DailyDose

వీరేశలింగం పంతులు 175వ జయంతి… ఆయన వివాసం చూద్దామా..!

వీరేశలింగం పంతులు 175వ జయంతి… ఆయన వివాసం చూద్దామా..!

భావితరాల కోసమని కందుకూరి వీరేశలింగం పంతులు నివాసం పరిశోధన కేంద్రంగా మారింది. నేడు వీరేశలింగం 175వ జయంతి సందర్భంగా ఆ సంస్కర్త స్మృతులను ఆ గృహంలో చూడొచ్చు.కందుకూరి అప్పట్లో ధరించిన కోటు, పంచె, తలపాగకందుకూరి అప్పట్లో ధరించిన కోటు, పంచె, తలపాగ జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో ఆయన జన్మించారు. కందుకూరి జన్మించిన ఇల్లు ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దాన్ని భావితరాల కోసమని పరిశోధన కేంద్రంగా నిర్వహిస్తోంది. సంఘసంస్కర్తగా వీరేశలింగం చేసిన కృషి, అలనాటి విశేషాలు అక్కడ ఇప్పటికీ కనిపిస్తాయి. అనేక సంఘ సంస్కరణలు చేసిన కందుకూరి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. బాలికా విద్యపై అవగాహన కల్పించారు.సామాజిక దురాచారాలు, అవినీతి అంతానికి పత్రికలు స్థాపించారు. ఇందుకు ఆయన ఇంటినే ముద్రణాలయంగా మార్చారు. ఇప్పటికీ ఆ ఇంట్లో అలనాటి ముద్రణా యంత్రం ఉంది. వ్యవస్థల్లో లోపాలు ప్రజలకు తెలిసేలా పలు నాటకాలూ రచించారు. నేడు వీరేశలింగం 175వ జయంతి సందర్భంగా ఆ సంస్కర్త స్మృతులను ఆ గృహంలో చూడొచ్చు.
Whats-App-Imag
Whats-App-Image-2022-0
Whats-App-Image-2022-04-16-at-5
Whats-App-Image-2022-04-16-at-5-24-27-AM
Whats-App-Image-2022-04-16-at-5-24-27