Politics

కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయి – TNI రాజకీయ వార్తలు

కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయి – TNI రాజకీయ వార్తలు

* కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని, దీన్ని బట్టే జగన్ విశ్వసనీయత ఏమిటో అర్థమవుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రావణుడి వలే జగన్‌కూ 10 అవినీతి తలలు ఉన్నాయన్నారు. అదానీకి మేలుచేయడానికి విద్యుత్ రంగాన్ని.. సీఎం నాశనం చేస్తున్నారని అధికారులే వాపోయారన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో 1500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగినా..15 మంది నిందితులకు కూడా శిక్షపడలేదని ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.మూడేళ్ల జగన్ రెడ్డి పాలన నిజంగానే ప్రజలకు ఏడుపే మిగిల్చిందని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశామా అని ప్రజలు రోజూ ఏడుస్తుంటే, ఆయనేమో ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయంటున్నారని మండిపడ్డారు. ఎల్లోమీడియా గొప్పతనం గురించి మాట్లాడే జగన్ రెడ్డి, గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన బ్లూ మీడియాను చూసిగర్వపడాల్సిందేనన్నారు. పింక్ డైమండ్.. కోడికత్తి కథలను బ్లూ మీడియాలో చూపిన విధంగా ఎవరైనా చూపించారా?.. ఆకథలన్నీ ఏమయ్యాయో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.

*నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబే..: దేవతోటి నాగరాజు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కట్టుబట్టలతో అమరావతికి వచ్చి నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనుభవంలేక, పరిపాలించడం చేతకాక, అజ్ఞానంతో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కరెంటు కోతలతో గ్రామాలు అంథకారంలో మునిగిపోయాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని దేవతోటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కళ్లున్న కబోదిలా.. మానవత్వం మరిచిన మనుషుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తప్పిదాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్న మీడియా సంస్థలపై అవాకులు, చెవాకులు పేలుస్తూ.. మీడియాను, మీడియా సంస్థల అధినేతలను నిందించటమే పనిగా పెట్టుకున్నారని దేవతోటి నాగరాజు విమర్శించారు

*ఎమ్మెల్యే బొల్లా రాక్షసుడులా మారాడు: జీవీ ఆంజనేయులు
వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రాక్షసుడులా మారాడని పల్నాడు టీడీపీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు విమర్శించారు. ప్రజా వ్యతిరేకత పెరుగడంతో ఎమ్మెల్యే బొల్లాకు నిద్ర పట్టడం లేదన్నారు. ప్రతి గ్రామంలో అల్లర్లకు పథకం పన్నాడన్నారు. తన సొంత మనుషులతో ప్రజలపై దాడులు చేయిస్తున్నాడని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. అమయాక విద్యార్థులపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నాడన్నారు. తన పీఏ, డ్రైవర్‌లతో తప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నాడన్నారు. ఎమ్మెల్యే బొల్లాకు ప్రజలు బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు.

*నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబే..: దేవతోటి నాగరాజు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కట్టుబట్టలతో అమరావతికి వచ్చి నవ్యాంధ్రకు సరికొత్త బాటలు వేసింది చంద్రబాబు నాయుడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అనుభవంలేక, పరిపాలించడం చేతకాక, అజ్ఞానంతో ప్రతిపక్షాలపై నిందలు వేస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కరెంటు కోతలతో గ్రామాలు అంథకారంలో మునిగిపోయాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద రోగులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారని దేవతోటి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కళ్లున్న కబోదిలా.. మానవత్వం మరిచిన మనుషుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి తప్పిదాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్న మీడియా సంస్థలపై అవాకులు, చెవాకులు పేలుస్తూ.. మీడియాను, మీడియా సంస్థల అధినేతలను నిందించటమే పనిగా పెట్టుకున్నారని దేవతోటి నాగరాజు విమర్శించారు.

*అలా మాట్లాడి సహనాన్ని పరీక్షించొద్దు: పవన్‌ కల్యాణ్‌
వ్యక్తిగత అజెండాతో జనసేనని స్థాపించలేదని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు..వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణమని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే.. తనను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అంటున్నారన్నారు. వైసీపీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడి తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పారు. పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. 36 లక్షల మంది కార్మికుల ఉపాధికి దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పీపీఏలు రద్దు చేసిందని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు.

*చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారం: గోరంట్ల
చేతకాని సీఎం వల్లే ఏపీ అంధకారంలో ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్‌రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.16 వేల కోట్ల భారం వేశారని మండిపడ్డారు. కరెంట్ కోతలతో రాష్ట్రానికి పెట్టుబడిదారులు రాకుండా పారిపోతున్నారన్నారు. ధరల నియంత్రణ లేదు.. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించలేదని చెప్పారు. కొత్తవారికి దోచుకునేందుకే సీఎం జగన్మోహన్‌రెడ్డి మంత్రివర్గ కూర్పు చేశారని ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి రూ.2 వేల నోట్లను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్నారు. కనీస వసతులు ఏర్పాటు చేయకుండానే జిల్లాలను విభజించారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి దుయ్యబట్టారు.

*వారిని కేబినెట్‌ నుంచి మారిస్తే పార్టీలో సంక్షోభం తప్పదు: ఎంపీ రఘురామ
కరెంట్ కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఇది.. సీఎం తీరుతో ఆంధ్రుల గుండె ఆగేలా ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అనుకునేది వింటే సీఎం గుండె ఆగి చనిపోతారన్నారు. ప్రధాని మోదీ.. జగన్‌ను ఎందుకు పిలిచారో తనకు తెలుసునన్నారు. కార్పొరేషన్ ద్వారా సీఎం జగన్ ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారని.. ఈ విషయంలో ప్రధాని మోదీ జగన్‌ను మందలించారని చెప్పారు. విజయసాయి వియ్యంకుడికి అంబులెన్స్‌ల కాంట్రాక్ట్‌ ఇచ్చారన్నారు. దమ్ముంటే బొత్స, కొడాలి నానిని కేబినెట్‌ నుంచి తీసేయాలని సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ఒకవేళ వారిని కేబినెట్‌ నుంచి మారిస్తే పార్టీలో సంక్షోభం తప్పదని హెచ్చరించారు. సీఎం పదవినే ఎవరికన్నా ఇస్తే బాగుంటుందన్నారు. ప్రభుత్వం తనపై చేసిన దాష్టీకం పిటిషన్ సుప్రీంకోర్టులో వచ్చిందన్నారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని సుప్రీం ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు నాలుగు వారాలకు ఈ పిటిషన్ వాయిదా వేసిందని చెప్పారు. సాక్షి యాజమాన్యం వార్తను వార్తలాగా రాయాలన్నారు. రెడ్డికి అంత కంగారు అవసరమా? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

*గవర్నర్‌లా వ్యవహరిస్తే గౌరవిస్తాం: కేటీఆర్‌
‘గవర్నర్‌తో మాకు పంచాయితీ లేదు. ఆమెను ఎక్కడా అవమాన పరచలేదు. ఎక్కడ అవమాన పరిచామో చెబితే వింటాం. అర్థం చేసుకుంటాం..’అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. గవర్నర్‌ వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, గవర్నర్‌లా వ్యవహరిస్తే తప్పకుండా గౌరవిస్తామని చెప్పారు. గురువారం సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.గవర్నర్‌ గౌరవానికి భంగం వాటిల్లేలా తాము ఏమీ చేయలేదని కేటీఆర్‌ చెప్పారు. ‘ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి విషయంలో అభ్యంతరం పెట్టినందుకు ఆమెను అవమానిస్తున్నారని అన్నట్లు విన్నా. కౌశిక్‌రెడ్డికి రాజకీయ నేపథ్యం ఉన్నందున ఎమ్మెల్సీగా అనుమతించలేదని ఆమె చెప్పినట్లు విన్నా. అయితే.. గవర్నర్‌ కాకముందు ఆమె ఎవరు? బీజేపీ తమిళనాడు పార్టీ అధ్యక్షురాలు కాదా?’అని మంత్రి ప్రశ్నించారు. గవర్నర్‌ కావడానికి రాజకీయ నేపథ్యం అడ్డం రాదు కానీ ఎమ్మెల్సీ అయ్యేందుకు అడ్డం వస్తదా? అని కేటీఆర్‌ నిలదీశారు. నరసింహన్‌ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదు గవర్నర్‌గా నరసింహన్‌ ఉన్నప్పుడు ఏ పంచాయితీ లేదని, వీరితో పంచాయితీ ఉంటదని ఎందుకు ఊహించుకుంటున్నారో వారే ఆలోచించుకోవాలని మంత్రి అన్నారు. తాము రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని చెప్పారు. శాసనసభ సమావేశాలు ఒక సంవత్సరంలో మొట్టమొదటిసారి జరుగుతున్నప్పుడు గవర్నర్‌ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో స్పష్టంగా రాసి ఉందని.. అయితే ఇటీవలి సమావేశం మొదటిది కాదని చెప్పారు. ఆ సమావేశం సైనడై (నిరవధిక వాయిదా) అయిందని, ప్రోరోగ్‌ కాలేదని తెలిపారు. అందువల్లే గవర్నర్‌ ప్రసంగం లేదని.. దాన్ని అవమానం కింద తీసుకుంటే తాము చేయగలిగింది ఏమీ లేదని కేటీఆర్‌ అన్నారు.

*విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు : ఏపీ సీఎం జగన్‌
రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఏపీలోని నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెనను ప్రారంభించామన్నా రు. పేదలకయ్యే ఫీజ్‌ రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా అందజేసి తల్లిదండ్రులను ఆదుకుంటున్నామన్నారు.

*కేసీఆర్ నాయకత్వంలోనే డ్రగ్స్ దందా: బండి సంజయ్హై
దరాబాద్ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారడానికి కారణం సీఎం కేసీఆర్ అని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కారణంగానే పంజాబ్ ప్రభుత్వం కుప్పకూలిందని.. త్వరలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పోతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడికి రాష్ట్రంలో 112 వైన్స్ షాపులున్నాయన్నారు.డ్రగ్స్ కేసులో విచారణ చేసిన అధికారులను సైతం ఢిల్లీకి పంపారని.. విచారణ పేరుతో 2015 నుంచి ఏం సాధించారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం ఉన్నందునే.. ఈడీకి సహకరించలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

*ఈ నెలాఖరులో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
కాంగ్రెస్ ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ధాన్యం కొనుగోలుపై భవిష్యత్ ఉద్యమ కార్యచరణ.. ఇటీవల కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ నెలాఖరులో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఉంటుందని చెప్పారు.రాహుల్ పర్యటన జరిగేలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిద్దామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్‌లు ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తున్నట్టు నటిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాలపై వారి రాజకీయ నాటకాలు బయటపెడుతూ ప్రజలకు తెలియజెప్పే విధంగా మనం ప్రజల మధ్య పోరాటాలు కొనసాగించాలని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సమావేశానికి షబ్బీర్ అలీ, కొండా సురేఖ, చిన్నారెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, రామ్మోహన్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు.

*టీడీపీ నేతలకు ఏదో రోజు గుండెపోటు వస్తుంది: జగన్‌
టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసిన అప్పులను కూడా తాము తీరుస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం సీఎం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నామన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలకు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు.కావాలనే టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. టీడీపీ కడుపుమంటకు, అసూయకు మందే లేదని ఎద్దేవా చేశారు. కడుపుమంట, అసూయ పెరిగితే ఏదో రోజు గుండెపోటు వస్తుందన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద.. ఇప్పటివరకు 10 వేల 30 కోట్లు ఖర్చు చేశామని జగన్‌ చెప్పారు.

*గ్రామ స్వరాజ్యం మిథ్యే: యనమల
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం వైసీపీ ప్రభుత్వంలో మిథ్యేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. జగన్‌ రెడ్డి చెబుతున్నదొకటి, చేస్తున్నది మరోకటిగా ఉందన్నారు. స్థానికసంస్థలను బలోపేతం చేస్తామంటూ సచివాలయాలను ఏర్పాటుచేసిన జగన్‌రెడ్డి ఆ సచివాలయాల్లో నిధులు లాక్కోవడం దుర్మార్గమన్నారు.

*ప్రజల సొమ్ముతో వైసీపీ కార్యకర్తలకు సన్మానాలా?: వర్ల
‘‘రాష్ట్రంలో వలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ప్రకటించారు. వారంతా వైసీపీకి సేవ చేస్తున్నందుకేనా వారికి సన్మానాలు, సత్కారాలు? వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పని చేసేవారికి ప్రజల సొమ్ముతో ఎలా సన్మానాలు చేస్తారు?’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. సొంత పార్టీ కార్యకర్తలకు రూ.వందల కోట్ల ప్రజాధనం పంచి పెట్టడం సిగ్గుచేటన్నారు.

*14 నుంచి బండి సంజయ్‌ యాత్ర
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈనెల 14 నుంచి చేపట్టనున్న రెండోదశ ప్రజా సంగ్రామ యాత్ర 31 రోజుల పాటు కొనసాగుతుందని ఆ యాత్ర సమన్వయకర్త దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌, తదితరులు తెలిపారు. మొత్తం 380 కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగుతుందని వివరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రదీ్‌పకుమార్‌, తదితరులు మాట్లాడారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రజా సంగ్రామ యాత్రకు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులూ హాజరవుతారు. జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే ప్రజా సంగ్రామ యాత్ర తొలిరోజు 4 కిలోమీటర్లు కొనసాగుతుంది. అనంతరం, మొత్తం మూడు పార్లమెంటు, పది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో రోజుకి సగటున 13 కిలోమీటర్ల మేర ఈ యాత్ర నిర్వహిస్తారు. యాత్ర సందర్భంగా బండి సంజయ్‌ స్థానికులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారు. ఆలంపూర్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలుతో పాటు మహేశ్వరంలో భారీ సభలు ఉంటాయి. మే 14న మహేశ్వరం నియోజకవర్గంలో జరిగే ముగింపు బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్య అతిథిగా హాజరవుతారు.