Politics

ఏపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్‌ చెప్పాలి – TNI రాజకీయ వార్తలు

ఏపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్‌ చెప్పాలి – TNI రాజకీయ వార్తలు

* ఏపీలో సామాజిక న్యాయం ఎక్కడుందో జగన్‌ చెప్పాలని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లో 4 మంత్రి పదువులు ఇస్తే సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రజలు చైతన్యవంతులు కూకుంటే బానిస బతుకులేనని హెచ్చరించారు. ఎస్సీలు మళ్లీ తలెత్తుకుని తిరగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలాని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

*త్వరలో టీడీపీలోకి భారీ చేరికలు
టీడీపీలోకి త్వరలో భారీ చేరికలు ఉంటాయని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేబినెట్ విస్తరణ తర్వాత జగన్ ఎంత బలహీనుడో తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కేబినెట్ కూర్పుపై అసమ్మతితో సీఎం దిష్టిబొమ్మలు తగలబెట్టడం మొదటిసారి చూస్తున్నామని గంటా అన్నారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని జిల్లాలకు మంత్రి పదవులు లేకపోవడం దారుణమని గంటా విమర్శించారు.

* ఆప్ గూటికి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే!
గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంద్ర‌నీల్ రాజ్‌గురు గురువారం రాజ్‌కోట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరారు. గుజ‌రాత్‌లో కాషాయ పార్టీని ఓడించేందుకు ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లందించేందుకు ఆప్ మేలైన వేదిక‌గా ముందుకొచ్చింద‌ని ఇంద్ర‌నీల్ అన్నారు.ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ పార్టీ కోసం కాకుండా ప్ర‌జ‌ల బాగు కోసం పాటుప‌డ‌తార‌ని ఆప్ చీఫ్‌పై ప్ర‌శంస‌లు గుప్పించారు. ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి బీజేపీ అధికారంలోకి రాగా దీటైన ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గ‌డంలో కాంగ్రెస్ విఫ‌ల‌మైంద‌ని అన్నారు. బీజేపీని ఓడించాల‌నే సంక‌ల్పం కాంగ్రెస్ పార్టీకి కొర‌వ‌డటంతోనే తాను ఆప్‌లో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాన‌ని చెప్పారు.ఇంద్ర‌నీల్ రాజ్‌గురు 2012లో రాజ్‌కోట్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2017లో సీఎం విజ‌య్ రూపానీపై పోటీ చేసేందుకు ఆయ‌న త‌న సుర‌క్షిత నియోజ‌క‌వ‌ర్గాన్ని విడిచి రాజ్‌కోట్ వెస్ట్‌లో పోటీ చేసి ఓట‌మి పాల‌య్యారు. ఇంద్ర‌నీల్ రాజ్‌గురు రాక‌తో అసెంబ్లీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ బ‌లోపేత‌మ‌వుతుంద‌ని ఆప్ శ్రేణుల్లో ఉత్తేజం నెల‌కొంది.

*రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులిస్తాం: మంత్రి నాగేశ్వరరావు
రేషన్‌ బియ్యం వద్దంటే డబ్బులిస్తామని మంత్రి నాగేశ్వరరావు అన్నారు. ప్రజలు బియ్యం వద్దు.. నగదు కావాలంటే డిక్లరేషన్‌ తీసుకుంటామని మంత్రి తెలిపారు. నగదు వారి అకౌంట్‌లో జమ చేస్తామని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మళ్ళీ రేషన్‌ బియ్యం కావాలన్నా ప్రజలకు ఇస్తామని మంత్రి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

*ఏలూరు మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలి: పవన్
ఏలూరు పోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ ఘటన విషాదకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికుల కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని, మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక్కో ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఏమిటి? అని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. లూరు ఘటనలో మృతుల కటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు కంపెనీ తరపున రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రతాప్‌ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని ప్రతాప్‌ పేర్కొన్నారు.

*ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు: రామ్మోహన్‌ నాయుడు
జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. జగన్‌రెడ్డికి పరిపాలన చేతకాదన్నారు. ఓ వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచి.. మరోవైపు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం దారుణమని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

* నా పదవి పోతే భారత్ పండుగ చేసుకుంది : ఇమ్రాన్ ఖాన్పా
కిస్థాన్ ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంతో పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ భారత దేశంపై నిందలు మోపుతున్నారు. పెషావర్‌లో బుధవారం మాట్లాడుతూ, తాను ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలగడంతో భారత్, ఇజ్రాయెల్ ఎక్కువగా సంబరాలు చేసుకున్నాయన్నారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విదేశీ శక్తుల కుట్ర ఉందని ఆయన అనేకసార్లు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.మనపై ఈ బందిపోట్లను రుద్దడం ద్వారా పాకిస్థాన్‌ను అమెరికా అవమానించిందన్నారు. పదవిలో ఉన్నప్పటికన్నా ఇప్పుడు తాను మరింత ప్రమాదకారిని అవుతానని చెప్పారు. ‘‘నేను ప్రభుత్వంలో ఉన్నపుడు ప్రమాదకారిని కాదు. కానీ ఇప్పుడు నేను మరింత ప్రమాదకారినవుతాను’’ అని చెప్పారు. కోర్టులు అర్ధరాత్రి సమయంలో ఎందుకు తెరుచుకున్నాయని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేయడం లేదని ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడూ వ్యవస్థలకు వ్యతిరేకంగా ప్రజలను తాను రెచ్చగొట్టలేదని చెప్పారు.ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ కోసం పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఏప్రిల్ 9న రాత్రి పొద్దుపోయాక సమావేశమైంది. ఈ తీర్మానంపై అర్ధరాత్రి ఓటింగ్‌ను నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, అప్పటి నేషనల్ అసెంబ్లీ (పాకిస్థాన్ పార్లమెంటు) స్పీకర్ అసద్ కైజర్ ఓటింగ్‌ను నిర్వహించలేదు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఓటింగ్ జరిగింది. వేరొక పిటిషన్‌పై విచారణ కోసం ఇస్లామాబాద్ హైకోర్టు కూడా అర్ధరాత్రి పని చేసింది.

*జగన్ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను : ఆదిమూలపు సురేష్
మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు చేపట్టారు. హిందూ, క్రీస్తవ మతాచారాలకు అనుగుణంగా ఛాంబర్లోకి అడుగు పెట్టారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆదిమూలపు సురేష్ బాధ్యతలు స్వీకరించారు. రూ.1445 కోట్లతో 74 ఘన వ్యర్థాలను శుద్ధిచేసే సేవరేజ్ ప్లాంట్స్ ఏర్పాటుకు పరిపాలనా ఆమోదం ఇస్తూ మొదటి సంతకం చేశారు. అనంతరం చవటపాముల నాగరాజు అనే వ్యక్తికి పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంటులో కారుణ్య నియామానికి ఆమోదిస్తూ రెండవ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మంత్రిగా మరోసారి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రికి ఏం ఇచ్చినా రుణం తీర్చుకోలేనన్నారు. చిత్తశుద్ధితో తనకు అప్పగించిన పని చేస్తానన్నారు. జగనన్న తీసుకున్న స్వచ్ఛ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఏపీని క్లీన్ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తామన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగాలని ముఖ్యమంత్రి ఆశయమని.. దానికి అనుగుణంగా అన్ని నగరాలను అభివృద్ధి చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు లాగా పని చేస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

*డీజిల్‌ భారం ప్రభుత్వమే భరించాలి: పవన్‌ కల్యాణ్t
ఏపీ ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు కదా..లాభనష్టాల లెక్కలేంటి? అని ప్రశ్నించారు. డీజిల్‌ భారం ప్రభుత్వమే భరించాలని పవన్‌ కల్యాణ్ డిమాండ్ చేశారు. సెస్‌ విధింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే విద్యుత్‌ ఛార్జీలు, ఆస్తిపన్ను, చెత్త పన్ను వేస్తున్నారని పవన్‌ అన్నారు. రేపు ఇంకా ఏం పన్ను వేస్తారో అని ప్రజలు భయపడుతున్నారని పవన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

*వైసీపీ మంత్రులు భజనకు తప్ప బాధ్యతకు పనికి రారు
వైసీపీ మంత్రులు భజనకు తప్ప బాధ్యతకు పనికి రారని మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శించారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ పరిశ్రమలో యాక్టర్ పేలి 6 గురు సజీవదహనం అయ్యారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. పరిగెత్తుకుని ఘటనా స్థలానికి వెళ్లాల్సిన కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ గారు మాత్రం నియోజకవర్గంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇలాంటి భజన బృందం కారణంగానే వందలాది మంది అమాయక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి’’ అంటూ అయ్యన్న ట్వీట్ చేశారు.

*స్మృతి వనం నిర్మిస్తామన్నారు ఏమైంది?: సత్యకుమార్రా
జధానిగా అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో కేంద్ర సంస్థలు ఏర్పాటు చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు దృష్టికి తీసుకెళ్లడంలో తాము వైఫల్యం చెందుతున్నామన్నారు. స్మృతి వనం నిర్మిస్తామన్నారు ఏమైందని సత్యకుమార్ ప్రశ్నించారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తున్నారన్నారు. దళిత సమాజం పట్ల ముఖ్యమంత్రికి ఎంత గౌరవం ఉందో అర్థం అవుతుందన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారం సమయంలో వయసులో పెద్దవాడైన నారాయణస్వామి కాళ్ళు మొక్కే పరిస్థితికి వచ్చారని సత్యకుమార్ పేర్కొన్నారు.

*సీఎం జగన్‌కు ధన్యవాదాలు: మంత్రి సీదిరి అప్పలరాజు
ఏపీ సచివాలయంలో పశు సంవర్ధక , పాడి పరిశ్రమాభివృద్ది, మత్సశాఖ మంత్రిగా సీదిరి అప్పలరాజు వేద మంత్రోచ్చరణ మధ్య బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… తనకు మరోసారి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. మంత్రులకు స్వతంత్రం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారని అన్నారు. ఏ దేశ, రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట పశువుల ఆరోగ్యం చూస్తే తెలుస్తుందని సీఎం జగన్ చెబుతుంటారని తెలిపారు. 340 మొబైల్ వెటనరీ క్లీనిక్స్‌ను దేశంలో తీసుకవస్తున్న మొదటి రాష్ట్రం ఏపీ అని మంత్రి చెప్పుకొచ్చారు. ప్రతీ తీరప్రాంత జిల్లాల్లో హార్బర్ల నిర్మాణం చేయాలని సీఎం జగన్ ప్రాధాన్యతగా పెట్టుకున్నారని అన్నారు. ఇప్పటికే 4 హార్బర్‌ల నిర్మాణం మొదలైందన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో అక్వా ప్రాడక్ట్‌కు సంబంధించి మార్కెటింగ్ నెట్ వర్క్ ప్రారంభించనున్నామని వెల్లడించారు. ఐదు ఎరకరాలలోపు అక్వా రైతులకు రూపాయిన్నరకే సబ్సిడీతో విద్యుత్, పెద్ద రైతులకు మూడున్నర రూపాయలకు విద్యుత్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి సఅదిరి అప్పలరాజు పేర్కొన్నారు.

*ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు: రామ్మోహన్‌ నాయుడు
జగన్ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. జగన్‌రెడ్డికి పరిపాలన చేతకాదన్నారు. ఓ వైపు విద్యుత్‌ ఛార్జీలు పెంచి.. మరోవైపు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ది ప్రజా ప్రభుత్వం కాదని, రాక్షస ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం దారుణమని రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు.

*అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళితాభివృద్ధి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాల స్ఫూర్తితో దళిత జాతి ఆర్థిక ప్రగతి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ‘దళితబంధు’ అనేక విప్లవాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్‌ 131వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి అమ‌లు చేస్తున్నారన్నారు.ఇందులో విద్య, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తూ చేపట్టిన సంక్షేమ పథకాలు దళిత సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయని తెలిపారు. దళితుల్లో అన్నికేటగిరీల్లోని వారికి సంక్షేమ ఫలాలు అందేలా రూపొందించిన ఈ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో, రాష్ట్రేతర మేధావుల సైతం ప్రశంసిస్తున్నారని పేర్కొన్నారు.

*అంబేద్కర్ స్పూర్తితో సీఎం కేసీఆర్ పాలన: మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణలో అంబేద్కర్ స్పూర్తితోనే ముఖ్యమంత్రికేసీఆర్ పాలన సాగిస్తున్నారని పంచాయితరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల ఆత్మబంధువుగా నిలిచారని కొనియాడారు. వ‌రంగ‌ల్ – హ‌న్మ‌కొండ లోని అంబేద్క‌ర్ చౌర‌స్తాలోగ‌ల అంబేద్క‌ర్ విగ్ర‌హానికి ఆయన జయంతి సందర్భంగా పూల మాల వేసి, పుష్పాంజ‌లి ఘ‌టించారు.ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ అంబేద్కర్ అపర మేధావ అని అన్నారు. అంటరాని తనం రూపు మాపిన సంఘ సంస్కర్త అని అంటూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడని అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తి తోనే తెలంగాణలో సీఎం పాలన సాగిస్తున్నారని చెప్పారు. అంబేద్కర్ తర్వాత దేశంలో దళితుల గురించి ఆలోచించిన వ్యక్తి సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. దళితుల కోసం దళిత బంధు పథకం అమలు చేస్తున్నామని, అంబేద్కర్ కేవలం దళితుల వాడు మాత్రమే కాదు, ఆయన అందరి వాడు తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. ద‌ళితుల అభివృద్ధి కోసం ప్ర‌త్యేక చ‌ట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీ స‌బ్ ప్లాన్ ను ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ద‌ళిత విద్యార్థుల కోసం ప్ర‌త్యేక గురుకులాలు ఏర్పాటు చేసి, నాన్య‌మైన విద్య‌నందిస్తున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు

*మా నాయకుల్ని చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయి: వసంత కృష్ణప్రసాద్‌
నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తమ నాయకులను చూస్తుంటే తన కళ్ల వెంట నీళ్లొస్తున్నాయని ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో బుడమేరు అభివృద్ధి, నీరు చెట్టు పేరిట రూ.కోట్లు దోచుకుంటే, తమ నాయకులు చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు ఆలస్యమవుతున్నాయని చెప్పారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.200 కోట్ల పనులకు బిల్లులు రావాల్సి ఉందని వివరించారు. మైలవరం పంచాయతీ ఉపసర్పంచి సీతారెడ్డి రూ.2.5 కోట్ల విలువైన పనులు చేయగా, బిల్లులు ఆలస్యం కావడంతో తనకున్న 5 ఎకరాల మామిడి తోటను అమ్ముకున్నారని తెలిపారు. ఆ విషయం తెలిసి తాను ఆయనను క్షమాపణ కోరానన్నారు. తన స్వగ్రామంపై మమకారంతోనే బిల్లులు ఆలస్యమైనా పనులకు సొంత నిధులు ఖర్చు చేశానని సీతారెడ్డి చెప్పడంతో తనకు కన్నీళ్లు వచ్చాయని ఎమ్మెల్యే ఆవేదన చెందారు. ఆ నిధులు రానందుకు సిగ్గులేదా అని మాజీ మంత్రి ఉమా తనను ఎగతాళి చేస్తున్నారని, కానీ తమ ప్రభుత్వం ఇబ్బందులున్నా సంక్షేమాన్ని కొనసాగిస్తోందన్నారు. తమ నాయకులు సేవా భావంతో చేస్తున్న పనులకు వారి వద్ద సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు.

*కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో రైతులకు శాపం: భట్టి విక్రమార్క
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్పష్టతలేని విధానాలే రైతులకు శాపంగా మారాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరి సాగుకు దూరమైన రైతులందరికీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పంజాబ్‌, హర్యానా మాదిరిగానే రాష్ట్రంలో కూడా కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. విద్యుత్‌ బిల్లులకు సంబంధించి డెవలప్‌మెంట్‌ చార్జీలను విపరీతంగా పెంచడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పెంచిన అదనపు చార్జీలను ఉప సంహరించుకోవాలని లేదంటే ప్రజల భాగస్వామ్యంతో ఐక్య ఉద్యమాలు చేస్తామని భట్టి విక్రమార్క హెచ్చరించారు.

*రా రైస్ కొనాలని కేంద్రానికి లేఖ రాస్తాం: మంత్రి గంగుల
తెలంగాణలో 36 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 65 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశామన్నారు. 15 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని, ప్రభుత్వం దగ్గర కోటి 60 లక్షల గన్నీ బ్యాగులున్నాయని మంత్రి పేర్కొన్నారు. జూట్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాను గన్నీ బ్యాగులు ఇవ్వాలని అడిగాం చెప్పారు. గన్నీ బ్యాగులు ప్రైవేట్‌ ఏజెన్సీ దగ్గర కొనడానికి లేదని, ఎఫ్‌సీఐ దగ్గర ఎక్కువ గోడౌన్లు ఉన్నాయని మంత్రి గంగుల తెలిపారు. 1960 కంటే ఒక్క రూపాయి తక్కువకు ఎవరూ అమ్ముకోవద్దని మంత్రి స్పష్టం చేశారు. రా రైస్ కొనాలని కేంద్రానికి లేఖ రాస్తామని మంత్రి గంగుల అన్నారు.

*రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటిమయం అవుతుందన్నారు: హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్రం విడిపోతే తెలంగాణ చీకటి అవుతుందని ఉమ్మడిరాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. కానీ ఇప్పుడు ఏపీ చీకటైందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తోందని మంత్రి గుర్తు చేశారు.తెలంగాణలో పామాయిల్‌ సాగుకు ఎకరానికి రూ.80 వేల సబ్సిడీ ఇస్తున్నామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.పామాయిల్‌ సాగుతో ఏటా ఎకరానికి రూ.లక్షా 50 వేల ఆదాయం రైతులకు వస్తోందన్నారు. మనదేశంలో నూనె వినియోగం ఎక్కువ.. ఉత్పత్రి తక్కువగా ఉందని, బాయిల్డ్‌ రైస్ కొనబోమని కేంద్రం అంటోందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అనేది ఓ చరిత్ర.. ఇక దానికి భవిష్యత్ లేదని మంత్రి స్పష్టం చేశారు.

*ఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరదించాలి.. లేదంటే..: కిషన్‌రెడ్డి
ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ దీక్షలు పెట్టారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దీక్ష పేరుతో రాజకీయ లబ్ది పొందాలని చూశారని ఆరోపించారు. ఇప్పటికైనా టిఆర్ఎస్ రాజకీయ డ్రామాలకు తెరదించాలని, లేదంటే టీఆర్ఎస్ డ్రామాలకు ప్రజలే తెరదించుతారని అన్నారు. టీఆర్ఎస్‌వి రైతు దీక్షలు కాదని.. రాజకీయ దీక్షలని విమర్శించారు. కేసీఆర్‌ రాజకీయ నాటకమాడుతున్నారని, ఢిల్లీలో దీక్ష చేసి లబ్ది పొందాలనుకున్నారని, సీఎం డ్రామాలకు జనం తెరదించుతారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

*మొయినాబాద్‌కు రండి.. తేల్చుకుందాం: సబిత
తెలంగాణ సర్కారు తీసుకున్న 111 జీవో ఎత్తివేత నిర్ణయంతో.. ప్రతిపక్ష బీజేపీ ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతోందని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ జీవోపై అసలు అవగాహనలేని బీజేపీ నేతలు అసహనంతో విమర్శలు చేస్తున్నారన్నారు. బుధవారం సబితారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 84 గ్రామాల ప్రజలకు గుదిబండగా మారిన 111 జీవోను ఎత్తివేసిన సీఎం కేసీఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.‘‘రైతులకు మంచి చేసే ఆలోచనతో ప్రభు త్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయాలేమిటి?’’ అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. 111 జీవో ఎత్తివేత వల్ల హైదరాబాద్‌కు ప్రాధాన్యత తగ్గుతుందని కొందరు మాట్లాడుతున్నారని.. హైదరాబాద్‌కు ఆ జీవోకు సంబంధం ఏమిటన్నారు. ‘‘ఒక పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానిక ప్రజల బాధలు తెలుసుకొని మాట్లాడాలి. దమ్ము, ధైర్యం ఉంటే మొయినాబాద్‌కు వచ్చి మాట్లాడండి… అక్కడే తేల్చుకుందాం… ప్రజలే సమాధానం ఇస్తారు’’ అన్నారు.

*తెలంగాణకు కేసీఆర్‌ శని: జీవన్‌రెడ్డి
సీఎం కేసీఆర్‌ తెలంగాణకు శనిగా దాపురించారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల వరిసాగు తగ్గించినందుకే టీఆర్‌ఎస్‌ నేతలు సీఎం కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ తన అనాలోచిత చర్యలు, అస్పష్ట విధానాలతో రైతులను అయోమయానికి గురి చేశారని విమర్శించారు. ప్రస్తుతం జాతీయస్థాయిలో బాయిల్డ్‌ రైస్‌కు ఆదరణలేదని, రా రైస్‌ ఎంతైనా కొంటామని కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించిందని అన్నారు. దీనికి ఏపీ, తమిళనాడు, ఛత్తీ్‌సగఢ్‌ ఇండెంట్‌ ఇవ్వగా తెలంగాణ స్పందించలేదని చెప్పారు.

*విజయవంతంగా ‘దళితబంధు’: బండా శ్రీనివాస్‌
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం విజయవంతంగా కొనసాగుతోందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండా శ్రీనివాస్‌ తెలిపారు. సంక్షేమ భవన్‌లోని కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకం కోసం ప్రభుత్వం రూ.4,441 కోట్లు కార్పొరేషన్‌కు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 23,204 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8,410 యూనిట్లు గ్రౌండింగ్‌ అయ్యాయన్నారు. అంబేడ్కర్‌ జయంతి రోజున హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సుమారు 500 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేసినట్లు తెలిపారు.

*పదవులు ఎవరికి శాశ్వతం కాదు: పొంగులేటి
పదవులు ఎవరికి శాశ్వతం కాదని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో పదవులు అనుభవించి కాలగర్భంలో కలిసిపోయారని గుర్తుచేశారు. ప్రజల కోసం పనిచేసినవారే శాశ్వతంగా నిలిచారన్నారు. బతికినంత కాలం అధికారం నీతో ఉండదని, పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు పొందాలని చెప్పారు. ప్రజల అభిమానం పొందినప్పుడే వ్యక్తిత్వానికి గౌరవం వస్తుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు.

*అణగారిన వర్గాల కోసం జీవితాంతం పరితపించిన అంబేద్కర్: కేసీఆర్
ణగారిన వర్గాల సామాజిక, ఆర్ధిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు. భారత రత్న, రాజ్యాంగ రూపశిల్పి అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా బడుగు, బలహీన వర్గాల హక్కులకు ఎలాంటి అవరోధాలు కలగకుండదనే ఉద్దేశంతో వారికి ఖచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని సీఎం పేర్కొన్నారు. అంబేద్కర్ ఈ దేశంలో జన్మించడం భారత జాతి చేసుకున్న అద`ష్టమని సీఎం అన్నారు. ఈ సందర్భంగా దేశ పురోగమనానికి పునాదులు వేసిన అంబేద్కర్ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు.

*ప్రతిష్టాత్మకంగా రైతుల ధాన్యం కొనుగోళ్లు: మంత్రి ఎర్రబెల్లి
రాష్ట్రంలో ఈ కష్ట కాలం లోనూ, మళ్ళీ మరోసారి ప్రతిష్ఠాత్మకంగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. బుధవారం వరంగల్, హన్మకొండ జిల్లాలలో ధాన్యం కొనుగోలు పై ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల తో హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడారు.అత్యంత కష్ట కాలం, క్లిష్ట సమయంలోనూ సీఎం కెసిఆర్ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు.3 వేల కోట్ల నష్టాన్ని సైతం లెక్క చేయకుండా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు.కేంద్రం సహకరించకున్నా, గతంలో వడ్ల ను కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పటికీ, కేవలం రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతో ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.

*ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి: మంత్రి జోగి
రాష్ట్రంలో చేపట్టిన పేదల ఇళ్ల నిర్మా ణ పథకంలో వేగం పెంచాలని గృహనిర్మాణశాఖ నూతన మంత్రి జోగి రమేశ్‌ అధికారులను ఆదేశించారు. పేదలకు పక్కా ఇళ్ల పథకం ప్రభుత్వానికి అత్యం త ప్రతిష్ఠాత్మకమని, వీలైనంత త్వరగా పేదలకు గూడు కల్పించాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇంకా ఏవైనా సమస్యలుంటే ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తొలిసారిగా బుధవారం ఆ శాఖ అధికారులతో విజయవాడలో సమీక్ష నిర్వహించారు.

*పీల్చేగాపైనా జే ట్యాక్స్‌ వేస్తారేమో..!: లోకేశ్‌
‘‘పీల్చే గాలి తప్ప అన్నింటిపైనా జే ట్యాక్స్‌ వేసేశారు. త్వరలో దానిపైనా జగన్‌రెడ్డి పన్ను వేస్తారేమో..?’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. పెంచిన విద్యుత్‌ చార్జీలకు నిరసనగా ఇంటికో కొవ్వొత్తి, అగ్టిపెట్టె పంపిణీ చేశారు. గతంలో రూ.500లు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు సుమారు రూ.1600 వస్తుందని గ్రామాల్లో ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తాగునీటి సమస్యను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. మంత్రివర్గ కూర్పులో సామాజిక న్యాయం కాకుండగా మూడేళ్లుగా జగన్‌ జపం చేసినవారికే పదవులు ఇచ్చారని లోకేశ్‌ అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండలో ఆయన పర్యటించారు. బీసీలకు న్యాయం చేశానని చెప్పుకుంటున్న సీఎం జగన్‌ ఇప్పటివరకు ఆయా కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారో చెప్పాలన్నారు.

*తిరుపతి సంఘటనపై విచారణ చేపట్టాలి: వీర్రాజు
‘‘తిరుపతిలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయి. జరిగిన సంఘటనకు సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం గరువు పంచాయితీలో బుధవారం ప్రధాని మంత్రి ఆవాస్‌ యోజన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘భక్తులు సొమ్మసిల్లి పడిపోవడం, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడడం, ఎక్కువ మంది ఉన్న సమయంలో కూడా టికెట్లు అమ్మడం సరికాదు. రైతు ఆత్మహత్యలపై ముందుగా బీజేపీ స్పందించింది. కడప, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో ఆందోళన చేపట్టింది. రైతుల సమస్యలపై త్వరలో పాదయాత్ర చేపడతాం. రాష్ట్ర ప్రభుత్వానికి నవరత్నాలే సంక్షేమ పథకాలు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ వందలాది సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ సంక్షేమ పథకంలో 60 శాతం మోదీ ప్రభుత్వ నిధులే. నిధులు మావి, ప్రచారం జగన్మోహన్‌రెడ్డిది’’ అని వీర్రాజు విమర్శించారు.