DailyDose

విశాఖ జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు – TNI తాజా వార్తలు

విశాఖ జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు  – TNI తాజా వార్తలు

*విశాఖ జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. యువకుడిని వైసీపీ ఎంపీపీ చితకబాదారు. జగన్ సర్కార్ పాలనపై యువకుడు ప్రశ్నించారు. దీంతో బలవంతంగా యువకుడిని చితకొట్టి క్షమాపణలు చెప్పించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

* కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌ పుట్టిన రోజు సందర్భంగా అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఆయన ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. అయితే అమిత్ షా నుంచి ఫోన్ వస్తుందని థరూర్ ఊహించలేదు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు.

*విలువ ఆధారిత విద్యతోనే సమాజానికి మేలు కలుగుతుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో బుధవారం నిర్వహించిన రెండో స్నాతకోత్సవంలో అమరావతి నుంచి కులపతి హోదాలో గవర్నర్‌ విశ్వభూషణ్‌ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. సమాజంలో ఉన్న సవాళ్లను ఎదుర్కొనేలా యువత నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ‘నాణ్యమైన ఉన్నత విద్యకు పటిష్టతమైన నియంత్రణ, పారదర్శకత ఉండేలా వ్యవస్థలు అవసరం. సామాజిక స్పృహ కలిగేలా యువతను తయారు చేయాలి. కోవిడ్‌ కారణంగా అన్ని రంగాలతో పాటు విద్యారంగంపై కూడా తీవ్ర ప్రభావం పడింది. సామాజిక బానిసత్వం అణిచివేతకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి విద్య సరైన ఆయుధం. నూతన జాతీయ విద్యా విధానం విద్యాభివృద్ధికి ఒక ప్రణాళికను నిర్ధేశించింది. 2035 నాటికి ఉన్నత విద్యలో స్థూల నమోదు 50 శాతం ఉండాలి’ అని గవర్నర్‌ విశ్వభూషణ్‌ తెలిపారు.

*శాసనసభ వ్యవహారాలు చూస్తే బాధ కలుగుతుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. శాసనసభలో ప్రతిపక్షాలకు ఎలా సమాధానం‌ చెప్పాలో రోశయ్యను చూసి నేర్చుకోవాలన్నారు. రోశయ్యకు సంతాప తీర్మానం పెట్టకపోవడం విచారకరమన్నారు. సమావేశాలు ముగిసే లోపు రోశయ్యకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం రోశయ్య లాంటి వారి గురించి సభలో చర్చించాలన్నారు. నేటితరం ప్రజాప్రతినిధులకు రోశయ్య పనితీరు వివరించాలన్నారు. సీఎం స్పందించాలని జనసేన తరపున విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

*చుట్టుగుంట సెంటర్ వద్ద బీజేపీ మహాదర్నా చేపట్టింది. తామర పురుగులతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ మహా ధర్నాకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుబీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ ఎంపీలు జీవీఎల్ సిఎం రమేష్ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి పొగాకు బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ్ బాబు కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ వల్లూరి జయప్రకాశ్ నారాయణ కిసాన్ మోర్చా అధ్యక్షుడు శశిభూషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

*ఏపీ, అమరావతి రాజధానికోసం కోసం ఢిల్లీకి యువకుడి పాదయాత్ర చేపట్టాడు. అమరావతి నుంచి ఢిల్లీకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన శేఖర్ 41 రోజుల పాటు పాదయాత్ర చేశాడు. ఏపీని కేంద్రం కాపాడాలని, అమరావతిని అభివృద్ధి చేయాలని కోరుతూ మోడీ, పవన్ ఫ్లెక్సీలతో పాదయాత్రగా ఏపీ భవన్ చేరుకున్నాడు. ప్రధాని మోడీని కలవాలని శ్రీకాకుళం జిల్లా వాసి శేఖర్‌ ఆరాటపడుతున్నాడు.

* చెన్నైలో బుధవారం ఉదయం జరిగిన తమిళనాడు డీఎంకే పార్లమెంట్‌ సభ్యురాలు తమిళచ్చి తంగపాండ్యన్‌ కుమార్తె వివాహవేడుకల్లో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, పెరియసామి, ఈవీ వేలు, తంగం తెన్నరసు, రాజాకన్నప్పన్‌, ఎంపీలు కనిమొళి, సుప్రియ సులే, ఏ. రాజా పాల్గొన్నారు. వీరందరితోపాటు కేశినేని శ్రీనివాస్‌ కూడా వధువరూలతో నిలిచి గ్రూప్‌ ఫోటో కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన చెన్నైకి చెందిన తెలుగు దేశం నాయకులతో భేటీ అయ్యారు.

* మాజీ సీఎం, తమిళనాడు గవర్నరర్ కొణిజేటి రోశయ్య మృతికి అసెంబ్లీలో తీర్మానం చేయాలని హిందూపురంలో ఆరవైశ్యులు డిమాండ్ చేశారు. ఆర్యవైశ్య సంఘం, టీడీపీ వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ర్యాలీగా పొట్టిశ్రీరాములు విగ్రహం వద్దకు చేరుకొని పూలమాలలు వేసి వినతి అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కొణిజేటి రోశయ్య ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారని, 40 ఏళ్లుగా రాజకీయ అనుభవం ఉన్న అలాంటి మహనీయుడి పట్ల అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం బాధాకరమన్నారు. వైఎస్‎కు రోశయ్య అత్యంత సన్నిహితుడిగా మెలిగారని, ఆయనకు ఆ గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్య వైశ్యుల ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేయాలని, లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని, పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

* ఛాలెంజ్ చేస్తున్నారు కదా..ఎన్నికలకు వెళదామంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీకి సవాల్ చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎపుడు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇంకా వ్యతిరేకత పెరిగితే నష్టం జరుగుతుందని.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అన్నారు. తోందర్లోనే ఎన్నికలు వస్తాయని ప్రజలు అనుకుంటున్నారని.. మేము కూడా భావిస్తున్నామని అన్నారు. ఈసారి టీడీపీకి 160 సీట్లు వస్తాయన్నారు. గుడ్డిగా చెప్పడం లేదని, రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు

* ఈ ప్రభుత్వాన్ని రైతులే బంగాళాఖాతంలో కలుపుతారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమాలను సీఎం జగన్‌ పోలీసులతో అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. ఉత్సవ విగ్రహంలా మారిన వ్యవసాయ మంత్రి కన్నబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చిన్నచిన్న ప్రాజెక్టులను కూడా ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? అని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా బిజెపి ఉద్యమానికి సిద్ధమైతే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుంటుందని ద్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మిస్తుంటే రాష్ట్రం భజన చేస్తుందని విమర్శించారు. వెయ్యి కోట్ల రూపాయలతో చిన్న చిన్న ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారని విష్ణువర్దన్‌రెడ్డి ప్రశ్నించారు.

* కక్ష సాధింపు కోసమే జగన్ అధికారంలోకి వచ్చాడని టీడీపీ సీనియర్ నేత చినరాజప్ప అన్నారు. జగన్ దుర్మార్గంతో ఎన్నో పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలపై మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేశాదరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దాడులు, కిడ్నాప్‌లు, బెదిరింపులతో స్థానిక ఎన్నికల్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. సొంత కంపెనీ సిమెంట్ ధరలు పెంచేందుకు ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.

* చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జైకేసారం గ్రామానికి చెందిన అండాలు(60) అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆర్పివేసి వెంటనే సదరు మహిళను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఘర్షణనే ఆత్మహత్యాయత్నానికి గల కారణమని పోలీసులు భావిస్తున్నారు

* రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో వివిధ జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్‌లు తరలివచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్‌వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌ల సమస్యలను శాసనమండలిలో చర్చకు పెడతామన్నారు. 2005 నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం అమలవుతుందని, పీల్ అసిస్టెంట్‌ల శ్రమ వల్లే ఇంత కాలంగా ఇది సాగుతోందన్నారు. ప్రభుత్వానికి అవార్డులు వచ్చాయంటే వారి కృషి వల్లే అన్నారు

* తిరుణాళ్లలో మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పార్టీ జెండాలు పట్టుకుని తిరుగుతూ… యువకులను రెచ్చగొడుతున్నాడని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. రాత్రి బొగ్గరం తిరుణాళ్ళలో పోలీసులపై, తన కారుపై రాళ్ళు వేశారన్నారు. జీవి మాటలు విని అమాయకులు బలి కావద్దని సూచించారు. తనపై కక్ష ఉంటే తనతో తేల్చుకోవాలని.. అమాయకుల జీవితాలతో ఆడుకోవద్దన్నారు.