Business

రిలయన్స్‌ సీబీఎం గ్యాస్‌కు 23 డాలర్ల రేటు – TNI వాణిజ్యం

రిలయన్స్‌ సీబీఎం గ్యాస్‌కు 23 డాలర్ల రేటు – TNI వాణిజ్యం

* మధ్యప్రదేశ్‌లోని బొగ్గు క్షేత్రం నుంచి ఉత్పత్తి చేసే కోల్‌–బెడ్‌ మీథేన్‌ (సీబీఎం) గ్యాస్‌ను యూనిట్‌కు (ఎంబీటీయూ) 23 డాలర్లకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విక్రయించింది. ఈ రేటుకు 0.65 ఎంసీఎండీ (రోజుకు మిలియన్‌ ప్రామాణిక ఘనపు మీటర్లు) మేర గ్యాస్‌ను గెయిల్, జీఎస్‌పీసీ, షెల్‌ తదితర సంస్థలకు సరఫరా చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్రెంట్‌ క్రూడాయిల్‌ బేస్‌ ధరకు 13.2 శాతం ప్రీమియంతో రిలయన్స్‌ బిడ్లను ఆహ్వానించింది. దీని ప్రకారం ఎంబీటీయుకి బేస్‌ ధర 15.18 డాలర్లుగా నిర్ణయించగా, గెయిల్‌ తదితర సంస్థలు మరో 8.28 డాలర్ల ప్రీమియం కోట్‌ చేయడంతో తుది ధర 23.46 డాలర్లకు చేరింది.
*మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్న బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లకు ఫ్లిప్‌ కార్ట్‌ బంపరాఫర్‌ ప్రకటించింది. రూ.16,099 ఖరీదైన స్మార్ట్‌ ఫోన్‌ ను కేవలం రూ.3,099కే అందిస్తుీన్నట్లు తెలిపింది. హోలీ పండుగ సందర్భంగా ఫ్లిప్‌ కార్ట్‌ మార్చి 12 నుంచి 16 వరకు ఈ సేల్ నిర్వహిస్తుంది. అంతకంటే ముందే రియల్‌ మీ 8 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 3 వేలకే కొనుగోలు చేయోచ్చని తెలిపింది.
*గ్రీన్‌ పవర్‌ దిశగా ప్రపంచం పెట్టుకున్న లక్ష్యాలను అందుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగం కలిసి పని చేయాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్వహించిన 9వ రీజినల్‌ యాక్షన్‌ గ్రూప్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. గ్రీన్‌ పవర్‌ లక్ష్యాలను పూర్తి చేయాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు అవసరమని, ఇందుకు సంబంధించి ప్రభుత్వాలు..విధానాలు రూపొందించటం, వాటి అమలు విషయంలో మరింత వేగంగా ముందుకు పోవాలని సూచించారు.
*మొబైల్‌ నంబర్‌ పోర్టబిలిటీ (ఎంఎన్‌పీ) ఆంక్షలపై టెలికాం వివాదాల పరిష్కారాల ట్రైబ్యునల్‌ (టీడీశాట్‌) కీలక తీర్పు ఇచ్చింది. ఇందుకోసం ఖాతాదారుల నుంచి వచ్చే ఎస్‌ఎంఎస్‌ వినతులపై టెలికాం కంపెనీలు ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని స్పష్టం చేసింది. గత ఏడాది డిసెంబరులో ట్రాయ్‌ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. వొడాఫోన్‌ ఐడియా దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. టారిఫ్‌ ప్లాన్లతో నిమిత్తం లేకుండా ఖాతాదారులు అందరికీ కంపెనీలు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎంఎన్‌పీని అనుమతించాలని స్పష్టం చేసింది.
*భారత రిటైల్‌ మార్కెట్‌పై పట్టు కోసం ముకేశ్‌ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఫ్యూచర్‌ రిటైల్‌ కంపెనీకి సబ్‌ లీజుకు ఇచ్చిన 950 స్టోర్ల సబ్‌లీజు ఒప్పందాన్ని రద్దు చేసింది. ఫ్యూచర్‌ రిటైల్‌ ఈ స్టోర్ల లీజు మొత్తం చెల్లించలేక పోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు రిలయన్స్‌ తెలిపింది. దీంతో ఈ స్టోర్లలో పని చేస్తున్న వేలాది మంది భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారింది.
*నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ (ఎన్‌ఐఎన్‌ఎల్‌)లో తనకున్న 10.10 శాతం వాటాను టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌ (టీఎ్‌సఎల్‌పీ)కి విక్రయించడానికి ఎన్‌ఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో వాటాను టాటా స్టీల్‌కు విక్రయించడానికి భెల్‌ కూడా షేర్ల విక్రయ, ఎస్ర్కో ఒప్పందాలను కుదుర్చుకుంది. కాగా ఈ-ఆక్షన్‌ ద్వారా మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల్లో వెలికి తీసిన 8,337 క్యారెట్ల ముడి వజ్రాలను వజ్రాల వ్యాపారులకు విక్రయించినట్లు ఎన్‌ఎండీసీ తెలిపింది.
*నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌ (ఎన్‌ఐఎన్‌ఎల్‌)లో తనకున్న 10.10 శాతం వాటాను టాటా స్టీల్‌ లాంగ్‌ ప్రొడక్ట్స్‌ (టీఎ్‌సఎల్‌పీ)కి విక్రయించడానికి ఎన్‌ఎండీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌ఐఎన్‌ఎల్‌లో వాటాను టాటా స్టీల్‌కు విక్రయించడానికి భెల్‌ కూడా షేర్ల విక్రయ, ఎస్ర్కో ఒప్పందాలను కుదుర్చుకుంది. కాగా ఈ-ఆక్షన్‌ ద్వారా మధ్యప్రదేశ్‌లోని పన్నా వజ్రాల గనుల్లో వెలికి తీసిన 8,337 క్యారెట్ల ముడి వజ్రాలను వజ్రాల వ్యాపారులకు విక్రయించినట్లు ఎన్‌ఎండీసీ తెలిపింది.
*దక్షిణాదిలో వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగా ఆహార ఉత్పత్తుల కంపెనీ బికానో హైదరాబాద్‌లో ప్లాంట్‌ను ప్రారంభించింది. ముందుగా తెలంగాణ మార్కెట్లోకి ఉత్పత్తులను ప్రవేశపెడతామని.. ఆ తర్వాత దశల వారీగా దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరిస్తామని బికనేర్‌వాలా ఫుడ్‌ డైరెక్టర్‌ మనీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. ముందుగా నమ్‌కీన్స్‌, స్వీట్ల విభాగంలో అడుగు పెట్టనున్నట్లు చెప్పారు. వీటిని హైదరాబాద్‌ ప్లాంట్‌లో తయారు చేస్తారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కు ఈ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తులు సరఫరా అవుతాయి.
*భారత్‌ నుంచి విమానాల్లో విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు శుభవార్త. వీరి విమాన చార్జీలు త్వరలో 40 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై గత రెండేళ్లుగా ఉన్న నిషేఽధాన్ని ప్రభుత్వం ఈ నెల 27 నుంచి ఎత్తివేస్తోంది. దీంతో విదేశీ విమానయాన సంస్థలతో పాటు దేశీయ విమానయాన సంస్థలూ తమ సర్వీసులు భారీగా పెంచబోతున్నాయి. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు కొవిడ్‌కు ముందున్న స్థాయికి వస్తాయని పరిశ్రమ వర్గాల అంచనా. అయితే చమురు సెగతో ఆయిల్‌ కంపెనీలు విమాన ఇంధన చార్జీలు పెంచుతూ పోతే మాత్రం చార్జీలు పెద్దగా తగ్గక పోవచ్చని భావిస్తున్నారు.
*ఫ్యూచర్ ’ గ్రూపునకు చెందిన 950 స్టోర్ల సబ్‌లీజు రద్దుకు సంబంధించి రిలయన్స్ నోటీసులు పంపింది. వీటిలో… 835 ఫ్యూచర్ రిటైల్ స్టోర్లు, మరో 112 ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ స్టోర్లు ఉన్నాయి. వీటి లీజును రద్దు చేయాలని కోరుతూ తమకు నోటీసులు అందజేసినట్లు కిషోర్ బియానీ నేతృత్వంలోని రుణభారంతో కూడిన ఫ్యూచర్ గ్రూప్ సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లలో వెల్లడించాయి. భారత రిటైల్ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో చోటుచేసుకున్న ఈ తాజా మలుపులో… ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ గతంలో తీసుకున్న 950 స్టోర్ల సబ్ లీజులను రద్దు చేసినందుకు ఫ్యూచర్ రిటైల్‌పై నోటీసులు జారీ చేసింది. కిందటి నెలలో… ఫ్యూచర్ గ్రూప్ లీజు అద్దె చెల్లించకపోవడంతో… స్టోర్ స్థలాలను రిలయన్స్ రిటైల్ స్వాధీనం చేసుకుంది. ఇవి ఆపరేషన్ కోసం ఫ్యూచర్ గ్రూపునకు సబ్‌లెట్ లో ఉన్నాయి. ‘రిలయన్స్ ఎంటిటీల నుండి సబ్‌లీజుకు తీసుకున్న ఆస్తులకు సంబంధించి కంపెనీ నిర్దిష్ట ముగింపు నోటీసు(లు)ను అందుకుంది’ అని ఫ్యూచర్ రిటైల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.