Health

మేక పాలతో.. మీ చ‌ర్మం నిగ‌నిగ ..

మేక పాలతో..  మీ చ‌ర్మం నిగ‌నిగ ..

మేకపాల ఔషధ గుణాన్ని మన పెద్దలు ఎప్పుడో గుర్తించారు. ఆవుపాలతో పోలిస్తే అత్యవసర కొవ్వు ఆమ్లాలు మేకపాలలోనే ఎక్కువ. అదనంగా క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్‌-ఎ, సి కూడా ఉంటాయి. మేకపాలు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. పైగా చర్మంలోకి ఇంకిపోతాయి. అలా చర్మాన్ని మృదువుగా, సున్నితంగా ఉంచుతాయి. మనిషి చర్మంలో ఉండే పీహెచ్‌ స్థాయులే మేకపాలలో ఉంటాయి. అంటే మేకపాల వల్ల చర్మం తన సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోదన్నమాట! సోరియాసిస్‌, గజ్జి లాంటి చర్మవ్యాధుల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. మేకపాలలో లాక్టిక్‌ ఆమ్లం ఎక్కువ. ఈ కారణంగా చర్మం నెమ్మదిగా రాలిపోతుంది. చర్మంపై తేమ నిలిచిపోయేలా చేస్తుంది. పొడిబారిన చర్మానికి పోషణనిస్తాయి. మొటిమలు, మచ్చల చికిత్సకూ మేకపాలు దోహదపడతాయి. మేకపాలలోని ప్రొటీన్లలో యాంటి బ్యాక్టీరియల్‌ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి. కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్నందువల్ల చిటచిటను, మంటను తగ్గిస్తాయి. మేకపాలను నేరుగా చర్మంపై ఫేస్‌ మాస్కులా ఉపయోగించుకోవచ్చు. మాయిశ్చరైజింగ్‌ ఫేస్‌ క్రీములు, సబ్బుల్లో కలుపుకొని వాడుకోవచ్చు. నూటికో కోటికో ఒక్కరికి.. మేకపాలు పడకపోవచ్చు.