NRI-NRT

చికాగోలో రైలు నడవాలంటే పట్టాలకు నిప్పు పెట్టాల్సిందే!

చికాగోలో రైలు నడవాలంటే పట్టాలకు నిప్పు పెట్టాల్సిందే!

పైచిత్రం చూసి ఏ తీవ్రవాదులో, నక్సలైట్లో రైల్వే ఆస్తుల్ని దహనం చేస్తున్నారని అనుకుంటే పొరపాటే రైల్వే సిబ్బందే ఇలా పట్టాలకు నిప్పు పెట్టారు . ఎందుకంటారా .. ? చలికాలంలో రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి ఈ విధంగా చేస్తుంటారట. యూఎస్లోని చికాగోలో ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో మంచు పేరుకుపోయి పట్టాలు సంకోచించి వెళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా పట్టాలకు నిప్పు పెడుతున్నారు. ఆ వెచ్చడనానికి పట్టాలు వెళ్ల ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి . అయితే, పట్టాల వెంట కనిపిస్తున్నది నిజమైన మంట కాదండోయ్. ప్రత్యేక ట్యూబులర్ హీటింగ్ వ్యవస్థతో ఏర్పడిన సెగలు చూడటానికి అవి మంటలాగే కనిపిస్తుంటాయి. వీటి వల్ల రైళ్లకు ఎలాంటి ప్రమాదముండదు. చలికాలం పోగానే ఈ వ్యవస్థను తొలగిస్తారు.