Business

హ్యుందాయ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కారు – TNI వాణిజ్య వార్తలు

హ్యుందాయ్‌ నుంచి ఎలక్ట్రిక్‌ కారు  – TNI వాణిజ్య వార్తలు

*ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మార్కెట్‌లో టూ వీలర్‌ సెగ్మెంట్‌పై పెద్దగా దృష్టి పెట్టని బడా కంపెనీలు కార్ల మార్కెట్‌లో మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఈ సెగ్మెంట్‌లో టాటా దూసుకుపోతుండగా కియా నేను వస్తున్నా అంటూ ప్రకటించింది. తాజాగా ఈవీ పోటీకి రెడీ అంటోంది హ్యుందాయ్‌.దేశీయంగా కార్ల అమ్మకాల్లో రెండో పెద్ద కంపెనీగా ఉన్న హ్యుందాయ్‌ తన అభిమానులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఎలక్ట్రిక్‌ కారును రిలీజ్‌ చేయబోతుంది. ఐయోనిక్‌ 5 పేరుతో ఈ ఎలక్ట్రిక్‌ కారుని రిలీజ్‌ చేయబోతుంది. ఇండస్ట్రీ ఇన్‌సైడ్‌ వర్గాల నుంచి అందిన సమచారం ప్రకారం ఐయోనిక్‌ 5 కారు 58 కిలోవాట్‌ ప్యాక్‌, 77.4 కిలోవాట్‌ బ్యాటరీ సామర్యంతో రెండు వేరియంట్లలో లభించనుంది. డ్యూయల్‌ మోటార్‌ కాన్ఫిగిరేషన్‌తో ఈ కార్లు రానున్నాయి. సింగిల్‌ ఛార్జ్‌తో 481 కిలోమీటర్ల మైలేజ్‌ అందివ్వనుంది. గరిష్టంగా గంటకు 260 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. 5.2 సెకన్లలో వంది కిలోమీటర్ల స్పీడ్‌ టచ్‌ చేయగలదు.ఇందులో 800వీ ఎలక్ట్రిక్‌ ఆర్కిటెక్చర్‌ సిస్టమ్‌ అమర్చారు. దీంతో 350 కిలో వాట్స్‌ ఛార్జర్‌ సాయంతో 18 నిమిషాల వ్యవధిలో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. 50 కిలోవాట్ల ఛార్జర్‌ సాయంతో 56 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది.పొడవు, వెడల్పు, వీల్‌బేస్‌ తదితర విషయాల్లో హ్యుందాయ్‌ టక్సన్‌ కంటే ఒక ఇంచు ఎక్కువే ఉండవచ్చని సమాచారం. ఎంట్రీ నుంచి హై ఎండ్‌ వరకు మొత్తం ఆరు ఈవీలను ఇండియాలో పరిచయం చేయాలని హ్యుందాయ్‌ ప్రణాళికలో ఉంది. కాగా ఇందులో మొదటి వాహనంగా ఐయోనిక్‌ 5 రిలీజ్‌ కానుంది. దక్షిణ కొరియాలో తయారైన కార్లను ఇండియాలో అసెంబ్లింగ్‌ చేయనున్నట్టు సమాచారం.

*హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌ యాజమాన్యం చేతులు మారుతోంది. విన్‌ఎయిర్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ట్రూజెట్‌ (టర్బో మేఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌) ఈక్విటీలో 79 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ.200 కోట్లు చెల్లించింది. ట్రూజెట్‌ ఎండీ ఉమేష్‌ వంకాయలపాటి, విన్‌ఎయిర్‌ సీఎండీ శామ్యూల్‌ తిమోతీ ఇందుకు సంబంధించిన ఒప్పందంపై గత నెల 26న సంతకాలు చేసినట్టు విన్‌ఎయిర్‌ తెలిపింది.

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.

*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.

*రెయిన్‌బో హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో మల్టీ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు మంచి స్పందన లభించింది. ఇష్యూ శుక్రవారంతో ముగిసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 2,05,14,617 షేర్లను విక్రయించాలని నిర్ణయించగా.. 25,49,03,787 (25.49 కోట్లు) షేర్లకు బిడ్లు దాఖలైనట్లు రెయిన్‌బో హాస్పిటల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కంచర్ల తెలిపారు. అంటే 12.43 రెట్లు అధికంగా ఇష్యూకు స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగంలో 38.9 రెట్ల షేర్లకు దరఖాస్తు చేశారు. ఈ విభాగంలో 57,75,605 షేర్లుండగా.. 22,46,97,591 షేర్లకు దరఖా స్తు చేశారు. కార్పొరేట్‌ కంపెనీల వంటి సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 3.73 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.

*ఆదాయపు పన్ను శాఖ అప్‌డేటెడ్‌ ఐటీ రిటర్న్‌ ఫారంను ఐటిఆర్‌-యు నోటిఫై చేసింది. ఈ ఫారం దాఖలు చేయాలంటే పన్ను చెల్లింపుదారులు సవరణకు కచ్చితమైన కారణం తెలియచేయాల్సి ఉంటుంది. తాము గతంలో ఐటీఆర్‌ దాఖలు చేయలేదా లేక ఆదాయం తప్పుగా పొందుపరిచారా లేక ఏ ఖాతాలో చెల్లించాలో తెలియచేయడంలో పొరపాటు దొర్లిందా లేక క్యారీ ఫార్వర్డ్‌ చేయాల్సిన నష్టం తగ్గిం దా వంటి వాటిలో అసలైన కారణం ఏమిటో తెలియచేయా లి. ఆ తర్వాత దాన్ని పూర్తి చేసి తాము వాస్తవంగా చెల్లించాల్సిన ఐటీ మొత్తాన్ని పొందుపరచాలి. 2019-20, 2020-21 సంవత్సరాలకు అప్‌డేటెడ్‌ రిటర్న్‌లు దాఖలు చేసే వారికి ఇది అందుబాటులో ఉంటుంది. సంబంధిత అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగిసిన రెండేళ్లలోగా దీన్ని దాఖలు చేయాలి.

*ఇంతవరకు బీమా రక్షణ పొందని అల్పాదాయ వర్గాల ప్రజలు, చిన్న వ్యాపారుల కోసం 12కి పైగా మైక్రో బీమా (ఎంఐ) మాడ్యూల్స్‌ను ఐఆర్‌డీఏఐ కమిటీ సూచించింది. కొన్ని రకాలైన మైక్రో బీమా స్కీమ్‌లను కలిపి ఒక కాంబినేషన్‌గా కాంబీ ఎంఐ స్కీమ్‌లు అందించేందుకు కూడా బీమా కంపెనీలను అనుమతించాలని సిఫారసు చేసింది. కుటుంబంలోని ప్రధాన సంపాదనాపరుని మరణం, తీవ్ర అనారోగ్య సమస్యలకు చికిత్స, వైపరీత్యాల్లో ధ్వంసమైన ఇళ్లు, వ్యాపారాల పునర్నిర్మాణం వంటి రిస్క్‌లను తట్టుకుని నిలదొక్కుకునేందుకు అవసరమైన మద్దతు ఇవ్వడం ఈ ఎంఐ స్కీమ్‌ల ప్రధాన లక్ష్యం. ఐఆర్‌డీఏఐ ప్యానెల్‌ 14 ప్రామాణిక మాడ్యూల్స్‌ను కూడా సూచించి వాటి ఆధారంగా బీమా కంపెనీలు వ్యక్తిగత, గ్రూప్‌ ప్రాతిపదికన స్కీమ్‌లు రూపొందించవచ్చని కూడా సిఫారసు చేసింది.

* ఈ ఏడాది మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరం ఫార్మా (ఔషధ) పరిశ్రమకు బాగానే కలిసొచ్చింది. ఈ కాలంలో భారత్‌ నుంచి నుంచి రూ.1,83,422 కోట్ల విలువైన ఔషధాలు ఎగుమతి అయ్యాయి. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఎగుమతైన రూ.90,415 కోట్లతో పోలిస్తే ఫార్మా ఎగుమతులు రెట్టింపునకుపైగా పెరిగాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, కొవిడ్‌ ఔషధాలకు గిరాకీ తగ్గడం వంటి సమస్యలు ఉన్నా 2021-22లో ఎగుమతుల్లో సానుకూల వృద్ధి కనిపించింది. ప్రపంచ వ్యాకిన్ల అవసరాల్లో 60 శాతం, జెనరిక్‌ మందుల అవసరాల్లో 20 శాతం మన దేశ ఫార్మా రంగం తీర్చిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.

*కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు, అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంశం సహా ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశించనున్నాయి. రంజాన్‌ కారంణంగా మంగళవారం మార్కెట్లకు సెలవు. బుధవారం నాడు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో గురువారం మార్కెట్లపై ప్రభావం చూపించే వీలుంది. ఫెడ్‌ రిజర్వ్‌ ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు తప్పదని సంకేతాలిచ్చింది. గత వారం అంతర్జాతీయ మార్కెట్లు దాదాపు 5 నుంచి 7 శాతం వరకు కరెక్షన్‌కు లోనవగా దేశీయ మార్కెట్లు 2-3 శాతం వరకు పతనమయ్యాయి. గడచిన రెండు వారాలుగా నిప్టీ.. ట్రయాంగిల్‌ ప్యాట్రన్‌లో సాగుతూ వస్తోంది. ఒకవేళ నిప్టీ బ్రేకౌట్‌ సాధిస్తే 17400-17450 పాయింట్ల దిశగా సాగే అవకాశం ఉంది. డౌన్‌ట్రెండ్‌లోకి అడుగుపెడితే మాత్రం 16900-16800 వద్ద మద్దతు స్థాయిలుంటాయి.

*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.