Politics

వైసీపీలో ఇప్పుడు.. ఆ పదవుల కోసం కొట్లాట?- TNI రాజకీయ వార్తలు

వైసీపీలో ఇప్పుడు.. ఆ పదవుల కోసం కొట్లాట?- TNI రాజకీయ వార్తలు

* వైసీపీలో అసమ్మతి సెగలు కమ్ముకుంటున్నాయని ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘నిన్నటివరకు మాకు ఒక్కడే నాయకుడు అన్నవాళ్లు.. ఇప్పుడు పదవుల కోసం కొట్లాడుకుంటున్నారు. ఏడుపులు, పెడబొబ్బలతో వైసీపీ పతనం మొదలైంది. మంత్రివర్గ కూర్పులో జగన్ పాటించిన విధానం ఏంటి? మంత్రులను తొలగించడంలో సలహాదారుడికి అధికారం ఎక్కడిది?.ప్రధాన సలహాదారు రాజ్యాంగ బద్ధమైన పదవి కాదు.. సజ్జల వ్యవహారంపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి. కమ్మ, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ కులాల నేతలను అణగదొక్కారు’’ అని జీవీఎల్‌ నరసింహారావు వ్యాఖ్యానించారు.

*సీఎం జగన్‎తో భేటీ తర్వాత బాలినేని శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మంత్రి పదవులు కేటాయించారని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన జగన్‎‎ను కలిశారు. భేటీ ముగిసిన తర్వాత బాలినేని మాట్లాడుతూ పార్టీ మారతారనానేది ప్రచారం మాత్రమేనన్నారు. మంత్రి పదవి కోసం తానెప్పుడూ పాకులాడలేదని చెప్పారు. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. వైఎస్ కుటుంబంతో తాము సన్నిహితులమని బాలినేని తెలిపారు.

*మిల్లర్లతో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం: మహేష్‌కుమార్ గౌడ్
అధికార పార్టీ నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..జీవో 111 ఎత్తివేయడం వల్ల పేద, మధ్య తరగతి రైతులకు ఒరిగిందేమీలేదు, సంపన్నుల కోసమే జీవో 111 ఎత్తి వేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ మిల్లర్లతో లోపాయికారి ఒప్పందంలో భాగంగానే వడ్ల కొనుగోలు జరపడం లేదని ధ్వజమెత్తారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాటకంలో రైతులు బలవుతున్నారని మహేష్‌కుమార్‌ గౌడ్‌ తెలిపారు.

*కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది: Vivek
కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్, శ్రీలంక కంటే కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందన్నారు. టీఆర్ఎస్‌కు మూడు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వస్తున్నాయని పీకే సర్వేలో తేలిందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. వడ్లు కొనకుండా…. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వని కేసీఆర్‌కు ప్రధానిని విమర్శించటం సిగ్గుచేటన్నారు. ప్రశాంత్ కిషోర్ ప్లాన్స్ తెలంగాణలో సాగవని తెలిపారు. కేసీఆర్ మోసాలను బీజేపీ కార్యకర్తలు గ్రామగ్రామాలకు తీసుకెళ్లాలని వివేక్ పిలుపునిచ్చారు.

*కోటరీ కారణంగానే నాకు మంత్రి పదవి రాలేదు: సామినేని ఉదయభాను
ఈసారి తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీఎం జగన్ వద్ద జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కోటరీగా ఏర్పడ్డారని, వారి కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని భావిస్తున్నానని పరోక్షగా కోడలి నాని, పేర్ని నానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. 2012 వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యేగా తానే తొలుత పార్టీలో‌ చేరినట్లు చెప్పారు. జగన్‌ను అరెస్టు చేస్తే… జిల్లాలో పార్టీ కోసం పని చేశానన్నారు. తన తరువాత వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చినా తాను బాధ పడలేదన్నారు. రెండో విడత ఇస్తారని భావించానని.. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మొదటి నుంచీ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, పదవి వచ్చినా.. రాకున్నా.. జగన్‌కు విధేయునిగా ఉంటానని స్పష్టం చేశారు. మోపిదేవి, సజ్జల కూడా తనతో మాట్లాడారని, కాపులు నలుగురికి ఇచ్చారు… అందులో తాను గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గతంలొ జగన్ స్వయంగా కాబోయే మంత్రిగా తనను ప్రకటించారని చెప్పారు

*ధాన్యం‌ కొనకుంటే సీఎం కేసీఆర్ గద్దె దిగాలి: ఈటల
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ధాన్యం‌ కొనాలని, కొనకుంటే గద్దె దిగాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పరిపాలన వదిలేసి దద్దమ్మ మాదిరి ఢిల్లీలో ఎందుకు దర్నా చేస్తున్నారో సీఎం చెప్పాలన్నారు. బంగాఖాతంలో కలుపుతారో.. కలుస్తారో.. ముఖ్యమంత్రితో తేల్చుకుంటామన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య.. తెలంగాణలో మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణలో పీకే ప్లాన్స్ పని చేయవన్నారు. ఆత్మగౌరవం మాత్రమే పనిచేస్తుందన్నారు. మంత్రులు, అధికారులు ప్రజలంటే సీఎం కేసీఆర్‌కు లెక్కలేదని, ఐదారు వేల కోట్లతో రైతుల పంటను కొనలేని అసమర్థ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు. పీకే రాకతోనే కేసీఆర్ పతనం ప్రారంభమైందని అర్థమవుతోందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నిక తర్వాత కేసీఆర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని, మహిళా గవర్నర్‌పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు

*బీసీలను మోసగిస్తున్న జగన్: యనమల
బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే.. బీసీలందరికీ మేలు జరుగుతుందా? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారన్నారు. సంక్షేమ పథకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలకు గుర్తింపే లేదన్నారు.రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి..బీసీలకు జగన్‌రెడ్డి అన్యాయం చేశారని మండిపడ్డారు.బీసీల నిధులను జగన్‌రెడ్డి దారి మళ్లిస్తున్నారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు

*జగన్ వద్దకు బాలినేని పంచాయతీ
ఏపీలో మంత్రివర్గ విస్తరణ దుమారం రేపుతోంది. మంత్రి పదవులు ఆశించిన ఆశావాహులు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. కొత్త కేబినెట్‌లో మాజీ హోంమంత్రి సుచరితకు చోటు దక్కలేదు. దీంతో ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరావు కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వైసీపీ అధిష్ఠానానికి తెలియడం ఆయనను శాంతిపజేందుకు దూతలుగా ప్రభుత్వ సలహారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు అప్పిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి వెళ్లారు. బాలినేని నివాసానికి చేరుకున్న నేతలు ఆయనతో చర్చలు జరుపుతున్నారు. బాలినేని ఎంతకూ దిగిరాకపోవడంతో ఆయనను నేరుగా సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయం తెలుస్తోంది. ఇప్పటికే బాలినేనితో సజ్జల రెండుసార్లు చర్చలు జరిపారు. మరోసారి బాలినేనిని బుజ్జగించేందుకు సజ్జల యత్నిస్తున్నారు. బాలినేనిని కేబినెట్‌ నుంచి తొలగించడం… అదే సమయంలో, తమ జిల్లాకే చెందిన ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఒక దశలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్‌ బై చెప్పేందుకు కూడా సిద్ధపడ్డారు. బాలినేనిని బుజ్జగించేందుకు ఆదివారం ఉదయం నుంచి రాత్రిదాకా అధిష్ఠానం తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తొలుత… ఆదివారం ఉదయం విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్వయంగా వెళ్లారు. ‘ఆదిమూలపు సురేశ్‌ను కూడా తొలగిస్తున్నాం. మీ జిల్లా నుంచి ఎవరూ కేబినెట్‌లో ఉండరు’ అని సజ్జల చెప్పారు. దీంతో… బాలినేని శాంతించారు. సర్దుకుపోయేందుకు సిద్ధమయ్యారు. సాయంత్రానికి సీన్‌ మారిపోయింది. తుది జాబితాలో ఆదిమూలపు పేరూ కనిపించడంతో బాలినేని హతాశులయ్యారు

*పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్న బాలినేని అనుచరులు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద హై టెన్షన్ కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధులు బాలినేనిని కలిసి రాజీనామా ప్రకటనలు చేస్తున్నారు. సంతమాగులూరు ఎంపీపీ చిన వెంకట రెడ్డి, బాలినేనిని కలిసిన అనంతరం రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అలాగే బాలినేని అనుచరులు పార్టీ పదవులకూ రాజీనామా చేస్తున్నారు. ఈ సందర్భంగా బాలినేని అనుచరుడు, ఎంపీపీ చిన వెంకటరెడ్డి మాట్లాడుతూ బాలినేనికి అన్యాయం జరిగిందన్నారు. ఆయన రాజీనామా సహా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు చెప్పారు. ఈరోజు భవిష్యత్ కార్యాచరణపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. తానే కాదు.. చాలా మంది రాజీనామాలు చేయడానికి సిద్దంగా ఉన్నారని, రాజీనామాల పరంపర కొనసాగుతోందని చిన వెంకటరెడ్డి తెలిపారు.

*అసంతృప్తులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ఎంపీ మేపిదేవి
గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీలోని అసంతృప్తి నేతలను బుజ్జగించేందుకు ఎంపీ మోపిదేవిని వైసీపీ హై కమాండ్ రంగంలోకి దించింది. అందరికీ భవిష్యత్తులో ప్రాతినిధ్యం కల్పిస్తామని తన మాటగా చెప్పాలని మోపిదేవి ద్వారా సీఎం జగన్ సమాచారం పంపారు. దీంతో మోపిదేవి నిన్న మాజీ హోంమంత్రి సుచరిత, ఈ రోజు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని కలిశారు. అయితే మాజీ హోంమంత్రి సుచరిత మోపిదేవికి రాజీనామా లేఖ ఇచ్చారు. పదవి ఇవ్వనందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే ఎమ్మెల్యే పార్థసారథి కూడా తన సీనియారిటీ పనికి రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభానును కలవడం కోసం మోపిదేవి ప్రయత్నిస్తున్నారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. జగ్గయ్యపేటలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఉదయభాను అనుచరులు రోడ్డుపై టైర్లు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు

*మంత్రి పదవి పోయినందుకు బాధగా లేదు…కానీ: Sucharitha
రెండేన్నరేళ్ల మాత్రమే మంత్రి పదవి అని జగన్ అన్న ముందే చెప్పారని మాజీ మంత్రి సుచరిత అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… మంత్రి పదవి పోయినందుకు తనకు బాధగా లేదని… కానీ కొన్ని కారణాలు బాధంచాయన్నారు. ‘‘నా వ్యక్తిగత కారణాల వల్లే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా’’ అని తెలిపారు. రాజకీయాలలో ఉన్నంత కాలంలో జగన్ వెంటే ఉంటానన్నారు. ‘‘నా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదు. పార్టీ నేతలంతా సంయమనం పాటించాలి. నేను పదవిలో ఉన్న లేకపోయినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటా’’ అని సుచరిత స్పష్టం చేశారు. సుచరిత వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఆందోళన విరమించారు

*కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది: Vivek
కేసీఆర్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్, శ్రీలంక కంటే కేసీఆర్ ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందన్నారు. టీఆర్ఎస్‌కు మూడు పార్లమెంటు స్థానాల్లో మాత్రమే వస్తున్నాయని పీకే సర్వేలో తేలిందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. వడ్లు కొనకుండా…. కేసీఆర్ డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలకు సమయం ఇవ్వని కేసీఆర్‌కు ప్రధానిని విమర్శించటం సిగ్గుచేటన్నారు. ప్రశాంత్ కిషోర్ ప్లాన్స్ తెలంగాణలో సాగవని తెలిపారు. కేసీఆర్ మోసాలను బీజేపీ కార్యకర్తలు గ్రామగ్రామాలకు తీసుకెళ్లాలని వివేక్ పిలుపునిచ్చారు

*బీసీలను మోసగిస్తున్న జగన్: యనమలt
బీసీల్లో నలుగురికి మంత్రి పదవులిస్తే.. బీసీలందరికీ మేలు జరుగుతుందా? అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్ధాపించారన్నారు. సంక్షేమ పథకాల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. టీడీపీ ఏర్పడక ముందు బీసీలకు గుర్తింపే లేదన్నారు.రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించి..బీసీలకు జగన్‌రెడ్డి అన్యాయం చేశారని మండిపడ్డారు.బీసీల నిధులను జగన్‌రెడ్డి దారి మళ్లిస్తున్నారని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు.

*కోటరీ కారణంగానే నాకు మంత్రి పదవి రాలేదు: సామినేని ఉదయభాను
ఈసారి తప్పకుండా తనకు మంత్రి పదవి వస్తుందని భావించానని జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ సీఎం జగన్ వద్ద జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కోటరీగా ఏర్పడ్డారని, వారి కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని భావిస్తున్నానని పరోక్షగా కోడలి నాని, పేర్ని నానిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశారు. 2012 వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యేగా తానే తొలుత పార్టీలో‌ చేరినట్లు చెప్పారు. జగన్‌ను అరెస్టు చేస్తే… జిల్లాలో పార్టీ కోసం పని చేశానన్నారు. తన తరువాత వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చినా తాను బాధ పడలేదన్నారు. రెండో విడత ఇస్తారని భావించానని.. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మొదటి నుంచీ తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, పదవి వచ్చినా.. రాకున్నా.. జగన్‌కు విధేయునిగా ఉంటానని స్పష్టం చేశారు. మోపిదేవి, సజ్జల కూడా తనతో మాట్లాడారని, కాపులు నలుగురికి ఇచ్చారు… అందులో తాను గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. గతంలొ జగన్ స్వయంగా కాబోయే మంత్రిగా తనను ప్రకటించారని చెప్పారు.

*లంగాణ ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు : రాకేశ్ తికాయ‌త్
రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వంపై జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో రాకేశ్ తికాయ‌త్ పాల్గొని ప్ర‌సంగించారు.దేశంలో ఏం జ‌రుగుతోందని తికాయ‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రైతులు మ‌ర‌ణిస్తూనే ఉండాలా? అని ప్ర‌శ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోంది. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి రావాల్సి వ‌స్తుంది. సాగుచ‌ట్టాల ర‌ద్దు కోసం ఢిల్లీలో 13 నెల‌ల పాటు ఉద్య‌మించాం. కేంద్రం ఏడాదికి 3 విడ‌తలుగా రైతుల‌కు రూ. 6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతుల‌ను ఉద్ధ‌రిస్తున్న‌ట్లు కేంద్రం మాట్లాడుతోంది అని ఎద్దెవా చేశారు.

*కేసీఆర్‌ది అన్న‌దాత‌ల ప్ర‌భుత్వం : మంత్రి నిరంజ‌న్ రెడ్డి
ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది అన్న‌దాత‌ల ప్ర‌భుత్వం అని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్‌ుష్టం చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిర‌స‌న దీక్ష‌లో మంత్రి నిరంజ‌న్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.ఢిల్లీలో దీక్ష చేయ‌డం మ‌న‌కు సంతోషం కాదు. కానీ ఇలాంటి అనివార్య ప‌రిస్థితులు క‌ల్పించింది కేంద్రం అని మంత్రి మండిప‌డ్డారు. కేంద్ర మోస‌పూరిత వైఖ‌రిని గ్ర‌హించిన సీఎం కేసీఆర్ రైతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేశారు. వానాకాలం పంట‌ను కొనే స‌మ‌యంలోనే యాసంగి పంట‌ను కొన‌మ‌ని బీజేపీ చెప్పింది. సీఎం కేసీఆర్, మంత్రుల బృందం అనేక‌సార్లు కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వ‌చ్చి విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ కేంద్రం ప‌ట్టించుకోలేదు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ప్ర‌ధానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఉలుకు ప‌లుకు లేదు. ర‌క‌ర‌కాల ష‌ర‌తులు విధించిన కేంద్రం.. రైతుల ఉసురు పోసుకుంటున్న‌ది.తెలంగాణ రైతుల‌ను అవ‌మానించేలా కేంద్ర మంత్రి మాట్లాడిండు. క‌నీస మ‌ర్యాద లేకుండా మాట్లాడ‌టం అత్యంత దుర్మార్గం. తెలంగాణ స‌మాజం కేంద్ర ప్ర‌భుత్వాన్ని క్ష‌మించ‌దు. తెలంగాణ రైతులు చెమ‌టోడ్చి పంజాబ్ కంటే అధికంగా ధాన్యం పండించారు. కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ రైతులు భారీ స్థాయిలో ధాన్యం పండించి, దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచారు. రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం పాత్ర లేదు. కేంద్రానికి రైతులు చెమ‌ట‌లు ప‌ట్టించే రోజులు వ‌చ్చాయ‌న్నారు. న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు కేంద్రానికి చుక్క‌లు చూపించారు. అబ‌ద్ధాల‌తో బీజేపీ ప‌రిపాల‌న కొన‌సాగిస్తోంది అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆగ్‌ధహం వెలిబుచ్చారు.

*మంత్రివర్గ కూర్పు ఒక ప్రహసనం…మంత్రులు ఉత్సవ విగ్రహాలు: Tulasireddy
సీఎం జగన్ మంత్రివర్గ కూర్పు ఒక ప్రహసనం అని…. మంత్రులు ఉత్సవ విగ్రహాలు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… విధులు, నిధులు, అధికారాలులేని మంత్రి పదవులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని అన్నారు. మూడూ నెలలు సాము గరిడిలు చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టుంది ఈ కసరత్తు అంటూ యెద్దేవా చేశారు. 11 మంది పాత వారితో, 14 మంది కొత్త వారితో ఏర్పాటు చేసేందుకు ఇంత తతంగం అవసరమా? అని ప్రశ్నించారు. పాత వారిలో 13 మందిని ఎందుకు తొలగించినట్లు? అసమర్థులా? అవినీతిపరులా? ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్, విశాఖ, గుంటూరు, అల్లూరి, ఏలూరు, సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య- ఈ ఎనిమిది జిల్లాలకు ప్రాతి నిధ్యం లేదని… దేనా అధికార వికేంద్రీకరణ? ఈ ఎనిమిది జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు అసమర్థులా? అంటూ ప్రశ్నలు కురిపించారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, వెలమ, తెలగ, బలిజ, ఒంటరి – ఈ సామాజిక వర్గాలకు ప్రాతి నిద్యం లేదని, ఇదేనా సామాజిక న్యాయం? అని అడిగారు. ఇప్పటికే అసమ్మతి ప్రారంభం అయిందన్నారు. ముఖ్యమంత్రి దిష్టి బొమ్మలు కాల్చే స్థితికి చేరుకుందని తెలిపారు. ఈ అసమ్మతి వాయుగుండం త్వరలో తీరం దాటి సునామిగా మారక తప్పదని తులసిరెడ్డి హెచ్చరించారు

*అసంతృప్తుల రాజీనామాలు ప్రచారమే: Sajjala
మంత్రి పదవులు రాని అసంతృప్తి నేతలు రాజీనామాలు చేస్తున్నారనేది ప్రచారమే అని ప్రభుత్వ సలాహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. అధికారమనేది పవర్‌ కాదు.. బాధ్యత అని తెలిపారు. తమ వాళ్ల అసంతృప్తి తాత్కాలికమే అని అన్నారు. అసంతృప్త నేతలతో సీఎం కూడా మాట్లాడతారని, అందరి అపోహలను తొలగించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. కేబినెట్‌లో బీసీలకు పెద్దపీట వేశామన్నారు. మంత్రి పదవిరాని వారికి బాధ ఉంటుందని, లేని అసమ్మతిని చూపించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని సజ్జల మండిపడ్డారు

*సామాజిక న్యాయం నేతిబీర చందం: అచ్చెన్న
జగన్‌రెడ్డి పాలనలో సామాజిక న్యాయం నేతి బీరలో నెయ్యిలా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. తన అవినీతిని విస్తరించుకునేందుకు తప్ప… బలహీన వర్గాలకు కేబినెట్‌ విస్తరణతో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. సామాజిక న్యాయంపై చర్చించేందుకు జగన్‌రెడ్డి సిద్ధమా? అని సవాల్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఓ ప్రకటన చేశారు. మంత్రివర్గంలో 70ు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించామని చెప్తున్న జగన్‌రెడ్డి.. ఏ ఒక్కరికైనా స్వతంత్రంగా పని చేసే వీలు కల్పించారా? ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేకి, చైర్మన్లకు, ఇన్‌చార్జీలందరికీ రెడ్లను షాడోలుగా నియమించి, వారిని వెన్నుముఖ లేని వారిగా చేయడమేనా మీరు చేసిన సామాజిక న్యాయం? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ముందు పెట్టి, సజ్జల వంటి రాజ్యాంగేతర శక్తులను షాడో మినిష్టర్లుగా ప్రోత్సహించడం బడుగు వర్గాలను అవమానించడం కాదా? టీటీడీ చైర్మన్‌ పోస్టును రెండు సార్లు తన సామాజిక వర్గానికే ఇవ్వడం ఏం సామాజిక న్యాయం? అని నిలదీశారు. సామాజిక అన్యాయం చేస్తున్న జగన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.

*ఎమ్మెల్యే పదవికి మేకతోటి సుచరిత రాజీనామా’
తమ అమ్మ ఎమ్మెల్యే పదవికి‌ రాజీనామా చేశారని మేకతోటి సుచరిత కుమార్తె రిషిక అన్నారు. రాజీనామా లేఖను ఎంపీ మోపిదేవికి‌ ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వానికి‌ రాజీనామా చేయలేదని, మంత్రి పదవి‌ ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పలేదని మేకతోటి సుచరిత కుమార్తె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ మంత్రి పదవి ఒక్కటే న్యాయంకాదన్నారు. కొన్నిచోట్ల చిన్న చిన్న అసంతృప్తులు వచ్చాయని చెప్పారు. వీలైనంత త్వరలో సమస్యలు‌ పరిష్కారమవుతాయన్నారు. తమదంతా ఉమ్మడి కుటుంబమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు.

*అప్పట్లో ఎన్టీఆర్.. ఇప్పట్లో జగన్: సజ్జల
మంత్రి పదవుల కోసం వైసీపీలో అసంతృప్తులు లేరన్నారని మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అవన్నీ ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. అన్ని కులాలను దృష్టిలో ఉంచుకుని కేబినెట్‎ను జగన్ విస్తరించారని సజ్జల తెలిపారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో కొంత బ్యాలెన్స్ చేయాల్సిన వచ్చిందని చెప్పారు. గతంలో చంద్రబాబు కేబినెట్‎లో 19 మంది మంత్రులు మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం మొత్తం 25 మందికి కేబినెట్ పదవులు ఇస్తున్నామని చెప్పారు. జగన్ అన్నీ ఆలోచించే కేబినెట్ పదవులు కేటాయించారని సజ్జల తెలిపారు. జగన్‎పై మంత్రులందరికీ ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. చరిత్ర చూసుకుంటే అప్పుడు ఎన్టీఆర్ చెప్పగానే మంత్రులు రాజీనామా చేశారని, ఇప్పుడు జగన్‎పై విశ్వాసంతో చెప్పగానే రాజీనామాలు చేశారని సజ్జల పేర్కొన్నారు.