DailyDose

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం – TNI తాజా వార్తలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం  –  TNI  తాజా వార్తలు

తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పబ్లిక్ గార్డెన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. అలాగే రాష్ట్ర ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. ఎండల కారణంగా ఉదయం 9 గంటలకు ప్రారంభించి త్వరగా ముగించాలని కేసీఆర్‌ సూచించారు. జూన్‌ 2 సాయంత్రం రవీంద్రభారతి, జిల్లా కేంద్రాల్లో కవి సమ్మేళనం ఏర్పాటు చేయాలని, కవులు, రచయితలను ఆహ్వానించాలని కేసీఆర్ సూచించారు.
*‘రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి వివరిస్తూ ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌కు లేఖ రాశాను. ఆంధ్రప్రదేశ్‌ అప్పులు మొత్తం రూ.7.88 లక్షల కోట్లు’’ అని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మంగళవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి సభ నుంచి జనాలు పారిపోయారని, దీన్నిబట్టి భవిష్యత్తు ముఖచిత్రం తెలిసిపోతోందని తెలిపారు. ‘‘ప్రజల్లో మనం చాలా చులకనైపోయాం. వారిలో మనపైన ఉన్న ఆగ్రహాన్ని గుర్తించండి. మార్చిలో ఎన్నికలు అంటున్నాము. శ్రీలంకకు కూత వేటు దూరంలో ఉన్నామని పవన్‌ కల్యాణ్‌ ట్విట్‌ చేశారు. మనం శ్రీలంకను అప్పుల్లో దాటేశామా? గడప గడప గండం మానేయండి. గడప గడపకు తిరిగిన తర్వాత ఎమ్మెల్యేలకు పరిస్థితి అర్థమైంది. 151 మందిలో దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు పోటీ చేయారు’’ అని వ్యాఖ్యానించారు. బుగ్గన ఆర్థిక మంత్రి కాదు, అప్పుల మంత్రి అని అంటున్నారని తెలిపారు. సర్కారు వారి పాట సినిమా తరహాలో తాను కూడా సర్కారు వారి ఆట అనే సినిమా తీస్తానని, అందులో ఏపీ ప్రభుత్వం విలన్‌గా ఉంటుందని చెప్పారు. కాగా, రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ఏ మతాన్ని కూడా ప్రోత్సహించకూడదన్నారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం చర్చిల ఏర్పాటుకు స్థలం కోసం దరఖాస్తులకు ఆహ్వానించిందని తెలిపారు. తనపై దాడి చేసిన పోలీసులకు పదేళ్ల జైలు శిక్ష పడుతుందని, దీని వెనుక ఉన్న బాస్‌కు కూడా జైలు శిక్ష పడుతుందని చెప్పారు.
కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. నల్లచెరువు మండలం పి కొత్తపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వంకార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వకుండా మూడు సంవత్సరాలుగా అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారని మహేశ్వర రెడ్డి అనే యువకుడు సిద్ధారెడ్డికి ఫిర్యాదు చేశాడు. సమస్యలు పరిష్కరించనపుడు ఈ కార్యక్రమాలు ఎందుకని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. దీంతో వైసీపీ నేత ఒకరు మహేశ్వరరెడ్డి చెంపపై కొట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి చూస్తూ నిలబడ్డారు.
* కోనసీమ జిల్లా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై త్వరలో నోటిఫికేషనల్ విడుదల కానుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఈ జిల్లాలకు మహనీయుల పేర్లు పెట్టాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాలు, టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఈ డిమాండ్ సాధన కోసం అంశాల వారిగా ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే కోనసీమ జిల్లా పేరులో అంబేద్కర్ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
*రాష్ట్రంలో జగన్‌ పాలన ఏడ్చినట్టే ఉందని, ఈ సారి కచ్చితంగా చంద్రబాబే గెలుస్తాడని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన మహిళ సవాల్‌ చేసింది. కావాలంటే తన ఎకరంన్నర పొలం పందెం కాస్తానని వెల్లడించింది. ఆక్రమణకు గురైన తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఎన్నో రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్పందనలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె జగన్‌ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దళిత కుటుంబానకి చెందిన తనకు జగన్‌ పెన్షన్‌ కూడా కట్‌ చేశాడని.. కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశాడని వాపోయింది.వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన కె వెంకాయమ్మకు గ్రామంలో 4.50 సెంట్లు భూమి ఉంది. దానిలో 3.50 సెంట్లు అదేగ్రామానికి చెందిన కర్ని ప్రకాశం ఆక్రమించుకున్నాడు. తన భూమిని తనకు ఇప్పించాలంటూ అనేకసార్లు స్థానిక అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో గుంటూరు కలెక్టరేట్‌లో స్పందనకు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌కు పాలన చేతగాదని చెప్పింది. అన్న క్యాంటీన్లు తీసివేశాడని, కొవిడ్‌ సమయంలో అసమర్ధత పాలన అందించాడని మండిపడింది. అసలు ఆయన పథకాలు తనకు వద్దే వద్దని తేల్చి చెప్పింది. ఒక పక్క డబ్బులు వేస్తూ మరో పక్కన లాక్కుంటున్నాడని తిట్ల పురాణం అందుకుంది. జగన్‌ ఓట్ల కోసమే ఎస్సీ, ఎస్టీలమీద ప్రేమ ఉన్నట్టు చెప్పుకుని తిరుగుతున్నారు తప్ప ఆయనకు పరిపాలన చేతగాదని మండిపడింది. చంద్రబాబు సమయంలో చంద్రన్న కానుకులు, రంజాన్‌ తోఫాలు అందించారని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడని.. కావాలంటే తనకున్న ఎకరంన్నర పొలం పందెం కాస్తానంటూ సవాల్‌ విసిరింది. జగన్‌ మాత్రం మరోసారి అధికారంలోకి రాడని తేల్చి చెప్పింది.
*పవనాలు వచ్చేస్తున్నాయి. అనుకున్న దాని కన్నా ముందుగానే భారత్ లో వర్షాలు కురవనున్నాయి. మే చివరి నాటికి దేశంలోని చాలా ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే తెలిపింది.ఇదిలా ఉంటే మే 17 నుంచి కేరళలోని అన్ని జిల్లాలో నైరుతి రుతుపవనాల తొలకరి జల్లులు ప్రారంభం అవుతాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 17 నుంచి మేఘాలయ రాష్ట్రంలో కూడా అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక జిల్లాలతో పాటు అస్సాం, మేఘాలయ, కేరళలోని అన్ని జిల్లాల్లో శనివారం నుంచి విపరీతమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో వల్ల దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులను అనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాల విస్తరించనున్నాయి.రాబోయే ఐదు రోజుల్లో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రాబోయే ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ మరియు సిక్కింలలో విస్తారంగా తేలికపాటి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కావేరి, కుట్టియాడి, భాతపుజా, కరువనూరు, కీచేరి మరియు పెరియార్ నదులలో నీటి మట్టం పెరిగే అవకాశం ఉన్నందున వచ్చే రెండు రోజుల పాటు కేరళలోని దాదాపు అన్ని జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కేరళ మరియు తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) సలహా ఇచ్చింది. మే 18 మరియు 19 తేదీలలో కోస్తా మరియు దక్షిణ అంతర్గత కర్ణాటకలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
*మాజీమంత్రి నారాయణ కుమార్తెలుఅల్లుడికి ముందస్తు బెయిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పేపర్‌ లీక్‌ కేసులో శరణిసిందూరపునీత్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. ఉత్తర్వుల కోసం విచారణను గురువారానికి హైకోర్టు వాయిదా వేసింది.
*సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫ్‌ మైనార్టీస్‌(సీఈడీఎం) ఆధ్వర్యంలో టీఎస్‌ టెట్‌-2022 (TS TET-2022) పరీక్షకు హాజరయ్యే ఉర్దూ మీడియం అభ్యర్థులకు నిజాం కాలేజీలో ఉచిత శిక్షణ (Free Coaching) తరగతులు ప్రారంభించినట్లు సీఈడీఎం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కలీమ్‌ అహ్మద్‌ జలీల్‌ తెలిపారు. టెట్‌ పరీక్షకు హాజరయ్యే దాదాపు 1,800 మంది విద్యార్థులు (Students) ఆన్‌లైన్‌ ద్వారా ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సోమవారం నుంచి ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభ్యర్థులకు ఐడీ కార్డులు జారీచేశామని, మెటీరియల్‌తోపాటు ప్రతిరోజూ మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 7 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఉర్దూ మీడియం అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలీం అహ్మద్‌ విజ్ఞప్తి చేశారు.
*సాంకేతిక లోపం పేరుతో అలియన్స్‌ ఎయిర్‌లైన్స్‌ (Alliance Air Flight) సంస్థ ప్రయాణికులకు చుక్కలు చూపించింది. సరైన సమాచారం అందించకుండా గంటల తరబడి నిరీక్షించేలా చేయడంతో ప్రయాణికులు (Passangers) తీవ్ర అవస్థలు పడ్డారు. ఆలియన్స్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం 40 మంది ప్రయాణికులతో సాయంత్రం 6.40 గంటలకు బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలు దేరింది. టేకాఫ్‌ తీసుకోకుండానే రన్‌వేపై చక్కర్లు కొట్టి విమానాన్ని సాంకేతిక లోపం పేరుతో నిలిపి వేశారు. ప్రయాణికులను విమానం నుంచి దించి తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు (Airport) పంపారు.
* గౌతమ బుద్ధుడి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుద్ధుడి బోధనలను స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పిన శాంతి, సహనం, అహింసా మార్గాలు నేటికీ అనుసరణీయమన్నారు. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని పేర్కొన్నారు. కృష్ణా నది ఒడ్డున నాగార్జున సాగర్‌లో ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో అంతర్జాతీయ స్థాయి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనాన్ని ప్రభుత్వం ఇటీవల జాతికి అంకితం చేసిందని తెలిపారు. బుద్ధుడి జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా భాసిల్లనుందన్నారు. సర్వజన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనంలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుడి మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని చెప్పారు.
*ఇష్టంలేని పెళ్లి చేశారంటూ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది ఓ బాలిక. దీనిపై స్పందించిన అధికారులు.. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం బాలికను సఖీ కేంద్రానికి తరలించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామ పంచాయతీ అవాజ్‌మియా పడకల్‌ గ్రామానికి చెందిన బాలిక (12)కు ఆమె తల్లిదండ్రులు.. ఫరూఖ్‌నగర్‌ మండలం వెల్జర్ల గ్రామానికి చెందిన రవి (30)తో మూడురోజుల క్రితం వివాహం జరింపించారు. ఈ పెళ్లి ఇష్టంలేని బాలిక.. సోమవారం స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులను ఆశ్రయించింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని, రక్షణ కల్పించాలని వేడుకుంది. వెంటనే స్పందించిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మి.. బాలిక ను కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడకు ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించిన పోలీసులు.. కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని చెప్పారు. అనంతరం బాలికను సఖీ కేంద్రానికి తరలించారు.
*ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐఎ్‌సబీ పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
*అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. ఊంజల్‌ సేవ కోసం ఊయలను ఏర్పాటు చేస్తుండగా అది జారి కింద పడి ఒకరు మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు. అన్నమయ్య జయంతి ఉత్సవాలకు కల్యాణ ఏర్పాట్లు, ఊంజల్‌ సేవ ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాల నిర్వహణ అంతా టీటీడీ అధికారులే చేయాలి. టీటీడీలో ప్రతిరోజూ ఇటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉండటం వల్ల ఈ ఉత్సవ ఏర్పాట్లలో అక్కడ టెక్నికల్‌గా అన్ని విషయాలు తెలిసిన కూలీలు, ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తారు. అటువంటిది తాళ్లపాకలో ఆగమేఘాల మీద నిర్వహించిన ఏర్పాట్లు ఒక కూలీ ప్రాణాన్ని బలిగొన్నాయి. సోమవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో తాళ్లపాకలో శ్రీవారి కల్యాణం నిర్వహించారు. సాయంత్రం తాళ్లపాక ముఖద్వారం వద్ద ఊంజల్‌ సేవ ఏర్పాట్లు చేశారు.
*అబద్ధాలకు, మోసాలకు ఆస్కార్‌ అవార్డు ఇస్తే అది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికే వస్తుంది. గణపవరం సభలో ఆయన పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. రైతులను ఘోరంగా నష్టపర్చి కూడా మాయ మాటలు చెప్పడం ఆయనకే చెల్లింది’’ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. సోమవారం ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయానికి ఏటా బడ్జెట్లో పెట్టిందే రూ.10 వేల కోట్లు. మూడేళ్లలో రూ.30 వేల కోట్లు పెట్టారు. రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేశానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన దానిలోనే సగం ఖర్చు చేయలేదు. ఇక లక్షన్నర కోట్లు ఎక్కడ..! ఎవరికి ఖర్చు చేశారు?’’ అని నిలదీశారు. రైతు భరోసాపై ఇచ్చిన హామీని, అమలు అవుతున్న తీరును, అర్హులైన రైతుల సంఖ్యకు, లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్యకు పొంతన లేకపోవడాన్ని ఎత్తి చూపించారు.
*జగన్‌ పాలన ఏడ్చినట్టే ఉందని, ఈ సారి కచ్చితంగా చంద్రబాబే గెలుస్తాడని గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన మహిళ సవాల్‌ చేసింది. కావాలంటే తన ఎకరంన్నర పొలం పందెం కాస్తానని వెల్లడించింది. ఆక్రమణకు గురైన తన భూమిని తనకు ఇప్పించాలంటూ ఎన్నో రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో స్పందనలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆమె జగన్‌ సర్కారుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరుపేద దళిత కుటుంబానకి చెందిన తనకు జగన్‌ పెన్షన్‌ కూడా కట్‌ చేశాడని.. కరెంటు బిల్లు రూ.18 వేలు వచ్చినట్టు చూపి పథకాలన్నీ రద్దు చేశాడని వాపోయింది.
*ఉపాధి కూలీలపై తేనెటీగలు చేసిన దాడిలో ఓ వృద్ధుడు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తూర్పుగోదావరి జి ల్లా నిడదవోలు మండలం పందలపర్రు గ్రామంలో సోమవారం పంటకాలువ బోదె తవ్వడానికి ఉపాధి హామీ పథకం కూలీలు వెళ్లగా పక్కనే చెట్టుపై ఉన్న తేనెటీగల పుట్ట నుంచి ఒక్కసారిగా ముసురు కోవడంతో వాటి బాధను తట్టుకోలేక వెలిగేటి గన్నియ్య(69) అక్కడిక్కడ మృతిచెందారు. మరో ఐదుగురు కూలీలు దారపురెడ్డి కృష్ణారావు, బత్తుల ముసలయ్య, కప్పల కుమారి, అంబటి దుర్గ, సుంకర సూర్యచంద్రరావులకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. మృతిచెందిన గన్నియ్య కుటుంబసభ్యులను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను ఎంపీడీవో పి.మూర్తిబాబు, తహశీల్దార్‌ ఎమ్‌.గంగరాజు పరామర్శించారు. ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుచున్న కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు చెప్పారు.
*సమస్యల పరిష్కారం కోసం రేషన్‌ వాహనాల ఆపరేటర్లు (ఎండీయూలు) జూన్‌ నుంచి తలపెట్టిన సమ్మెకు రాష్ట్ర రేషన్‌ డీలర్ల సమాఖ్య మద్దతు తెలిపింది. ఎండీయూలు ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగస్వామ్యం అయినందున ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరింది. ఈ మేరకు సమాఖ్య అధ్యక్షుడు లీలా మాధవరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎండీయూల నియామక సమయంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి వేతనాలు, బీమా నగదు చెల్లించాలన్నారు. కరోనా వల్ల చనిపోయిన 42 మంది ఎండీయూల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అలాగే కరోనాతో చనిపోయిన 80 మంది రేషన్‌ డీలర్ల కుటుంబాలకు కూడా గుజరాత్‌ రాష్ట్రం తరహాలో పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు.
*అబద్ధాలకు, మోసాలకు ఆస్కార్‌ అవార్డు ఇస్తే అది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికే వస్తుంది. గణపవరం సభలో ఆయన పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశారు. రైతులను ఘోరంగా నష్టపర్చి కూడా మాయ మాటలు చెప్పడం ఆయనకే చెల్లింది’’ అని తెలుగుదేశం పార్టీ ఎద్దేవా చేసింది. సోమవారం ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘జగన్‌రెడ్డి వచ్చిన తర్వాత వ్యవసాయానికి ఏటా బడ్జెట్లో పెట్టిందే రూ.10 వేల కోట్లు. మూడేళ్లలో రూ.30 వేల కోట్లు పెట్టారు. రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేశానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. బడ్జెట్లో పెట్టిన దానిలోనే సగం ఖర్చు చేయలేదు. ఇక లక్షన్నర కోట్లు ఎక్కడ..! ఎవరికి ఖర్చు చేశారు?’’ అని నిలదీశారు. రైతు భరోసాపై ఇచ్చిన హామీని, అమలు అవుతున్న తీరును, అర్హులైన రైతుల సంఖ్యకు, లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్యకు పొంతన లేకపోవడాన్ని ఎత్తి చూపించారు.
*ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐఎ్‌సబీ పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
*ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 26న హైదరాబాద్‌కు వచ్చే అవకాశాలున్నాయి. గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) ప్రారంభమై 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా ఈ నెల 26న ద్విదశాబ్ది వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధానిని ఆహ్వానించారు. పర్యటన దాదాపు ఖరారైందని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఐఎ్‌సబీ పూర్వ విద్యార్థులైన ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.