంటాక్ట్‌ అయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవవసరం లేదనే మార్గదర్శకాలిచ్చినట్టు వెల్లడించారు. అలాగే జెనోమిక్ సీక్వెన్సింగ్ గురించి మాట్లాడుతూ, “జెనోమిక్ సీక్వెన్సింగ్ అనేది ఒక డైనమిక్ దృగ్విషయం. ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ల తీవ్రతను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తున్నామన్నారు

4.ఆర్టీపీసీఆర్‌ టెస్టు రేటును సవరించిన ఏపీ ప్రభుత్వంరాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ రేటును సవరిస్తూ ప్రభుత్వం
మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో రూ.499 వసూలుచేస్తున్నారు.
**6,996 కరోనా కేసులు గడిచిన 24 గంటల్లో (సోమవారం ఉదయం 9 నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు) రాష్ట్ర వ్యాప్తంగా 38,055 నమూనాలను పరీక్షించగా 6,996 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,534 కేసులు వెలుగుచూశాయి. విశాఖపట్నంలో 1,263, గుంటూరులో 758, శ్రీకాకుళంలో 573, అనంతపురంలో 462, ప్రకాశంలో 424, విజయనగరంలో 412 కేసులు వచ్చాయి.వైరస్‌ బారిన పడి విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. ఒక్క రోజులో 1,066 మంది కోవిడ్‌ నుంచి కోలుకోవడం విశేషం. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 21,17,384 చేరింది. ఇందులో 20,66,762 మంది సంపూర్ణంగా కోలుకున్నారు. 14,514 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 36,108 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం 3,19,22,969 శాంపిళ్లను పరీక్షించింది. 5.

5.ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు.. ఆ దర్శనాలు పూర్తిగా నిలిపివేశాం
విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు.  ఆలయంలో పలు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు.  విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కరోనా ఆంక్షలు విధించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ వెల్లడించారు.  ఆలయంలో దుర్గమ్మ అంతరాలయ దర్శనం, శఠారి పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు.  అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేసినట్లు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం ఇస్తున్నామని.. మాస్కు లేని భక్తులకు అనుమతించడం లేదన్నారు.  ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు.  కొవిడ్ ఉద్ధృతి నేపధ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నామని.. భక్తులు సహకరించాలని ఈవో కోరారు.