Movies

శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు

శ్యామ్ సింగ రాయ్ ప్రపంచ రికార్డు

నేచురల్ స్టార్ నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీకి నెట్‌ఫ్లిక్స్‌లో ఊహించని దాని కంటే ఎక్కువే రెస్పాన్స్ సొంతం అయింది. ఫలితంగా ఇది మొదటి వారంలో ఎక్కువ మంది వీక్షించిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. దీంతో ‘అల.. వైకుంఠపురములో’ తర్వాత మరోసారి సత్తా చాటిన తెలుగు సినిమాగా పేరు సంపాదించుకుంది.
*ప్రపంచంలో మూడో స్థానం
‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ తాజాగా ఓ అరుదైన ఘనతను అందుకుంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది వీక్షించిన చిత్రాల (నాన్ ఇంగ్లీష్) జాబితాలో ఇది మూడో స్థానంలో నిలిచింది. తద్వారా ఇండియా నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.