DailyDose

కాలువలోకి దూసుకెళ్లిన ‘పెళ్లి కారు’.. ఆరుగురు మృతి – TNI నేర వార్తలు

కాలువలోకి దూసుకెళ్లిన ‘పెళ్లి కారు’.. ఆరుగురు మృతి – TNI  నేర వార్తలు

*తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే..‘ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా’ అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఆగ్రహాంతో ఊగిపోయింది. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం మంచిది కాదని స్టేషన్‌ నుంచి కళ్యాణిని బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు.

*ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్ఎన్డీపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక జీడిమామిడి తోటలో జీడిపిక్కలు ఏరుతున్న కూలీలపై అడవి దున్నలు అకస్మాత్తుగా దాడిచేశాయి. ఈ దాడిలో కట్టవ రామయమ్మ(70) అనే వృద్ధురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. బాధితులను జంగారెడ్డిగూడెం ప్రాంతీయ ఆస్పత్రికి తలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరోకరు మృతిచెందారు. మరో మహిళ పంది భవాని స్వల్పగాయాలతో బయటపడింది. ఆమె ప్రస్తుతం ఎల్ఎన్డీపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

* వివాహ వేడుకల నుంచి తిరిగివస్తూ రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన బిహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగింది. కారు అదుపు తప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పెళ్లి నుంచి తిరిగివస్తుండగా జరిగిన కారు ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బిహార్లోని ఔరంగాబాద్ జిల్లా అకోనీ గ్రామం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. మృతులు.. ఝార్ఖండ్లోని పాలము జిల్లాకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో వ్యక్తికి వారణాసి బీహెచ్యూ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదీ జరిగింది.. ఝార్ఖండ్ పాలము జిల్లాకు చెందిన ఏడుగురు.. బిహార్లోని నబీనగర్లోని ఓ వివాహానికి హాజరై ఆదివారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమయ్యారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో అకోనీ గ్రామం సమీపానికి చేరుకునే సరికి కారు అదుపు తప్పింది. ఈ క్రమంలో ఆ కారు అక్కడే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా ఇద్దరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు వీరిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.మృతులలో ఐదుగురిని.. ఖాతిన్కు చెందిన రంజిత్ కుమార్, ఖాజురీకు చెందిన అభయ్కుమార్, సద్మాకు చెందిన అక్షయ్ కుమార్, ఛత్తర్పుర్కు చెందిన శుభమ్ కుమార్, బబ్లూ కుమార్గా గుర్తించారు. మరణించిన మరో వ్యక్తి.. చికిత్స పొందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

* దుర్గగుడి కానుకల చోరీ కేసులో అటెండర్‌ Arrest
ఇటీవల దుర్గగుడి హుండీలలోని కానుకల లెక్కింపులో వేర్వేరు తేదీల్లో నగదు, బంగారం వస్తువులను అపహరించిన దుర్గగుడి అటెండర్‌ కగ్గాపుల్లారావు(పుల్లయ్య 51)ను పోలీసులు అరెస్టు చేశారు. వన్‌టౌన్‌ స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ కొల్లి శ్రీనివాసరావు, పశ్చిమ డివిజన్‌ ఏసీపీ, డాక్టర్‌ కె.హనుమంతరావు, క్రైం ఏసీపీ సీహెచ్‌శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వెస్ట్‌డీ సీపీ కె.బాబూరావు వివరాలను వెల్లడించారు.పుల్లారావు ఈనెల 9వ తేదీన బంగారు వస్తువులు , రూ.4వేలు, ఏప్రిల్‌ 11వ తేదీన రూ.10వేలు, 20వతేదీన రూ.6 వేలు నగదు టాయ్‌లెట్‌లో దాచిపెట్టి, తరువాత వాటిని తీసుకువెళ్లడానికి ప్లాన్‌ చేశాడని తెలిపారు. ఈవో ఫిర్యాదు మేరకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటుచేసి, సీసీకెమెరాల ద్వారా, ఆలయంలోని సిబ్బందిని విచారించడం ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపారు. కేసును చేధించిన సిబ్బందికి రివార్డును ప్రకటించినట్టు తెలిపారు. నిందితుడిపై గతంలో చీరల (Saree) దొంగతనంపైన కూడా ఫిర్యాదు ఉన్నది. నిందితుడు పలుమార్లు చోరీ యత్నం చేయడంతో దుర్గగుడిపై నిఘా వైఫల్యం తేటతెల్లమవుతోంది.

*అమడగూరు మండలం, లోకోజూపల్లిలో లక్ష్మీదేవి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. అల్లుడు బాబు అత్త లక్ష్మీదేవిని కిరాతకంగా హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు. తన భార్య ప్రవర్తన మారడానికి అత్త లక్ష్మీదేవే కారణమంటూ అల్లుడు బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. భార్య మీద అనుమానంతో అత్తను హతమార్చాడని స్థానికులు చెబుతున్నారు.

* నారాయణపేట: జిల్లాలోని ఉట్కూర్‌ మండలంలో పిడుగుపాటుకు రెండు కాడెద్దులు మృతి చెందాయి. మండలంలోని మగ్ధుoపూర్‌ గ్రామానికి చెందిన పెంటమీది పటేలప్పకు రెండు ఎద్దులు ఉన్నాయి. కాడెద్దులను మేపుకు వదిలి పొలం దగ్గరే కట్టేశాడు. అయితే శనివారం రాత్రి 9 గంటల సమయంలో కురిసిన భారీ వర్షానికి పిడుగు పడటంతో అవి రెండూ మరణించాయి. ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా ఎద్దులు రెండూ మృతి చెంది ఉండటంతో కన్నీటి పర్యంతమయ్యాడు. వాటి విలువ రూ. లక్ష 80 వేలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. ఈ విషయమై స్థానిక తాసిల్దార్ తిరుపతయ్యకు ఫిర్యాదు చేశారు

*హైదరాబాద్‌లోని ఓ మొబైల్ స్టోర్‌ లో అగ్ని ప్రమాదం జరిగింది. మాదాపూర్ ఇమేజ్ గార్డెన్ సమీపంలోని ఓ భవనం మొదటి అంతస్థులో ఉన్న లాట్ మొబైల్ స్టోర్ సర్వర్ రూంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న మాదాపూర్ అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకున్నారు. కిటికీలు మొత్తం అద్దాలతో మూసి ఉండడంతో వాటిని పగులగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను ఆర్పివేశారు. మంటల్లో సర్వర్లు కాలిపోయాయి. అధిక వర్క్‌లోడ్ కారణంగా సర్వర్ ఓవర్ హీట్ అయి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదం జరగకుండా, ప్రమాదం జరిగినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఇరుకు గదిలో సర్వర్ ఉండడం ప్రమాదానికి ముఖ్య కారణాలుగా తెలుస్తున్నాయి.

* MP డాక్టర్ సంజీవ్ కుమార్‌ను‌ ఆన్ లైన్‌ (Online)లో మోసం చేసిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. కీలక సూత్రధారి పరారీలో ఉన్నాడు. పది రోజుల క్రితం పాన్ కార్డు అప్డేట్ చేయాలంటూ.. సైబర్ నేరగాళ్లు ఓటీపీ వివరాలతో రూ. 97 వేల నగదు ఆన్‌లైన్‌లో డ్రా చేసుకున్నారు.

* జయశంకర్ జిల్లాలోని భూపాలపల్లి రాంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. పీకల్లోతు మద్యం (మత్తులో భార్యపై భర్త రమేష్ దాడి చేశాడు. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న భార్య రాజ్యలక్ష్మిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే పోలీసులు వచ్చేసరికే రమేష్ పరారయ్యాడు. కాగా.. రమేష్‌కు రాజ్యలక్ష్మి రమేష్‌కు రెండో భార్య. అయితే నిత్యం మద్యం సేవించి రాజ్యలక్ష్మిని రమేష్ వేధిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

*భవానిపురం కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఇంటింటికి రేషన్ బియ్యాన్ని వాహనాల ద్వారా పంపిణి చేస్తోంది. ప్రభుత్వ వాహనంలోని రేషన్ మాఫియా.. అదే వాహనాలలోనే అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. అక్రమార్కులకు ప్రభుత్వ వాహనాలు అడ్డాగా మారాయా…? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వ వాహనంలో 60 బస్తాల బియ్యం దొరికాయి. గోడౌన్ ఉన్న 20 టన్నుల బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ వాహనాన్ని డ్రైవర్ వద్ద నుంచి అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మరో ప్రైవేటు వాహనాన్ని అధికారులు సీజ్ చేశారు.

*పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత, దివంగత పుల్లారెడ్డి మనవడు ఏకనాథ్‌రెడ్డిపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తనను హత్య చేయాలని చూశారని, ఇంటి నుంచి బయటికి రాకుండా రాత్రికి రాత్రే మెట్ల వద్ద గోడ కట్టారని బాధితురాలు ఆరోపించారు. భర్త, అత్తమామల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ 100 నంబర్‌కు ఫోన్‌ చేసిన ఆమె.. ఇంట్లో నుంచి బయటపడి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు రాఘవరెడ్డి, భారతి, ఏకనాథ్‌రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, గృహ హింస తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బెంగళూరుకు చెందిన కె.ప్రజ్ఞారెడ్డికి 2014 మార్చి 19న రాఘవరెడ్డి రెండో కుమారుడు ఏకనాథ్‌రెడ్డితో వివాహం జరిగింది.

*అధికార పార్టీ నేత కక్ష సాధింపులు, బెదిరింపులకు ఓ వృద్ధుడు బలయ్యాడు. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి రైల్వేస్టేషన్‌లో నారాయణ (80) ఆత్మహత్య చేసుకున్నాడు.. 2018లో బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో తలెత్తిన గొడవ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్‌ సుధాకర్‌ రెడ్డి.. తనను కులం పేరుతో దూషించాడంటూ అదే ఊరికి చెందిన పరశురాం నాయక్‌ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈకేసులో నారాయణ సాక్షి. గత నెల 6న అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. సుధాకర్‌రెడ్డికి వ్యతిరేకంగా నారాయణ సాక్ష్యం చెప్పాడు. దీంతో కక్ష పెంచుకున్న సుధాకర్‌రెడ్డి, నారాయణ పింఛన్‌ను రద్దు చేయించాడు. ‘నిన్ను, నీ కుటుంబాన్ని అంతం చేస్తా’ అంటూ బెదిరించాడు. దీంతో ఆవేదనకు లోనైన నారాయణ ఉరేసుకున్నాడు.

*వైసీపీలో వర్గ పోరుకు మరొకరు బలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గంజి నాగప్రసాద్‌ హత్యను మరిచిపోకముందే.. మరొకరు దారు ణ హత్యకు గురయ్యారు. ముదినేపల్లికి చెందిన మాల మహానాడు నేత, వైసీపీ గ్రామ నేత వర్రె నాగేంద్ర(39)ను కత్తులతో పొడిచి చంపారు. అడ్డొచ్చిన సమీప బంధువు అరుగుల మహేశ్‌(29)పైనా కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో వర్రె నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా… మహేశ్‌ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయం లో ఈ సంఘటన చోటుచేసుకుంది. నరేంద్రను అధికార పార్టీ నాయకులే హత్య చేశారని ఆయన భార్య, బంధువు లు ఆరోపిస్తున్నారు.

*తనపై దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని పిర్యాదు చేస్తే..‘ఇరువురిపై ఒకే రకమైన కేసులు పెట్టి నిందితునికి వంత పాడుతావా’ అంటూ సినీనటి కరాటే కళ్యాణి ఎస్‌ఆర్‌నగర్‌ సీఐ సైదులుపై ఆగ్రహాంతో ఊగిపోయింది. విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులతో గొడవపడడం మంచిది కాదని స్టేషన్‌ నుంచి కళ్యాణిని బయటకు పంపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కళ్యాణి సీఐపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానన్నారు.

*పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం ఇద్దరు సిక్కు వ్యాపారవేత్తలను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. హత్యకు గురైన ఇద్దరు సిక్కులు బటాతాల్‌ మార్కెట్‌లో సుంగధ ద్రవ్యాలను విక్రయదారులని పెషావర్‌ పోలీసులు తెలిపారు. మృతులు సల్జిత్‌ సింగ్‌ (42), రంజిత్‌ సింగ్‌ (38)గా గుర్తించారు. కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దుండకుల కోసం గాలించారు. ఇదిలా ఉండగా.. పెషావర్‌లో దాదాపు 15వేల మంది సిక్కులు నివసిస్తున్నారు.