DailyDose

డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌ -TNI నేర వార్తలు

డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు అరెస్ట్‌ -TNI నేర వార్తలు

*డ్రగ్స్‌ కేసులో కీలక నిందితుడు లక్ష్మీపతిని నార్కోటిక్‌ వింగ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. నల్లకుంటలో బీటెక్‌ విద్యార్థి మృతి కేసులో కీలక సూత్రధారిగా లక్ష్మీపతి ఉన్నాడు. హైదరాబాద్‌లో పలువురికి హాష్ ఆయిల్ సప్లై చేసేవాడు. ఏడేళ్లుగా గంజాయికి బానిసైన లక్ష్మీపతి.. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మేవాడు. ఏజెన్సీ నుంచి హాష్‌ ఆయిల్ తీసుకువచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. లక్ష రూపాయలకు లీటర్ హాష్‌ ఆయిల్ కొనుగోలు చేసి హైదరాబాద్‌లో లీటర్‌ రూ.8 లక్షలకు అమ్మేవాడు. ప్రేమ్‌కుమార్‌ అనే వ్యక్తితో కలిసి లక్ష్మీపతి డ్రగ్స్‌ అమ్మకాలు కొనసాగించాడు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి విద్యార్థులకు సరఫరా చేసేవాడు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎంటీ శాతవాహన నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కూతురు శారోన్ దీపిక(4)తో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా.. నిర్మాణంలో ఉన్న నీటి ట్యాంక్ గోడ కూలి పడింది. దీంతో దీపిక అక్కడికక్కడే మృతి చెందింది.

*నెల్లూరు: జిల్లాలోని కొండాపురం మండలం మర్రిగుంటలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు అనుమ(25), ప్రవీణ్(10)గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు

*మరిపెడ మండలం చింతలగడ్డ తండాలో దారుణం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ బావుల వద్ద వేర్వేరుగా నవీన్ (35) ,శారద (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఆత్మహత్యలకు ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమసంధం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

*గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో నాలుగో అంతస్తులో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం తెలియడంతో సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*మధ్యప్రదేశ్‌లోని ఇందోర్లో దారుణం జరిగింది. వేరే వ్యక్తితో ప్రేమకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదన్న కోపంతో.. తన అన్న ఇంటికి నిప్పంటించింది ఓ మహిళ. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సజీవ దహనమయ్యారు.

*హంగేరీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా.. 20మందికి పైగా ప్రయాణికులు క్షతగాత్రులయ్యారని పోలీసులు వెల్లడించారు.

*మరిపెడ మండలం చింతలగడ్డ తండాలో దారుణం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ బావుల వద్ద వేర్వేరుగా నవీన్ (35) ,శారద (32) ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఆత్మహత్యలకు ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధమే కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమసంధం ఇరు కుటుంబాలకు తెలియడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

*శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మధుర నగర్ కాలనీలో ఐదు అంతస్థుల భవనంపై నుంచి కిందపడి నాగరాజు అనే కార్మికుడు మృతి చెందాడు. నిర్మాణంలో ఉన్న భవనానికి పెయింటింగ్ చేస్తూ కింద పడిపోయాడు. తోటి కార్మికులు గమనించి హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నాగరాజు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు

*రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రాంబాగ్‌లో పసి బాలుడి మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు బాలుడి మృతదేహాన్ని చెత్త కుండిలో పడేసి వెళ్లినట్టు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

*శ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పల్లిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కల్యాణి (19)అనే యువతిపై గ్రామ సర్పంచ్ కుమారుడు సాయి ప్రసాద్ అత్యాచార యత్నం చేశాడు. కల్యాణి ప్రతిఘటించడంతో ఆమెను కొట్టి చంపేశాడు. గ్రామ పెద్దలు రాజీ కుదిర్చి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు దహన సంస్కారాలను అడ్డుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

*ఉద్యోగం రావడం లేదన్న మనస్తాపంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పాండురంగాపురం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు, శివరాణి దంపతుల కుమారుడు అజయ్‌(25) బీటెక్‌ పూర్తి చేశాడు. తొలుత ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేసి కొన్ని నెలలుగా ఇంటివద్దే ఉంటున్నాడు. పలు ఉద్యోగాల కోసం ప్రయత్నించినప్పటికీ రాలేదు. మనస్తాపం చెందిన అజయ్‌ గత నెల 20న పంటచేనుకు వెళ్లి పురుగుమందు తాగాడు. ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు పాల్వంచ గ్రామీణ ఎస్సై సుమన్‌ తెలిపారు.

*పెరంబలూరు సమీపంలో కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. కళ్లకురిచ్చికి చెందిన కార్ముగిల్‌ తొమ్మిదిమంది బంధువులతో కలసి కారులో మదురై జిల్లా సమయపురం మారియమ్మన్‌ ఆలయానికి వెళ్లాడు. దర్శనానంతరం స్వస్థలానికి బయలు దేరారు. పెరంబలూరు జిల్లా కారై జంక్షన్‌ వద్ద ఓ హోటల్లోకి వెళ్లేందుకు కారు తిప్పుతుండగా, పక్క నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కార్ముగిల్‌ (45), ఆయన కుమారుడు లింగేద్రన్‌ (8), బంధువులు కన్నన్‌ (45), తమిళరసి (65) అక్కడికక్కడే మృతిచెందారు. చంద్రదన్‌, కిషోర్‌, వేదవల్లి, కదిరవన్‌ తీవ్రం గా గాయపడ్డారు. స్థానికులు వారిని పెరంబలూరు ఆస్పత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడు ఆమె ప్రతిఘటించడంతో హత్యచేసి పరారయ్యాడు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ళ మండలం పల్లిపాలెంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిప్పాల కల్యాణి (తన అమ్మమ్మ ఒడుగు దుర్గ వద్ద ఉంటోంది. తండ్రి మృతి చెందడంతో తల్లి ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంది. గ్రామ సర్పంచ్‌ తిరుమలశెట్టి శకుంతలభాస్కరరావు పెద్దకుమారుడు సాయిప్రసాద్‌ అలియాస్‌ నాని ఆదివారం అర్ధరాత్రి కల్యాణి నిద్రిస్తున్న గదిలోకి చొరబడ్డాడు. ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడగా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను హత్యచేసి పారిపోయాడు. వేరొక గదిలో నిద్రిస్తున్న అమ్మమ్మ దుర్గ వచ్చి తలుపులు తీసి చూడగా కల్యాణి అప్పటికే రక్తపు మడుగలో పడి ఉంది. దీంతో ఆమె పెద్దగా కేకలు వేసింది. సర్పంచ్‌ కుమారుడు సాయిప్రసాద్‌ ఆ ఇంటినుంచి పారిపోవడం చూసినట్లు స్థానికులు ఆమెకు చెప్పారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపడంతో గ్రామపెద్దలు రాజీ కుదిర్చి యువతి మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు శ్మశానానికి తరలించారు. సమాచారం అందుకున్న కాళ్ళ పోలీసులు దహన సంస్కారాలు అడ్డుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

*ఆ ముగ్గురూ.. ఆరునాలుగో తరగతి విద్యార్థులు. ఆదివారం బడికి సెలవు కావడంతో.. సరదాగా చెరువులో ఈత నేర్చుకోవాలనుకున్నారు. ఇందుకుగాను సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సరదానే వాళ్ల పాలిట శాపమైంది. వారి నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామానికి చెందిన మారంపెల్లి శరత్‌ (పబ్బతి నవదీప్‌ (11), గొలుసుల యశాంత్‌ (13).. ఈ విషాధ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయమే ఈ ముగ్గురు బాలురూ గ్రామ సమీపంలోని ఊరకుంట చెరువు వద్దకు వెళ్లారు. అలా.. సరదాగా ఈత నేర్చుకునేందుకు ముగ్గురూ చెరువులో దిగారు. అనుకోకుండా లోతైన ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో.. ఆ నీటిలో మునిగిపోయారు. ఊపిరాడక.. ఉక్కిరి బిక్కిరై ప్రాణాలు విడిచారు. చెరువు వద్ద వీరి చెప్పుల్ని గుర్తించిన గ్రామస్థులు.. గాలించగా.. ముగ్గురి మృతదేహాలూ బయటపడ్డాయి. మృతుల్లో శరత్‌.. ఆరో తరగతి చదువుతుండగా.. యశాంత్‌, నవదీప్‌ నాలుగో తరగతి చదువున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మం. కె.తిమ్మాపురంలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేశారని నవవధువు రేణుక(ఆత్మహత్య చేసుకుంది.రెండు నెలల క్రితమే వీరేష్‌తో రేణుకకు వివాహం జరిగింది.ఉగాది పండుగకు పుట్టింటికి వెళ్లి అత్తారింటికి వచ్చిన కొద్ది సేపటికే రేణుక ఆత్మహత్యకు పాల్పడింది. రేణుక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.రేణుక ఆత్మహత్యపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

*తిరువూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను వెనకనుంచి ఢీ-కొన్న ఆరంజ్ ట్రావెల్స్ బస్సు..గత రాత్రి 10- 30 ని”లకు తిరువూరు నుండి మియాపూర్ సర్వీస్ (3794) బయలుదేరిన బస్సు..తెల్లవారుజామున 4-30 గంటలకు హైద్రాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీ శివారులో ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో వెనుక నుంచి ఢీ-కొన్న వైనం..ఈ ప్రమాదంలో బస్సు వెనుక సీట్లలో కూర్చున్న పలువురు ప్రయాణికులు గాయాలపాలైన ట్లు సమాచారం.