Movies

రాజీవ్‌తో విడాకులపై స్పందించిన యాంకర్‌ సుమ

రాజీవ్‌తో విడాకులపై స్పందించిన యాంకర్‌ సుమ

ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న సుమ కనకాల.. తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా‘జయమ్మ పంచాయితీ’. విజయ్‌ కలివారపు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరణవాణి మ్యూజిక్‌ అందించారు. మే19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటుంది సుమ. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల రూమర్స్‌పై స్పందించింది. ‘మనస్పర్థల కారణంగా విడాకుల వరకు వెళ్లారు అన్న వార్తలు నిజమేనా అని యాంకర్‌ అని ప్రశ్నించగా.. రాజీవ్‌తో నాకు పెళ్లయి 23ఏళ్లు అవుతుంది. ఈ 23ఏళ్లలో మేం చాలా సంతోషంగా ఉన్నాం.ఇలా రూమర్స్‌ వచ్చినప్పుడుల్లా మా పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ చేయడం ద్వారా పుకార్లకు కొంతవరకు చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాను. ఇండస్ట్రీలో ఇలాంటి పుకార్లు సాధారణమే. సెలబ్రిటీలు అన్న తర్వాత ఇలాంటివి తప్పదు. వీటి వల్ల మానసికంగా బాధ కలిగినా అందుకు అలవాటుపడి ఉన్నాం’ అంటూ చెప్పుకొచ్చింది