WorldWonders

ఈ రొయ్య దంతాలను శుభ్రం చేస్తూంది. !

ఈ రొయ్య దంతాలను శుభ్రం చేస్తూంది. !

రొయ్యల్ని తింటాంగానీ … అవి దంతాల్ని శుభ్రం చేయడం ఏంటీ అనుకుంటున్నారా . అయితే తప్పకుండా క్లీనర్ ష్రింప్ గురించి తెలుసుకుని తీరాల్సిందే . సముద్రాల్లో ఉండే ఈ రొయ్యలు పగడపు దిబ్బల్నే ఆవాసంగా చేసుకుని జీవిస్తుంటాయి . ఇవి ఎక్కువగా పసిఫిక్ మహా సముద్రంలో ఉంటాయి . ఈ మధ్య ఓ స్కూబాడైవర్ క్లీనర్ ష్రింప్ గురించి తెలుసుకున్నాడు . వాటిని నేరుగా చూడాలనే ఉద్దేశంతో పసిఫిక్ మహాసముద్రంలోకి స్కూబా డైవింగ్కి వెళ్లాడు . పగడపు దిబ్బల వద్ద గుంపుగా ఉన్న ఆ రొయ్యల వద్దకు వెళ్లి నోరు తెరిచాడు . వెంటనే ఓ రొయ్య తన కాళ్లతో అతని దంతాల్ని శుభ్రం చేసి వాటి మధ్య ఇరుక్కున్న ఆహారపదార్థాల్ని తినేసింది . దాన్నంతటనీ మరొకరి సాయంతో వీడియో రికార్డు చేశాడతను . అంతేకాదు , ఈ రొయ్యలు సముద్ర జీవుల నోట్లోని దంతాల్నీ శుభ్రం చేసి … పారాసైట్లనీ , చిగుళ్లపై మృతకణాల్నీ తొలగిస్తాయట . రొయ్య , దంతాల్ని శుభ్రం చేసే ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది.