Business

జనవరిలో తగ్గిన విమాన ప్రయాణికులు – TNI వాణిజ్యం

జనవరిలో తగ్గిన విమాన ప్రయాణికులు  – TNI వాణిజ్యం

*దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య గత నెలలో గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత డిసెంబర్లో మొత్తం 1.12 కోట్ల మంది ప్రయాణించగా.. జనవరిలో 43 శాతం తక్కువగా 64.08 లక్షల మంది విమాన సేవలను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలను పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ విడుదల చేసింది. స్పైస్జెట్ లోడ్ ఫ్యాక్టర్ (ప్రయాణికుల భర్తీ) 73.4 శాతంగా ఉంది. ఇండిగో 66.6 శాతం, విస్తారా 61.6 శాతం, గోఫస్ట్ 66.7శాతం. ఎయిర్ ఇండియా 60.6 శాతం, ఎయిరేషియా 60.5 శాతం చొప్పున లోడ్ ఫ్యాక్టర్ సాధించాయి.ఇండిగో అత్యధికంగా 35.57 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. దేశీయంగా 55.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. స్పైస్జెట్ 6.8 లక్షల మంది, ఎయిర్ ఇండియా (6.56 లక్షలు), గోఫస్ట్ (6.35 లక్షలు), విస్తారా (4.79 లక్షలు), ఎయిరేషియా ఇండియా (2.95 లక్షలు), అలియన్స్ ఎయిర్ 0.80 లక్షల మంది చొప్పున ప్రయాణికులను తీసుకెళ్లాయి. మెట్రో నగరాల నుంచి 94.5 శాతం మేర సకాలంలో విమాన సేవలను అందించి గో ఫస్ట్ ముందుంది. ఇండిగో 93.9 శాతం, విస్తారా 93.6 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి

*వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీదారులకు శుభవార్త..!
వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీదారులకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఐఆర్‌డీఏఐ) గుడ్ న్యూస్ ను అందించింది. ఇకపై వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు జీవితాంతం వరకు కొనసాగించేలా నిబంధనలను తీసుకొచ్చేందుకు ఐఆర్‌డీఏఐ ముసాయిదాను విడుదల చేసింది.పాలసీ పునరుద్ధరణకు ఓకే..!ఆయా పాలసీ కంపెనీలు వయసును కారణంగా చూపించి వ్యక్తిగత బీమా పాలసీ పునరుద్ధరణకు నిరాకరించకూడదని ఐఆర్‌డీఏఐ ముసాయిదాలో పేర్కొంది. అంతేకాకుండా ఆరోగ్య బీమా పోర్టబులిటీకి నిర్ణీత సమయాన్ని కేటాయించాలని తెలిపింది. బీమా పోర్టబిలిటీ విషయంలో సదరు వ్యక్తికి ఉన్న ఆరోగ్య బీమా పాలసీకి చెందిన బీమా సంస్థను మార్చుకోవాలనుకున్నప్పుడు, దీనికోసం దరఖాస్తు చేసిన ఐదు రోజుల్లోగా కొత్త బీమా సంస్థ, పాత సంస్థ నుంచి సమాచారం తెప్పించుకోవాలనే నిబంధనను కూడా ఐఆర్‌డీఏఐ ప్రతిపాదించింది. దీంతో సదరు పాలసీదారుడికి కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది.పాలసీదారుడి రిస్క్‌ ప్రొఫైల్‌ మారినప్పుడు ప్రీమియంలో రాయితీలు కూడా ఇవ్వాలని కోరింది.

* యూఏఈ- భారత్ ‘స్వేచ్ఛా వాణిజ్య’ బంధం
భారత-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ యువరాజు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మధ్య వర్చువల్గా జరిగిన సమావేశం ఇందుకు వేదికైంది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక మంత్రి అబుల్లా బిన్ టౌక్ అల్ మర్రి ఇందుకు సంబంధించిన పత్రాలపై సంతకాలు చేశారు.దీంతో రెండు దేశాల మధ్య ప్రస్తుతం 6,000 కోట్ల డాలర్లు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం ఐదేళ్లలో 10,000 కోట్ల డాలర్లకు చేరుతుందని యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో రెండు దేశాలు ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం రెండు దేశాలకు ఉభయ తారకంలా పని చేస్తుందని పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు పేర్కొన్నాయి.

*నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ కోలొకేషన్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఈఓ చిత్ర రామకృష్ణను సీబీఐ ప్రశ్నించింది. చిత్రతో పాటు మరో మాజీ సీఈఓ రవి నారాయణ్, మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ దేశం వదిలి వెళ్లకుండా నిరోధించేందుకు వారిపై లుకౌట్ సర్క్యులర్లు కూడా సీబీఐ జారీ చేసింది. ఈ కేసులో సెబీ, ఎన్ఎ్సఈకి చెందిన ఇతర అదృశ్య అధికారులెవరైనా ఉన్నారా అనే అంశాన్ని కూడా సీబీఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

*భారత పారిశ్రామిక దిగ్గజం వేదాంత ఎలక్ర్టానిక్.. చిప్, డిస్ప్లే తయారీ రంగంలోకి ప్రవేశిస్తోది. ఇందుకోసం 1,500 కోట్ల డాలర్లు (రూ.1.13 లక్షల కోట్లు) కేటాయించింది. రాబో యే కాలంలో ఈ పెట్టుబడిని 2,000 కోట్ల డాలర్లకు (రూ.1.5 లక్షల కోట్లు) పెంచాలనుకుంటున్నట్టు వేదాంత గ్రూప్నకు చెందిన డిస్ప్లే, సెమీ కండక్టర్ విభాగం గ్లోబల్ ఎండీ ఆకర్ష్ హెబ్బార్ తెలిపారు. మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ర్టానిక్స్ డివై్సలలో ఉపయోగించే డిస్ప్లే యూనిట్లను 2024 నాటికి వాణిజ్యపరంగా మార్కెట్లో విడుదల చేయాలనుకుంటున్నట్టు చెప్పారు.

* ఆగ్రో కెమికల్స్ కంపెనీ పీఐ ఇండస్ట్రీస్.. వరి పంటలో వచ్చే దోమకాటు, సుడి తెగులును నివారించే కీటక నాశిని ‘డిస్ట్రప్టర్’ను తీసుకువచ్చింది. శుక్రవారం నాడు కంపెనీ సీఈఓ ప్రశాంత్ హెగ్డే ఈ పెస్టిసైడ్ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కీటక నాశినిని వివిధ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ఈ ఉత్పత్తిని కర్ణాటక, తూర్పు భారత్లోని రాష్ట్రాల్లోని విడుదల చేయనున్నట్లు తెలిపారు.

* చ్చే వారం హైదరాబాద్లో జరగనున్న బయో ఏషియా 2022 సదస్సులో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ సద స్సు సందర్భంగా ఆయన వర్చువల్గా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో మాట్లాడనున్నారు. కొవిడ్ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, గత రెండేళ్లలో నేర్చుకున్న అనుభవాలు, కొత్త పోకడలపై ఆయన కేటీఆర్తో చర్చిస్తారు. బిల్ గేట్స్తో జరిగే చర్చ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు.

* తెలంగాణలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టాలని ఎంఆర్ఎఫ్ ఇండియా నిర్ణయించింది. గురువారం నాడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావును ఎంఆర్ఎఫ్ ఇండియా వైస్ చైర్మన్, ఎండీ అరుణ్ మమ్మెన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో కంపెనీ ప్లాంట్ను నిర్వహిస్తోందని, కార్యకలాపాల విస్తరణలో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడితో కొత్త అసెంబ్లీ లైన్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కాగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎ్సఆర్)లో భాగంగా ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి రూ.4 కోట్లను అందించనున్నట్లు ఈ సందర్భంగా ఎంఆర్ఎఫ్ ప్రకటించింది. మరోవైపు అసోచామ్ ప్రతినిధుల బృందం కూడా మంత్రి కేటీఆర్ను కలుసుకుంది.

* న్యూజిలాండ్కు చెందిన అవంతి భారత సైకిల్ మార్కెట్లోకి ప్రవేశించింది. పురుషులు, మహిళల కోసం ‘అవంతి గిరో ఎఫ్ఎం1’ సైకిళ్లను విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ.40,990. రాబోయే ఆరు నెలల కాలంలో 12 మోడళ్లను మార్కెట్లోకి తేవాలన్నది తమ లక్ష్యమని ప్రకటించింది. దీంతో మైక్రోషిఫ్ట్ ఎకోలైట్ టెక్నాలజీ బైక్లు భారతమార్కెట్లో తొలిసారి ప్రవేశించినట్టవుతుంది. సాధారణంగా హై ఎండ్ బైక్లలోనే కనిపించే స్ర్పింగ్ లాక్ (క్లచ్) మెకానిజం కూడా దీనికి ఉంది.

* ఏబీజీ షిప్యార్డుపై ఉచ్చు బిగుస్తోంది. కంపెనీపైనా, దాని మాజీ ప్రమోటర్లపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం క్రిమినల్ కేసులు ఫైల్ చేసింది. అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టంలో (పీఎంఎల్ఏ) వివిధ సెక్షన్ల కింద ఈడీ ఈ కేసు నమోదు చేసింది. రుణాల పేరుతో బ్యాంకులను రూ.22,842 కోట్ల మేర ముంచారనే ఆరోపణలపై ఏబీజీ షిప్యార్డు, దాని మాజీ ప్రమోటర్లపై సీబీఐ ఇప్పటికే కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది