Movies

జాక్వెలిన్‌ ఫిట్‌నెస్‌ పాఠాలు!

జాక్వెలిన్‌ ఫిట్‌నెస్‌ పాఠాలు!

జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ కెమెరా ముందు హుషారుగా కనిపిస్తుంది. అలవోకగా డ్యాన్సులేస్తుంది. ఈ బాలీవుడ్‌ కథానాయిక ఫిట్‌నెస్‌ విషయంలో అందరికంటే ముందుంటుంది. వర్కవుట్స్‌, యోగాతో పాటు పోల్‌డ్యాన్స్‌ కూడా అద్భుతంగా చేస్తుంది. జాక్వెలిన్‌ చెబుతున్న తన ఫిట్‌నెస్‌ సంగతులివే..‘‘ఒకపని అలవాటుగా చేస్తే బావుంటుందనుకుంటా. వర్కవుట్స్‌ రొటీన్‌ అనిపించవు. రోజూ గంటపాటు జిమ్‌లో గడుపుతా. ఇలా కొన్ని ఏళ్ల నుంచి చేస్తున్నా. ఒకప్పుడు యాంగ్జయిటీ ఎక్కువుండేది. యోగాతో అది దాదాపు తగ్గిపోయింది. ఈ జీవితం ఆనందంగా గడపాలి. గ్రాట్యిట్యూడ్‌ ముఖ్యం అనే పాఠం యోగా చేయడం వల్లే నేర్చుకున్నా. నా వర్కవుట్స్‌లో ఫన్‌ కూడా ఉండాలని కోరుకుంటా. ఫన్‌ స్టయిల్‌లో పోల్‌ డ్యాన్స్‌ చేస్తా. శరీరాన్ని అంతా పోల్‌పై భాగంలో నిలబెట్టి హుషారుగా డ్యాన్స్‌ వేయడం వల్ల మజిల్స్‌లో పవర్‌ పెరుగుతుంది. శరీరం దృఢంగా అవుతుంది. దీంతో పాటు కాన్ఫిడెన్స్‌ నాలో బిల్డప్‌ అయింది. ఇదెంతో మంచి విషయం. ఎక్సర్‌సైజ్‌ చేయటమంటే శరీరం ప్రజెంట్‌ కావడం కాదు. మెదడూ అక్కడే ఉండాలి. అది శరీరంలో కండరాలను విశ్రాంతి ఇవ్వడమే కాదు.. మనశ్శాంతినిచ్చే విధంగా జిమ్‌ వాతావరణం ఉండాలి. మనం వర్కవుట్స్‌ చేస్తోంటే హ్యాపీ మూడ్‌ ఉంటే హ్యాపీ హార్మోన్స్‌ విడుదలవుతాయి. అందుకే జిమ్‌ చేస్తున్న వాతావరణంలో మంచి సంగీతం వింటా. ఆ సంగీతం వింటూంటే శరీరం తేలికగా ఉన్నట్లుంటుంది. కొందరు నన్ను అథ్లెటిక్‌ బాడీ అంటుంటారు. అదంతా సాధనతోనే వచ్చింది. ఒక్కరోజు కూడా వర్కవుట్స్‌ మిస్‌ అవను. ఒక కథానాయికగా అందమైన ఫిజిక్‌ మైన్‌టైన్‌ చేయాలంటే జిమ్‌లో పోల్‌ డ్యాన్స్‌, వర్కవుట్స్‌ తప్పవు.అయితే ఇంట్లో మనకి నచ్చిన పనులు చేయాలి. మనకోసం యోగా, ధ్యానం చేసుకుంటా. నచ్చినట్లుంటేనే మంచి జీవితం. ఈ శరీరాన్ని ఇట్లా సాధన చేస్తూ ఉంచుకోవటం లాంగ్‌ గేమ్‌ లాంటిదే. ఈ ఫీల్డ్‌లో ఉండాలంటే వర్కవుట్స్‌ చేయాల్సిందే. ఫిట్‌నెస్‌ తప్పనిసరి. ఏదైనా పని చేయాలంటే ఆ ప్రయాణాన్ని ఇష్టపడతా. అంతేకాని ఫలితం గురించి డ్రీమ్స్‌ పెట్టుకోను. బ్రాడ్‌థాట్‌తోనే అడుగేస్తాను. అందుకే ఒత్తిడికి గురికాను. మీరూ.. ఫిట్‌నె్‌సగా ఉండటానికి ప్రయత్నించండి. ఫిట్‌నె్‌సగా ఉండటమంటే శరీరాన్ని అదుపులో పెట్టుకోవడమే కాదు.. మానసికపరంగా బలంగా ఉండటమే. నేనిలా ఉన్నానంటే.. ఆ మంత్రం ఫిట్‌నెస్‌’’.