Movies

అలా నటించడం సవాల్‌గా అనిపించింది

అలా నటించడం సవాల్‌గా అనిపించింది

విష్వక్సేన్‌, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. విద్యాసాగర్‌ చింతా దర్శకుడు. మే 6న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా రుక్సార్‌ థిల్లాన్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు. ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ నా మనసుకు బాగా దగ్గరైన సినిమా. గత చిత్రాల్లో నేను పోషించిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. మామూలు గ్రామీణ యువతిగా కనిపిస్తాను. కథ నా పాత్రచుట్టూ తిరుగుతుంది. సినిమాలో నాది చాలా ఎమోషన్స్‌ ఉన్న పాత్ర. కొన్ని ఎమోషనల్‌ సీన్లలో నాకు సంభాషణలు లేవు. కేవలం హావభావాల ద్వారానే సన్నివేశాన్ని రక్తికట్టించడం చాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడికి పాత్రలపై ఉన్న అవగాహన వల్ల మాకు నటించడం సులువు అయింది. కుటుంబ ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా ఉంటుం ది సినిమా. వినోదంతో పాటు భావోద్వేగాలు ఉన్న చిత్రమిది. విష్వక్సేన్‌తో వర్క్‌ చేయడం సరదాగా అనిపించింది. ఆయనకు దీటుగా నటించడానికి కష్టపడాల్సి వచ్చిం ది. తెలుగులో అల్లు అర్జున్‌, మహేష్‌బాబుతో నటించాలనుంది’ అని ఆమె చెప్పారు.