NRI-NRT

ఏపీ హైకోర్టుకు ఎన్నారైలు.

ఏపీ హైకోర్టుకు ఎన్నారైలు.

తమకు న్యాయం చేయాలంటూ ఏపీ హైకోర్టుకు ఎన్‌ఆర్‌ఐలు వెళ్లారు. ఐకాన్ టవర్ పేరిట రూ.33 కోట్లు సీఆర్‌డీఏకి కట్టినా నిర్మాణం పూర్తి చేయలేదంటూ 18 మంది ఎన్‌ఆర్‌ఐలు పిటిషన్ వేశారు. టవర్ నిర్మాణం కోసం అమరావతిలో భూమి కొనగా మిగిలిన రూ.17 కోట్లు తమకు వడ్డీతో సహా ఇప్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకున్న నేపథ్యంలో సీఆర్‌డీఏ మళ్లీ వచ్చింది కాబట్టి నిర్మాణం చేపట్టాలని లాయర్‌ జంధ్యాల వాదించారు. యాక్సిస్ బ్యాంక్‌లో డబ్బు వేరే అవసరలకు వాడకుండా స్టే ఇవ్వాలని  హైకోర్టును జంధ్యాల కోరారు. ఏపీఎన్‌ఆర్‌టీ, రేరా, యాక్సిస్ బ్యాంక్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కి  హైకోర్టు వాయిదా వేసింది.