Movies

ఆ రోజుల్ని మర్చిపోలేను..

Auto Draft

బాలీవుడ్‌ భామ అనన్యపాండే ‘లైగర్‌’ చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించింది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకులముందుకురానుంది. ఇందులో అనన్యపాండే నాయికగా నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా షూటింగ్‌ తాలూకు అనుభవాల్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిందీ భామ. ముఖ్యంగా హీరో విజయ్‌ దేవరకొండను పొగడ్తలతో ముంచెత్తింది. ఆమె మాట్లాడుతూ ‘విజయ్‌ చాలా సౌమ్యుడు. ఇతరులకు సహాయం చేసే గుణం ఎక్కువ. ఎప్పుడూ పక్కవాళ్లని నవ్విస్తూ ఉంటాడు. అమెరికా షూటింగ్‌లో మా టీమ్‌ అంతా ఎన్నో జ్ఞాపకాల్ని పోగు చేసుకున్నాం. ఆ రోజుల్ని ఎప్పటికీ మర్చిపోలేను’ అని చెప్పింది.