DailyDose

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారీ అగ్ని ప్రమాదం – TNI నేర వార్తలు

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారీ అగ్ని ప్రమాదం – TNI  నేర వార్తలు

*అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హోం విభాగం స్టోర్‌లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాకాసి కీలలను తలపిస్తూ మంటలు బెంబేలెత్తించాయి. మంటలను అదుపు చేసేందుకు ఏకంగా వంద అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించారు.

*అక్బరుద్దీన్ కేసులో తీర్పును రేపటికి వాయిదా వేసిన నాంపల్లి కోర్ట్..
అక్బరుద్దీన్ వివాదస్పద వ్యాఖ్యల కేసులో తీర్పును బుధవారానికి వాయిదా వేసింది నాంపల్లి కోర్ట్. ఈరోజు తీర్పు ఇస్తారని అనుకున్నా రేపటికి తీర్పు వాయిదా వేసింది.2013లో నిర్మల్ లో హిందువులకు వ్యతిరేఖంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై 9 ఏళ్లుగా సుదీర్ఘ విచారణ జరిగింది. నిజామాబాద్, నిర్మల్ లో చేసిన వ్యాఖ్యలపై రెండు కేసులు నమోదు అయ్యాయి. సీఐడీ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేశారు. తొలుత ఈ వ్యాఖ్యలు చేయలేదని అక్బరుద్దీన్ అన్నప్పటికీ, సెంట్రల్ ఫోరెన్సిక్ లాబోరేటరీ, చంఢీగడ్ ఈ వాయిస్ అక్బరుద్దీన్ దే అని తేల్చింది. దాదాపుగా 30మంది సాక్షులను విచారించారు. ఐపీసీ సెక్షన్ 153-A ( మతాల మధ్య శత్వుత్వం పెంచడం) , 295-A ( ఇతర మతాలను అవమానించడం, విశ్వాసాలను దెబ్బతీయడం) కింద అక్బరుద్దీన్ పై కేసులు నమోదయ్యాయి.కాగా.. ఈరోజు తీర్పు వస్తుందని భావించి పాతబస్తీలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. నాంపల్లి కోర్ట్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నాలుగు ప్లాటూన్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు 500 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు.

* ఓ అభివృద్ధి కాంట్రాక్టు విషయంలో కర్ణాటక మంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప 40శాతం కమీషన్‌ డిమాండ్‌ చేశారని ఆరోపించిన కాంట్రాక్టర్‌ సంతోష్‌ పాటిల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కన్నడ నాట రాజకీయ దుమారం రేపింది. ఉడిపిలోని ఓ లాడ్జిలో సంతోష్‌ మంగళవారం శవమై కనిపించారు. కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపించిన కాంట్రాక్టర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెళగావికి చెందిన కాంట్రాక్టర్ సంతోష్ కే పాటిల్ మృతదేహం ప్రైవేట్ లాడ్జిలోని ఓ రూమ్లో పడి ఉంది. పక్క గదిలోనే అతని స్నేహితులు ఉన్నారు. ఈశ్వరప్ప కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని పాటిల్ వార్తా సంస్థలకు మెసేజ్లు పంపించాడు. సంతోష్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అంచనా వేస్తున్నారు.

* మెక్సికో నగర సమీప ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మందిపై కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
*చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి వెంకటగిరి గ్రామం లోనికి మంగళవారం ఉదయం ఏనుగులు ప్రవేశించి హల్చల్ చేశాయి… ఎలాంటి ప్రాణనష్టం కలుగలేదు… అటవీ శాఖ ఉన్నత అధికారి సుభాష్ గారి ఆదేశాల మేరకు ……అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నారు
* ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా డీలర్‌షిప్‌ నీదేనంటూ గుడిమల్కాపూర్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకు సైబర్‌ నేరగాళ్లు వల వేశారు. పలు డాక్యుమెంట్ల రూపంలో అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశారు. డీలర్‌షిప్‌ ఇవ్వకపోవడంతో సోమవారం బాధితుడు సిటీ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు

*కాకినాడ: జిల్లాలోని గొల్లప్రోలు మండలం వన్నెపూడి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆటోను బొలేరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

* అనకాపల్లి జిల్లాలోని ఆచ్యుతాపురం పూడిమడక వద్ద ఎర్రచెరువు రోడ్డుపై వెళ్తున్న గేదెల గుంపును సన్విరా కంపెనీ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు గేదెలు మృతి చెందగా, మరో రెండు గేదెలకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన గేదెలు పూడిమడక శివారు మత్స్యకారుడు చింతకాయల కాసులుకు చెందినవిగా గుర్తించారు. గేదెల గుంపును ఢీకొట్టారని తెలియడంతో స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ నుంచి బయటకు వెళ్తున్న లారీలను ఆపి నిరసన తెలిపారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

*హాసన్‌ జిల్లాలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృత్యువాత చెందారు. బేలూరు తాలూకా కడెగర్జె గ్రామానికి చెందిన కాఫీ తోట కార్మికులు చిక్కయ్య (65), ఈరయ్య (68) సోమవారం ఏనుగులో దాడిలో బలయ్యారు. చన్నరాయపట్టణ పరిధిలోని గులసింద గ్రామ చెరువులో జలకాలాడిన ఒక ఏనుగు సంచరిస్తూ బేలూరు తాలూకా ప్రాంతానికి చేరుకుంది. పనుల కోసం వెళ్లిన ఇద్దరు కార్మికులు ఏనుగు దాడిలో మృతిచెందారు. దీంతో గ్రామంలో ఇతర తోట కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. అరెహళ్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మృతితో వారి కుటుంబాలలో విషాదం నెలకొంది. కాగా మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, ఏనుగులను ఇతర ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ఆలూఆరు, సకలేశపుర తాలూకాలకే పరిమితమైన ఏనుగుల దాడులు బేలూరు తాలూకాకు కూడా చేరాయి. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

*చీపురుపల్లి బాతువ రైల్వే గేట్ సమీపంలో సికింద్రాబాద్ నుండి గౌహతి వెళ్తున్న సూపర్ ఫాస్ట్ రైలు సాంకేతిక కారణాల వల్ల గేటు దగ్గరే నిలిచిపోయింది.ఈ క్రమంలో ట్రైను నిలవడంతో జనరల్ బోగీలో ఉన్న ప్రయాణికులు దిగడం తో భువనేశ్వర్ నుంచి ముంబై వెళుతున్న కోణార్క్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొనడంతో సుమారు ఏడుగురు మరణించినట్లు సమాచారం.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

*రాష్ట్రంలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు గాయపడ్డారు. అందులో నలుగురు విద్యార్థులు తీవ్రగాయాల పాలవగా.. అందులో ఓ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి మండ లంలోని బెండారసమీపంలోసెయింట్‌ మేరీస్‌ పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సు.. పిల్లలను ఇంటివద్ద దించేందుకు భీంపూర్‌ గ్రామానికి వెళ్తుండగా.. ఓ టిప్పర్‌ వేగంగా వచ్చి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో భీంపూర్‌ గ్రామానికి చెందిన విద్యార్థులు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే.. సూర్యాపేట జిల్లా మునగాలలో పది మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులతో 65వ నంబరు జాతీయ రహదారిపై యూటర్న్‌ తీసుకుంటున్న ఆటోను వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. దీంతో మొత్తం 12 మందీ గాయపడగా.. అందరినీ ఆస్పత్రికి తరలించారు.

*లిసి జీవించలేనప్పుడు కలిసి చద్దామంటూ బాలికను ఆ యువకుడు రెచ్చగొట్టాడు. తాను అప్పటికే పురుగుల మందు తాగానని నమ్మించి.. ‘నేను లేనిది నువ్వు బతకడం ఎందుకు?’ అంటూ దొంగ ఏడుపు ఏడ్చాడు. గ్లాసులో పురుగుల మందు పోసి ఆమెకు ఇచ్చాడు. దాన్ని ఆమె తాగడంతో ప్రాణాలు కోల్పోయింది. ప్రేమ పేరుతో బాలిక వెంటబడి.. ఆనక వదిలించుకునేందుకు ఓ యువకుడు ఉద్దేశపూర్వకంగా ఇలా ఆత్మహత్యకు పురిగొల్పాడు. నల్లగొండ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

*అప్పుల బాధతో ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లికి చెందిన బొల్లం అశోక్‌ (46) రెండెకరాల్లో పంటలు సాగు చేస్తుండగా రెండేళ్ల నుంచి పంటలు సరిగ్గా పండడం లేదు. రెండు బోర్లు వేయగా చుక్క నీరు రాలేదు. అప్పులు పెరిగిపోవడంతో జీవితంపై విరక్తి చెందిన అశోక్‌ ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు.

*వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం కొలన్‌పల్లికి చెందిన కాడబోయిన రాజ్‌కుమార్‌(30) రెండెకరాల్లో వరి సాగు చేయగా, నీరు అందక ఎండిపోయింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనతో ఆదివారం పురుగుల మందు తాగాడు. స్థానికులు వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం చనిపోయాడు.

*ఒకే కుటుంబంలోని వారు మంత్రులుగా ఉండి దోచుకు తినడంతో శ్రీలంక సంక్షోభంలో పడిందనితెలంగాణలోనూ అదే పరిస్థితి ఉందని కాంగ్రెస్‌ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. నాలుగు కోట్ల మందికి న్యాయం జరగాలని సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే.. కేసీఆర్‌ పాలనలో నాలుగు కుటుంబాలే బాగు పడ్డాయన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టార్‌ క్యాంపెయినర్‌గా తనకు సోనియాగాంధీ ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరుతూ ప్రజల వద్దకు వెళ్తామని చెప్పారు. కొందరం బస్సు యాత్రఇంకొందరం పాదయాత్ర చేస్తామని చెప్పారు.తనకుమారుని వైద్యం కోసం ప్రియాంకా గాంధీ గతంలో హైదరాబాద్‌కు వచ్చారనికానీ కేసీఆర్‌ మాత్రం పన్ను పీకించుకోడానికి ఢిల్లీకి వెళ్లారని వ్యాఖ్యానించారు. తాము ధర్నాలు చేస్తే గృహనిర్భంధాలు చేశారనికేసీఆర్‌ మాత్రం అధికారంలో ఉండీ ధర్నాలు చేస్తున్నారన్నారు. మిల్లర్ల కోసమే కేసీఆర్‌ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు

*ధర్మారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగర శివారులోని ప్రభుత్వ గోదాములో మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రభుత్వ టెక్స్‌టైల్ శాఖ ఆధ్వర్యంలో ఈ గోదాము నడుస్తోంది. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినది అయినప్పటికీ ప్రభుత్వం అద్దెకు తీసుకుని గోదామును నిర్వహిస్తోంది. బతుకమ్మ చీరలు, పిల్లలకు సంబంధించిన బెడ్ షీట్లు, క్లాతులు ఈ గోదాములో నిల్వ ఉంచుతారు. అవసరమైన సమయంలో వీటిని పంపిణీ చేస్తారు. ఈ క్రమంలో గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. దాదాపు రూ. 38 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.

*కృష్ణజిల్లా మచిలీపట్నం:ఫైనాన్స్ డబ్బులు కట్టలేదని సుల్తానగర్ కు చెందిన అన్నమల శ్రీను ని కిడ్నాప్ చేసిన బజాజ్ ఫైనాన్స్ కు చెందిన కిరాయి గూండాలు..ఉదయం నుండి కార్యాలయంలో బంధించి చిత్రవధలు పెడుతున్నట్లు సమాచారం.
వ్యక్తులను బంధించడం, చిత్రవధలకు గురిచేయడం మరియు కిడ్నాప్ చేయడం చట్టరీత్యా నేరం అని తెలిసి కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడటం బజాజ్ ఫైనాన్స్ వారి బరితెగింపుకు నిదర్శనం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

* బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. షాయినాథ్‌గంజ్ సుల్తాన్‌బజార్ పీఎస్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదైందని పోలీసులు పేర్కొన్నారు. శ్రీరాముడి శోభాయాత్ర సందర్భంగా ర్యాలీలో ప్రజలకు అసౌకర్యం కలిగించారంటూ రాజాసింగ్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188, సిటీ పోలీస్ యాక్ట్ 21/76 కింద రాజాసింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు