NRI-NRT

మలేషియా కువైట్‌లలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

NRI TRS Malaysia Kuwait Celebrates KCR Birthday - మలేషియా కువైట్‌లలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

###

టి.ఆర్.యస్. మలేషియా ఆధ్వర్యంలో కెసిఆర్ జన్మదిన వేడుకలు. తెరాస ఎన్ ఆర్ ఐ కో- ఆర్డినేటర్ మహేష్ బిగాల పిలుపుమేరకు టి ఆర్ యస్ మలేషియా ఎన్నారై విభాగం అధ్యక్షుడు చిరుత చిట్టిబాబు సూచనల మేరకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తెరాస మలేషియా ఆధ్వర్యంలో లైట్ హౌస్ చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ లో చిన్న పిల్లలతో కలిసి కేకు కట్ చేయడం జరిగింది. అదే విదంగా సుమారుగా 10,000/- పదివేల రూపాయలను చిల్డ్రన్ వెల్ఫేర్ హోమ్ సహాయ నిధికి చిన్నపిల్లల ఖర్చుల నిమిత్తం టిఆర్ఎస్ మలేషియా ప్రతినిధులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టి ఆర్ యస్ మలేషియా ఉపాధ్యక్షులు మారుతి కుర్మ, కార్యదర్శి గుండా వెంకటేశ్వర్లు, కోర్ కమిటీ సభ్యులు మునిగల అరుణ్, బొయిని శ్రీనివాస్, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సందీప్ కుమార్ లగిశెట్టి, సత్యనారాయణరావ్ నడిపెల్లి, రవితేజ, రఘునాత్ నాగబండి, రవిందర్ రెడ్డి, హరీష్ గుడిపాటి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

###

కువైట్ లో తెరాస NRI కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ పుట్టినరోజు సంబురాలు. తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు తెరాస ఎన్అర్ఐ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి KTR పిలుపు మేరకు తెరాస ఎన్అర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సూచనలతో తెరాస కువైట్ సభ్యులందరము దుస్తులు దానం చేయడం, మొక్కలు నాటడంతోపాటు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకోవడం జరిగింది. ఈ మధ్యలోనే అమలు చేసినటువంటి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని కూడా మన వంతుగా పాలుపంచుకొని విజయవంతం చేయాలనీ అభిలాష కోరుకున్నారు. తెలంగాణ ప్రదాత కెసిఆర్ తెలంగాణ సాధించి ఎంతో అభివృద్ధి చేయడంతోపాటు ఎన్నో అద్భుతమైన పధకాలు ప్రవేశపెట్టారు. మన పథకాలు, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకి కూడా ఆదర్శంగా నిలుస్తూ వాళ్ళ రాష్ట్రాలలో కూడా అమలు పరుస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి చెందిన విధంగా ఇండియా కూడా డెవలప్ అవ్వాలి అంటే అది కేవలం కెసిఆర్ సర్ వల్లనే అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కెసిఆర్ ని ప్రధాన మంత్రిగా చూడాలని తెరాస కువైట్ టీం తరుపున కోరుకుంటున్నాం అని అభిలాష పేర్కొన్నారు. ముఖ్య సలహాదారులు గంగాధర్ జీకే, వైస్ ప్రెసిడెంట్ రవి గన్నరపు, ప్రధాన కార్యదర్శి సురేష్ గౌడ్, కమిటీ సభ్యులు అయ్యప్ప, రవి సుధగాని, జగదీశ్ సాయి నాయుడు, మహమ్మద్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
మలేషియా కువైట్‌లలో కేసీఆర్ జన్మదిన వేడుకలు - NRI TRS Malaysia Kuwait Celebrates KCR Birthday
###