Editorials

ఇంతకు పువ్వాడకు బుర్ర ఉందా – TNI రాజకీయ వార్తలు

ఇంతకు పువ్వాడకు బుర్ర ఉందా  – TNI రాజకీయ వార్తలు

*రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీజేపీ కార్యకర్త సాయి ఆత్మహత్య కేసులో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు బుర్ర ఉందా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిలదీశారు. గాంధీ‌భవన్ వద్ద మంత్రి పువ్వాడ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అరాచకాలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్లను వేధించి పీడీ యాక్ట్‌లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పువ్వాడ వేధింపులతో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన తెలిపారు. చెడ్డ పనులు చేసి కమ్మ కులం పరువు తీయొద్దని మంత్రికి ఆయన హితవు పలికారు. పువ్వాడను కమ్మ కులం నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి మంత్రిని కేసీఆర్ ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వెంటనే పువ్వాడను బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పువ్వాడది మాత్రమే కమ్మ కులం కాదని, చనిపోయిన సాయిది కూడా అదే కులమని ఆయన పేర్కొన్నారు. కులం పేరు చెప్పడానికి పువ్వాడకు సిగ్గనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు. ప్రాణం పోవడం కూడా చిన్న ఇష్యూనా.. ఇంతకు పువ్వాడకు బుర్ర ఉందా అని ఆయన ఎద్దేవా చేశారు. త్వరలో ఖమ్మంలో పువ్వాడ ఇంటిని ముట్టడిస్తామని ఆయన తెలిపారు. పోలీసులలో కొందరు తొత్తులుగా మారి అరాచకాలకు సహకరిస్తున్నారని, వారి సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు.

*పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రభుత్వాసుపత్రి ఘటన జరిగింది : వాసిరెడ్డి పద్మ
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రానా టాటాతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ భేటీ అయ్యారు. విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ ఘటనపై చర్చించారు. అనంతరం వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తుపై కమిషనర్‌తో చర్చించామన్నారు. పోలీసుల నిర్లక్యం వల్లే ఘటన జరిగిందన్నారు. అందుకే సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశామని పద్మ వెల్లడించారు. త్వరలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీపీ చెప్పారన్నారు. ఇకపై మిస్సింగ్ కేసులపై వేగంగా స్పందించాలని సీపీకి సూచించినట్టు వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత బోండా ఉమలకు డైరెక్ట్‌గా తమ సిబ్బందే నోటీసులు ఇచ్చారన్నారు. విచారణకు రాకపోతే ఎలా రప్పించాలో కమిషన్‌కి తెలుసని వాసిరెడ్డి పద్మ తెలిపారు

*పాలకుర్తిలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన ఎర్రబెల్లి
జనగామ జిల్లా రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజక వర్గమైన పాలకుర్తిలోని దేవరుప్పుల మండ‌లం సింగరాజు పల్లె గ్రామంలో నూత‌నంగా నిర్మించిన 40 డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను శనివారం ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి ఇండ్ల ప్రారంభ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి ఇండ్ల‌ను ల‌బ్ధిదారులకు అప్పగించారు. అనంత‌రం జరిగిన కార్య‌క్ర‌మంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, ఇండ్లు పొందిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రం ఏమీ చేయకపోయినా, సహకారం లేకపోయినా సీఎం కేసిఆర్ మంచి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని అన్నారు. సీఎం కేసిఆర్ కృషి ఫలితమే ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని అన్నారు. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇండ్లు ఉన్నాయి.గతంలో కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలు అయింది. ఇన్నేండ్లలో మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు.సిగ్గు లేకుండా మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్లకు తగిన బుద్ధి చెప్పండని ప్రజలకు పిలుపునిచ్చారు. సాగు నీళ్లు, చెరువులను బాగు చేసి, నింపిన ఘనత సీఎం కెసిఆర్ దే. మంచినీళ్ళు, 24 గంటల కరెంటు వస్తున్నది. రైతుల తరపున సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు, సబ్సిడీ కట్టి కరెంట్ ఇస్తున్నారు. సింగరాజు పల్లె కు ఎంత చేసినా రుణపడి ఉంటాను. నా వెన్నంటి ఉన్న గ్రామం ఇది. అందుకే ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నాను. ఇండ్లు, సీసీ రోడ్లు, మెటల్ రోడ్లు, ఇచ్చిన. చెర్లకు నీళ్ళు తెచ్చాను. త్వరలోనే సెంట్రల్ లైటింగ్ వేస్తాను.
వడ్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ లు దొంగ నాటకం ఆడుతున్నాయని ఆరోపించారు. వడ్లు వద్దంటే, వేయమన్న రేవంత్, బండి సంజయ్ లు కంటికి కనబడకుండా పోయారు. అయినా సరే సీఎం కెసిఆర్ వడ్లను కొనుగోలు చేస్తున్నారు. బీజేపీ బడా ఝుటా పార్టీ. ఆ పార్టీ నేతల అబద్ధాలను నమ్మకండి.పొన్నాల లక్ష్మయ్య ఏండ్ల పాటు ఎమ్మెల్యే గా ఉన్నాడు. ఏడ పన్నాడు? ఆయన శాఖ కూడా అదే, అయినా ఏమీ చేయలేదు. నేను చెక్ డ్యాములు కట్టించాను.త్వరలోనే కొత్త పెన్షన్లు, మరిన్ని ఇండ్లు, సొంత జాగాలో ఇండ్లు ఇస్తామన్నారు.దళిత బంధు స్కీం దేశంలోనే ఎక్కడా లేని పథకం. సీఎం 3 ఏండ్ల లో ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించారు.త్వరలోనే మన ఊరు, మన బడి కింద సింగరాజు పల్లె ను ఎంపిక చేశాం. బడికి ప్రహరీ గోడ, మరుగుదొడ్లకు, అదనపు గదులకు మొత్తం 50 లక్షలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు

*అవయవదాతలు దేవుడితో సమానం: తలసాని
అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్అన్నారు. శనివారం రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతల ను స్మరించుకోవాలన్నారు.అవయవదానం తో 3800 మంది పునర్జన్మ పొందారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ వైద్యసేవలు ఎంతో అభివృద్ధి చేసినట్టు తెలిపారు.ప్రభుత్వ హాస్పిటల్స్ కు వైద్యం కోసం ఎంతో ధైర్యంగా వెళ్లేలా ప్రజలకు నమ్మకం కలిగించామన్నారు.కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్స్ లో అత్యాధునిక పరికరాలు అందుబాటులో ఉంచిన ఘనత కూడా సీఎం కేసీఆర్ దేనని మంత్రి తలసాని పేర్కొన్నారు

*ఒంగోలులో సీఎం జగన్‌ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారు: నక్కా ఆనంద్‌బాబు
ఒంగోలులో సీఎం జగన్‌ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతిపక్షాలు వద్దంటున్నాయనడం సరికాదన్నారు. జగన్‌రెడ్డి సంక్షేమం అంతా పచ్చిమోసమని అన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ జగన్‌ ఎత్తేశారని, ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే.. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి ఆరోపణలు చేస్తున్నారని నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు

*అనాథ బిడ్డలకు భరోసాకల్పించాలి: మంత్రి ఎర్రబెల్లి
అనాథ పిల్లలు అంటే ఎవరూ లేని వారు కాదని, వాళ్లకి మేము న్నామని భరోసా కల్పించడం మనందరి బాధ్యత అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అనాధ పిల్లల కోసం ఒక సమగ్ర పకడ్బంది చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఇప్పటికే అనాధల చట్టం కోసం కేబినెట్ సబ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించి ఓ నిర్ణయానికి వచ్చిందని, సీఎం కేసీఆర్ ఆమోదం తర్వాత అది ఒక సమగ్ర చట్టం రూపు దిద్దుకుంటుందని మంత్రి చెప్పారు.మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు కేంద్రంలోని సెయింట్ పాల్స్ స్కూల్ లో అనాథ పిల్లలతో మంత్రి కొంత సమయం గడిపారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు. వారి మంచి చెడులు తెలుసుకున్నారు. వాళ్ళ ఊళ్ళో వాళ్ళు అనాధ అయిన తీరు… వాళ్లు ప్రస్తుతం ఆశ్రమంలో ఎలా ఉన్నారు? వారి స్థితిగతులు ఏంటి? వారికి అందుతున్న వసతులు ఏంటి? వంటి విషయాలపై ఆరా తీశారు. కుశల ప్రశ్నలు వేశారు. అలాగే వారి చదువులు, వస్తున్న మార్కులు, భవిష్యత్ లక్ష్యాలు వంటి అనేక అంశాలను వారి ముందు ప్రస్తావించారు. వారితో కలిసి టీ తాగారు. స్నాక్స్ తిన్నారు. వారి అభిరుచులు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెళ్లపోతుండగా క్రమశిక్షణతో నిలబడి, టాటా చెప్పి, ఆ పిల్లలు అత్యంత ఆత్మీయ వీడ్కోలు పలికారు.

* షర్మిల పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చు
తెలంగాణలో రాజన్నరాజ్యమే లక్ష్యమంటూ వైయస్సార్టీపీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ షర్మిల…ముందుకు సాగుతున్నారు. పార్టీని ప్రజల్లో తీసుకెళ్లేందుకు కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రజా ప్రస్థానం పేరుతో పాదయాత్రను చేపట్టిన ఆమె రాష్ట్రమంతా తిరుగుతున్నారు. ప్రజలను నేరుగా కలుస్తూ వారితో మమేకమవుతున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.అయితే, తాజాగా షర్మిల పార్టీపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి మీకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందంటూ ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ప్రశ్న ఎదురయింది. దీనికి సమాధానంగా… రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చని, వైఎస్ షర్మిల పార్టీ వైయస్సార్టీపీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించొచ్చని అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

*ఎస్వీబీసీ చానల్ లో సినిమా పాటలు వేస్తున్నారు- సోము వీర్రాజు ఫైర్
టిటిడి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టిటిడిదే కాదు ప్రభుత్వానిది కూడా అని…శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత టిటిడిదని పేర్కొన్నారు సోము వీర్రాజు.ఇటీవల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…ఏదైనా ప్రధాన విధాన నిర్ణయాలు తీసుకొనేముందు అందరితో చర్చించాలని డిమాండ్ చేశారు.ధార్మికభావన ప్రభుత్వానికి అధికంగా ఉండాలి…టిటిడి బజ్జెట్ రూ3500 కోట్లలో ధర్మప్రచారానికి ఎంత కేటాయిస్తున్నారనీ ప్రశ్నించారు.ధర్మప్రచార కార్యక్రమాలు పూర్తిగా ఆగిపోయాయి…రాష్ట్ర వ్యాప్తంగా టిటిడి వేద పాఠశాలలు ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు.ధర్మప్రచార నిధులు ఎస్వీబీసీ ఛానల్ కు 80 శాతం కేటాయిస్తున్నారు….ఎస్వీబీసీ ఛానల్ లో సినిమా పాటలు ప్రసారం అవుతున్నాయని మండిపడ్డారు.ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణకు రాజకీయ నాయకులు ఎందుకు….పద్మశ్రీ అవార్డు వచ్చిన సివచ్చత కలిగిన వారు చాలా మంది ఉన్నారు అలాంటివారిని నియమించండని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…కొన్ని సీట్లను మానేజ్ మెంట్ కోటా కింద మారుస్కున్నారన్నారు. ప్రైవేటు వైద్యకళాశాల యాజమాన్యాలు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు…అక్రమాలు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నారు…జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కొత్త డ్రామాలు వేస్తున్నారని మండిపడ్డారు. తినే బియ్యం ఎందుకు ప్రజలకు ఇవ్వడం లేదు…అక్రమాలు అరికట్టకుండా నగగు ఇస్తామనడం దారుణమన్నారు

*బాధితురాలిని చంద్రబాబు పరామర్శిస్తే ప్రభుత్వం ఉలిక్కి పడింది : బోండా ఉమ
మానసిక వికలాంగురాలిపై ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ గదిలో 30 గంటలు నిర్భందించి సామూహిక అత్యాచారం చేశారని ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యంగా భావించి ప్రజలు నివ్వెర పోయారని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ అన్నారు.శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం చంద్రబాబు బాధితురాలిని పరామర్శించడానికి వెళితే ప్రభుత్వం ఉలిక్కి పడిందన్నారు. మూడు రోజుల తర్వాత మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మను పంపారని, కూతవేటు దూరంలో ఉన్న సిఎం, హోంమంత్రికి బాధితురాలిని పరామర్శించి.. భరోసా ఇచ్చే తీరిక కూడా లేదా? అని ప్రశ్నించారు.బాధితులకు న్యాయం చేయాలని కోరితే తమకు నోటీసుల ద్వారా బెదిరింపులా? అని మండిపడ్డారు. చంద్రబాబు వచ్చిన తర్వాత మంత్రులు కదిలారన్నారు. అక్కడ బాధితులు వాళ్లను నిలదీస్తే… తట్టుకోలేక పోయారని, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలనే పద్మ పాటిస్తున్నారని విమర్శించారు. మహిళా కమిషన్ హక్కులను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మహిళల హక్కుల కోసం పని చేయాల్సిన వాసిరెడ్డి పద్మ తాడేపల్లి ప్యాలెస్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని బోండా ఉమ దుయ్యబట్టారు.

* అయ్యన్నపాత్రుడు తాగుబోతు…భూమికి భారం: ఎంపీ విజయసాయి
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతు అని… ఆయన భూమికి భారంగా మారాడని అన్నారు. తెల్లవారి లెగిస్తే, ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఆ ప్రాంతానికి గాని రాష్ట్రానికి గాని ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆయన కుమారులు నిరుద్యోగులు గానే ఉన్నారని.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామని వ్యాఖ్యానించారు. జాతీయ రాజకీయాలపై, రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూర్చే వారితోనే తాము వెళ్తామని.. అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అలాగే ముందుకు వెళ్తామని ఎంపీ స్పష్టం చేశారు. ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. పబ్లిక్, ప్రైవేట్ రంగంలో కలిపి ఉపాధి కల్పించామని తెలిపారు. నైతిక విలువలు పడిపోతున్నాయని రోజుల్లో.. నైతిక విలువలు విద్యార్థులు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మన పూర్వికులు, విలువలను మనం పాటించాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు

*టీఆర్‌ఎస్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదు: బండి సంజయ్
నిజాం కాలంలో రజాకార్లు బయటకు వస్తే.. మహిళలు భయంతో తలుపులు వేసుకునేవాళ్లని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పాలనలోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనలో ఆడబిడ్డలకు రక్షణ లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేయని రంగం లేదన్నారు. తెలంగాణ వచ్చింది కేసీఆర్‌ వల్ల కాదని సుష్మాస్వరాజ్‌ వల్ల అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే బీజేపీ ఇస్తుందని సుష్మా పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ బిల్లు పెట్టకుంటే బీజేపీ ప్రైవేట్ బిల్లు పెడుతుందని సుష్మా ప్రకటించారన్నారు. బీజేపీ హామీకి భయపడే కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పెట్టిందన్నారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని బండి సంజయ్‌ తెలిపారు

*సీఎం జగన్‌కు నోటీసులు ఎప్పుడిస్తారులోకేశ్‌
ప్రభుత్వాస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయమని అడగటమే నేరమాఅలాగైతే మహిళల శీలానికి రేటుకట్టిఉన్మాదుల్ని మరింత రెచ్చపొమ్మంటూ విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేస్తున్న సీఎం జగన్‌రెడ్డికి ఎప్పుడు నోటీసులిస్తారుఎప్పుడు విచారిస్తారుఅని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నిలదీశారు. శుక్రవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ప్రభుత్వాస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారంసీఎం కాన్వాయ్‌ కోసం సామాన్యుల కారు లాక్కోవడంమట్టి మాఫియాను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై దాడి.. దీని కోసమా ఒక్క చాన్స్‌ అడిగిందిమంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేవైసీపీ నేతలు కలిసి చేస్తున్న విధ్వంసం చూస్తుంటే బాధేస్తోంది. సీఎం ఉండే నియోజకవర్గంలో పేదలకు చోటు లేదంటూ.. ఎమ్మెల్యే ఒక పక్క ఇళ్లను కూల్చేస్తున్నారు. మరో వైపు అనుచరగణం పేదలకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారుఅంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

*ధాన్యం సేకరణలో మిల్లర్లు బాగస్వామ్యం కావాలి: మంత్రి గంగుల
తెలంగాణలో యాసంగి ధాన్యంసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కొనుగోలుకేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ధాన్యం సేకరణలో మిల్లర్లు భాగస్వామ్యం కావాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మిల్లర్లను కోరారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో మంత్రి కమలాకర్ శుక్రవారం ఎర్రమంజిల్ లోని సివిల్ సప్లైస్ భవన్లో బేటీ అయ్యారు. యాసంగి ధాన్యం సేకరణపై మిల్లర్లతో నిర్వహించిన ఈ సమావేశం సుధీర్ఘంగా కొనసాగింది, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల నుండి పంపిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేయడానికి మిల్లర్లు విముఖత చూపిన నేపథ్యంలో మంత్రి గంగుల వారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించాలని, రైతులను కేంద్రం నట్టేట ముంచిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను ఆదుకునేందుకు సంపూర్ణ మద్దతు దరతో తెలంగాణ రైతాంగం పండించిన చివరి గింజ వరకూ సేకరించాలని నిర్ణయించారన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించే ప్రక్రియను సజావుగా నిర్వహించాలని మిల్లర్లకు సూచించారు, మిల్లర్ కు రైతుకు సంబందం ఎందుకని, కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించి మిల్లుకు పంపుతామని ఎట్టి పరిస్తితుల్లోను ఒక్క కిలోను సైతం మిల్లుల్లో కోత పెట్టవద్దని సూచించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వేసిన కమిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టం చేసారు. సీఎంఆర్ విషయంలోనూ సహకరించాలని సూచించారు. గతంలో సాగు ఇంతగా జరగలేదని, కరెంటు లేక, అటు రైతులు ఇటు రైస్ మిల్లులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ 24గంటల కరెంటు, సాగు నీరు, రైతు బందు, రైతు బీమా వంటి వ్యవసాయ అనుకూల రైతు విదానాలతో రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతన్నారనిమంత్రి పేర్కొన్నారు, ఒకరికొకరు అనుసంధానంగా ఉండే మిల్లర్లు సైతం బాగుపడే దశలో ఎఫ్.సిఐ ఏర్పడ్డప్పటి నుండి అనుసరిస్తున్న విదానాలను కాలదన్ని కేంద్రం రైతులతో వ్యాపారం చేయడం దురద్రుష్టం అని మంత్రి గంగుల అన్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా కాక సామాజిక బాధ్యతతో చూడాలని, ఆదాయమే కావాలంటే జీఎస్టీ, ఇన్ కంటాక్స్ వంటి వాటిలో చూసుకోవాలన్నారు.శ్రీలంక వంటి సంక్షోభం మన దగ్గర వస్తే ఏ దేశం కూడా మన దేశాన్ని ఆదుకోలేదని అందుకే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ని నీరుకార్చకుండా కనీసం 3 ఏళ్ల ఆహార నిల్వలు ఉంచుకోవాలన్నారు. అనంతరం ప్రతీ మిల్లర్ తో మంత్రి మాట్లాడారు. వారి సమస్యలను కూడా తెలుసుకుని, వాటి పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

*కాలుష్య రహిత ఎలక్ట్రిక్‌ బస్సులు తీసుకువస్తున్నాం: విశ్వరూప్‌
ష్ట్రంలో నూతనంగా కాలుష్య రహిత ఎలక్ర్టిక్‌ బస్సులను తీసుకువస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ తెలిపారు. శుక్రవారం కోనసీమ జిల్లా మామిడికుదురులో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలెట్‌ ప్రాజెక్టుగా వంద ఎలక్ట్రిక్‌ బస్సులను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. అనంతరం దశల వారీగా శాఖపట్నం, విజయవాడ, రాష్ట్రంలోని ప్రధాన నగరాల మధ్య నడపడానికి కృషి చేస్తామన్నారు. రవాణా వ్యవస్థను పటిష్ట చేస్తామని విశ్వరూప్‌ తెలిపారు.

*ప్రభుత్వ పథకాలు అందట్లేదని దొంగలు ప్రచారం చేస్తున్నారు: ధర్మాన
ప్రభుత్వ పథకాలు అందట్లేదని ఊళ్లల్లో దొంగలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సున్నావడ్డీ పంపిణీ పథకంలో భాగంగా శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలకు అనర్హులైన వారి వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి.. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రభుత్వ పథకం వర్తించలేదా? పింఛన్‌ ఇంతేనా వస్తోంది. ఇళ్లు మంజూరు కాలేదా?. ఇటువంటి దొంగల మాటలు వినొద్దు’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఎటువంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.\

*సీఎం జగన్‌కు నోటీసులు ఎప్పుడిస్తారులోకేశ్‌
ప్రభుత్వాస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయమని అడగటమే నేరమాఅలాగైతే మహిళల శీలానికి రేటుకట్టిఉన్మాదుల్ని మరింత రెచ్చపొమ్మంటూ విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేస్తున్న సీఎం జగన్‌రెడ్డికి ఎప్పుడు నోటీసులిస్తారుఎప్పుడు విచారిస్తారుఅని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ను నిలదీశారు. శుక్రవారం ఆయన ట్విటర్‌లో స్పందించారు. ‘‘ప్రభుత్వాస్పత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం, సీఎం కాన్వాయ్‌ కోసం సామాన్యుల కారు లాక్కోవడం, మట్టి మాఫియాను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపై దాడి.. దీని కోసమా ఒక్క చాన్స్‌ అడిగింది? మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, వైసీపీ నేతలు కలిసి చేస్తున్న విధ్వంసం చూస్తుంటే బాధేస్తోంది. సీఎం ఉండే నియోజకవర్గంలో పేదలకు చోటు లేదంటూ.. ఎమ్మెల్యే ఒక పక్క ఇళ్లను కూల్చేస్తున్నారు. మరో వైపు అనుచరగణం పేదలకు జీవనోపాధి లేకుండా చేస్తున్నారు’’ అంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.

*ప్రభుత్వ పథకాలు అందట్లేదని దొంగలు ప్రచారం చేస్తున్నారు: ధర్మాన
ప్రభుత్వ పథకాలు అందట్లేదని ఊళ్లల్లో దొంగలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. సున్నావడ్డీ పంపిణీ పథకంలో భాగంగా శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ‘నిబంధనల ప్రకారం ప్రభుత్వ పథకాలకు అనర్హులైన వారి వద్దకు టీడీపీ నాయకులు వెళ్లి.. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ప్రభుత్వ పథకం వర్తించలేదా? పింఛన్‌ ఇంతేనా వస్తోంది. ఇళ్లు మంజూరు కాలేదా?. ఇటువంటి దొంగల మాటలు వినొద్దు’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఎటువంటి సిఫారసు లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు మంజూరవుతున్నాయని ధర్మాన ప్రసాదరావు తెలిపారు.

*ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేస్తాం: సోము వీర్రాజు
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో త్వరలో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జగన్‌ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. పాదయాత్రలో సీఎం జగన్‌ ఇచ్చిన 2.3 లక్షల పోస్టుల భర్తీ హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు చేస్తున్న అవినీతికి పోలీసు శాఖ అండగా నిలుస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు.

*పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ నష్టం ఎవరి పాపం?: అంబటి
పోలవరం డయాఫ్రమ్‌ వాల్‌ నష్టం ఎవరి పాపం? అని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌అండ్‌ఆర్‌ పూర్తి కాకపోవడంతో 56 గ్రామాలు మునిగిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాపర్‌ డ్యామ్‌ సగంలో ఉండగానే డయాఫ్రమ్‌ వాల్‌ కట్టారని తెలిపారు. టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం ఇదేనని మండిపడ్డారు. చంద్రబాబు మీడియా పోలవరంపై అవాస్తవలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్ తమ వల్ల దెబ్బతిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలు 2018లోనే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పలేదా? అని సూటిగా ప్రశ్నించారు.అనుభవం ఉన్న టీడీపీ వాళ్లు ఎందుకు పూర్తి చెయ్యలేదని నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక లోపం వల్లనే డయాఫ్రమ్‌ వాల్ దెబ్బతిందని తెలిపారు. స్పిల్ వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పూర్తి చెయ్యకుండా అది కట్టారని మండిపడ్డారు. అన్ని ఒకేసారి కట్టే ప్రయత్నం వల్లే దెబ్బతిందని అన్నారు. ఎగువ, దిగువ కాపర్ డ్యామ్‌లు కట్టకుండా డయాఫ్రమ్‌ వాల్ కట్టారని అందుకే దెబ్బతిందని తెలిపారు. వరదలకు ముందే దాన్ని క్లోజ్ చేస్తే గ్రామాలకు ముంపు వస్తుందని అన్నారు. తాము ఆర్అండ్ఆర్ పూర్తి చేసి కాపర్‌డ్యామ్‌ క్లోజ్ చేశామని తెలిపారు. కాపర్‌ డ్యామ్‌ పూర్తి కాకుండా డయాఫ్రమ్‌ వాల్ కట్టడం టీడీపీ చేసిన చారిత్రక తప్పిదం కాదా? అని అని సూటిగా ప్రశ్నించారు.