Politics

కేంద్రంలో మార్పు త‌థ్యం.. రెండు మూడు నెల‌ల్లోనే సంచ‌ల‌న వార్త – TNI రాజకీయ వార్తలు

కేంద్రంలో మార్పు త‌థ్యం.. రెండు మూడు నెల‌ల్లోనే సంచ‌ల‌న వార్త – TNI రాజకీయ వార్తలు

* కేంద్రంలో మార్పు త‌థ్య‌మ‌ని సీఎం కేసీఆర్ పున‌రుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వ‌రూ అడ్డుకోలేర‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రెండు మూడు నెల‌ల త‌ర్వాత సంచ‌ల‌న వార్త వింటార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. బెంగళూరు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్.. మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌, క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార స్వామితో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా దేశంలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితులతో పాటు రాజ‌కీయ అంశాల‌పై అంశాల‌పై సుదీర్ఘంగా చ‌ర్చించారు. ఈ స‌మావేశం ముగిసిన త‌ర్వాత సీఎం కేసీఆర్.. మాజీ సీఎం కుమార‌స్వామితో క‌లిసి విలేక‌రుల‌తో మాట్లాడారు.

* రాహుల్ బ్రిట‌న్ టూర్‌కు పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్ అవ‌స‌రం లేదు : కాంగ్రెస్‌
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవ‌ల చేపట్టిన బ్రిట‌న్‌ ప‌ర్య‌ట‌నకు రాజ‌కీయ అనుమ‌తి ల‌భించ‌లేద‌ని ప్ర‌భుత్వం పేర్కొన‌డాన్ని కాంగ్రెస్ పార్టీ గురువారం తోసిపుచ్చింది. బ్రిట‌న్ లేబ‌ర్ పార్టీ నేత‌, గ‌తంలో భార‌త్ వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసిన ఎంపీ జెరెమి కార్బిన్‌తో రాహుల్ భేటీ నేప‌ధ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ వ్యాఖ్య‌లు చేసింది. రాహుల్ త‌న బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న కోసం పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్ కోర‌లేద‌ని సీనియ‌ర్ అధికారులు వెల్ల‌డించారు.ప్ర‌భుత్వ వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ తోసిపుచ్చుతూ రాహుల్ గాంధీ బ్రిట‌న్ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి అవ‌సరం లేద‌ని స్ప‌ష్టం చేసింది. రాహుల్ గాంధీ ఎఫ్‌సీఆర్ఏ అనుమ‌తి పొందార‌ని, ఆయ‌న ప‌ర్య‌ పొలిటికిల్ క్లియ‌రెన్స్ అవసరం లేద‌ని కాంగ్రెస్ ప్ర‌తినిధి ర‌ణ్‌దీప్ సుర్జీవాలా పేర్కొన్నారు. బీజేపీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఈ అంశం లేవ‌నెత్తుతోంద‌ని అన్నారు.ఎమ్మెల్యే, ఎంపీ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు ఎఫ్‌సీఆర్ఏ అనుమ‌తి స‌రిపోతుంద‌ని, రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు ఎఫ్‌సీఆర్ఏ క్లియ‌రెన్స్ ల‌భించింద‌ని చెప్పారు. కేంద్ర మంత్రి లేదా ప్ర‌భుత్వ ఉద్యోగుల విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కే పొలిటిక‌ల్ క్లియ‌రెన్స్ అవ‌స‌రమ‌ని పేర్కొన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్ర‌భుత్వ సేవ‌కులు కాద‌ని, వారు ప్ర‌జ‌ల సేవ‌కుల‌ని స్పష్టం చేశారు. ప్ర‌భుత్వేత‌ర ప‌ర్య‌ట‌న‌ల కోసం వారు ప్ర‌భుత్వానికి జ‌వాబుదారీ కాద‌ని పేర్కొన్నారు.

*నేను ఏ సమయంలోనూ వైసీపీలోకి వెళ్లను: Maganti babut
మాజీ ఎంపీ, టీడీపీ నేత మాగంటి బాబు(Maganti babu) ఈరోజు(గురువారం) నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. గురువారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ…‘‘నేను ఏ సమయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లను’’ అని స్పష్టం చేశారు. వైసీపీలో చేరినవారు కూడా త్వరలో తిరిగి టీడీపీలోకి వచ్చేస్తారని తెలిపారు. ఒక్కసారి ఛాన్స్ అడిగిన జగన్ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో మంత్రుల దుర్భాష, ఎమ్మెల్యేల రౌడీయిజం, పోలీసులతో దౌర్జన్యం, అక్రమ అరెస్ట్‌లే మిగిలాయన్నారు. మహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలకు ఓ శుభ సమయం ఆరంభం కాబోతోందని అన్నారు. తాను మళ్ళీ ఏలూరు పార్లమెంట్ రాజకీయాల్లోనే ఉంటా అని మాగంటి బాబు తేల్చిచెప్పారు.

*అమలాపురం ఘటన ప్రతిపక్షాల కుట్ర : చీఫ్ విప్ ప్రసాద్‌రాజు
అమలాపురం ఘటన ప్రతిపక్షాల కుట్ర అని చీఫ్ విప్ ప్రసాద్‌రాజు పేర్కొన్నారు. దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రసాద్‌రాజు వెల్లడించారు. జగన్‌కు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే.. ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని చీఫ్ విప్ ప్రసాద్‌రాజు పేర్కొన్నారు.

*ఏపీలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి: Somu veerraju
రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరిగిపోయాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తిరుమలలో స్వామి వారికి నిత్యం జరిగే కార్యక్రమాలను నిలిపేశారన్నారు. హిందూ మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. వెంకటేశ్వర స్వామి భక్తుల హృదయం గాయపడుతోందన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని జగన్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే… పోలీసుతో పాటు ఏ ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదని అన్నారు. మాటలతో ప్రభుత్వం మభ్య పెడుతోందని సోమువీర్రాజు విమర్శించారు.

*Ambedkar పేరుని జిల్లాకు పెట్టడంపై రాజకీయాలు: జీవీఎల్అం
బేద్కర్‌ పేరుని జిల్లాకు పెట్టడంపై రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహరావు తప్పుబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్‌ పేరు ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు.. సీఎం జగన్ పాటించారని ఆరోపించారు. జనసేనతో కలిసి ఏపీలో పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చిచెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో బీజేపీ పోటీ చేస్తుందని జీవీఎల్ నరసింహరావు ప్రకటించారు.

*ప్రజలకు అందుబాటులోకి అన్నిరకాల ప్రభుత్వ వైద్యసేవలు:Harish rao
అన్ని రకాల ప్రభుత్వ వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలనేది ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం ఆయన పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి అమీర్ పేట లోని 50 పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మొత్తం తిరిగి పరిశీలించారు. ఇక్కడ అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి చికిత్స పొందుతున్న వారిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి అభివృద్ధి, ఇక్కడకు చికిత్స కోసం వచ్చే వారికి మరింత మెరుగైన సేవలు అందించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మంత్రి తలసాని హరీశ్ రావు కు వివరించారు. ముఖ్యంగా ఆసుపత్రిలో CT స్కాన్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని, జనరేటర్ ఏర్పాటు చేయాలని తదితర సౌకర్యాలు కల్పించాలని వివరించారు. స్పందించిన ఆరోగ్య శాఖ మంత్రి అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథ, DMHO డాక్టర్ వెంకట్, TSMIDC MD చంద్రశేఖర్ రెడ్డి, CE రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు.

* బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏం చేశారో చర్చించేందుకు.. వైకాపా సిద్ధమా? : అచ్చెన్న
అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఏంచేశారో చర్చించేందుకు వైకాపా నేతలు సిద్ధమా? అని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రాష్ట్రాన్ని తన సొంత సామాజికవర్గానికి చెందిన నలుగురు వ్యక్తులకు రాసిచ్చిన జగన్‌… ఇప్పుడు సామాజిక న్యాయం పేరుతో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం మానుకోవాలన్నారు. మహానాడును పక్కదోవ పట్టించేందుకే… సామాజిక న్యాయం పేరుతో మంత్రుల చేత బస్సుయాత్ర చేపట్టారని ఆక్షేపించారు. మహానాడు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రేపటి మహానాడుకు పూర్తిగా సిద్ధమయ్యామని చెప్పారు. మహానాడుకు పేరు రాకూడదని వైకాపా బస్సు యాత్ర చేపట్టిందని మండిపడ్డారు. మంత్రి పదవుల్లో సామాజిక న్యాయం చేశామని చెబుతున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు.
2014లో 103 స్థానాలు గెలిస్తే 9 మందికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.

*అంటేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు కొనసాగించాలి : మాల్యాద్రి
కుల వివక్ష పోరాట సమితి అధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దళిత, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ అధ్యక్షుడు మాల్యాద్రి మాట్లాడుతూ.. కోనసీమ అందరిదని.. అంటేద్కర్ అందరివాడని పేర్కొన్నారు. అంటేద్కర్ పేరును కోనసీమ జిల్లాకు కొనసాగించాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు ఆమోదించాలన్నారు. పేరును వివాదాస్పదం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు. మనువాద, మతోన్మాద ఉచ్చులో ఎవరూ పడొద్దని కోరారు. కోనసీమ జిల్లా ప్రజలు, పోలీసు యంత్రాంగం సంయమనం పాటించాలన్నారు. కుల విద్వేషాలు రగిల్చే వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాల్యాద్రి సూచించారు.

*సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాం : బొత్స
సామాజిక న్యాయ భేరి మంత్రుల బస్సు యాత్ర ప్రారంభమైంది. సెవెన్ రోడ్డు జుంక్షన్ వద్ద వైఎస్ విగ్రహానికి మంత్రులు నివాళులు అర్పించిన ఈ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. సమాజంలో విప్లవాత్మక మార్పులను తెస్తామన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని బొత్స పేర్కొన్నారు

*సమసమాజ స్థాపన చేసిన సంఘ సంస్కర్త జగన్: అప్పలరాజు
రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు దేశం దృష్టికి తీసుకువెళ్లటమే యాత్ర ఉద్దేశ్యమని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. సమసమాజ స్థాపన చేసిన సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. మహిళలకు పురుషులతో సమానమైన గౌరవం కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అణగారిన వర్గాలకు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అప్పలరాజు పేర్కొన్నారు.

*మోదీ వస్తున్నారనే.. కేసీఆర్‌ వెళ్తున్నారు: కె.లక్ష్మణ్‌
ప్రధాని మోదీ వస్తున్నారనే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర విడిచి పోతున్నారని, ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితీని సీఎం కాలరాశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న మోదీని సన్మానించేందుకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయంలో సంబంధిత ఏర్పాట్లను లక్ష్మణ్‌తోపాటు బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్ట పోయిన తెలంగాణ రైతులను ఆదుకోకుండా.. ఇతర రాష్ర్టాల రైతులకు డబ్బులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన రావాలని రాష్ట్ర ప్ర జలు కోరుకుంటున్నారని తెలిపారు. పంచాయతీలకు నిధులు ఇవ్వక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

*సంజయ్‌ వ్యాఖ్యలు చట్టవిరుద్ధం: తమ్మినేని
‘మసీదులన్నింటిని తవ్వాలి. వాటిలో శవాలు బయటపడితే మీవి. శివలింగాలు బయట పడితే మావి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే సంజయ్‌ కరీంనగర్‌లో మత విద్వేశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న సంజయ్‌ ఈ తరహా యాత్రలు చేయడమే తప్పు అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*తెలంగాణ రైతుల చావు కేకలు కేసీఆర్‌కు వినిపించట్లేదా?: షర్మిల
పంజాబ్‌ రైతుల చావులు కనిపించిన కేసీఆర్‌కు తెలంగాణ రైతుల చావు కేకలు వినిపించట్లేదా అంటూ వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. ధాన్యం ఎప్పుడు కొంటారోనన్న దిగులుతో కామారెడ్డి జిల్లా సంగమేశ్వర గ్రామంలో సిద్ద రాములు అనే రైతు గుండె ఆగిందన్నారు. ఆఖరి గింజ వరకూ కొంటానని చెప్పి ఇప్పుడు కొనకుండా రైతులను పాడె ఎక్కిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ట్వీట్‌ చేశారు.

*2009 నుంచి కేసీఆర్.. నాటకాలు: విజయశాంతి
ప్రజలను మోసగించడానికే సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో మాట తప్పడం, మోసగించడం తప్ప.. కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. రైతులు, నిరుద్యోగులను గాలికొదిలేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..‘‘ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే… ప్రజల్ని మోసగించడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారని పదే పదే స్పష్టమవుతోంది. సారు నాటకాల్ని 2009 నుంచీ జనం చూస్తూనే ఉన్నారు. నాటి ఎన్నికల్లో తొలుత టీడీపీ, సిపిఐలతో కూడిన మహాకూటమికి జై కొట్టిన కేసీఆర్…. బ్యాలెట్ బాక్సులు తెరవకముందే పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన భారీ ర్యాలీలో ఎన్టీయేకి సై అన్నారు. తర్వాత 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ జపం చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తానంటూ వారిని ఊరించి చివరికి ఝలక్ ఇచ్చారు.

*నిర్మ‌ల్ జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్ట్ లను పూర్తిచేయాలి:Iidrakaran reddy
నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేసి పంట‌ల‌కు సాగునీరు అందేలా చూడాల‌ని అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర‌ణ్య భ‌వ‌న్ లో సమీక్ష సమావేశం నిర్వ‌హించారు.ప్యాకేజీ 27, 28, సదర్‌మాట్‌ బ్యారేజీ, చెక్‌ డ్యామ్‌ నిర్మాణాలు, చెరువుల మ‌ర‌మ్మ‌త్తులు, పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌పై ఈ సమావేశంలో సమగ్ర చర్చించారు. గ‌తేడాది కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల్ల నిర్మ‌ల్ జిల్లాల్లో 110 చెరువులు, కుంట‌లకు గండ్లుప‌డ్డాయ‌ని, వాటి పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు ఎంత వ‌ర‌కు వ‌చ్చాయ‌ని మంత్రి ఆరా తీశారు.

*సచివాలయ ఉద్యోగులకు ‘శాప్‌’ గేమ్స్‌: రోజా
ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక ఆటల పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను ప్రదానం చేస్తామని రాష్ట్ర యువజన, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. ఏపీ సచివాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన వార్షిక క్రీడా పోటీల్లోని విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం సచివాలయంలో నిర్వహించారు.

*అమలాపురంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌: మంత్రి వనిత
అమలాపురంలో హింసకు పాల్పడిన 46 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్టు హోం శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అమలాపురంలో పరిస్థితులు అదుపులోకి వచ్చాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అమలాపురంలో ఆందోళనలు జరగకుండా అడిషనల్‌ డీజీ, డీఐజీ, ఎస్పీలు, అదనపు బలగాలను పంపించామన్నారు. ఆందోళనకారులు దాడి చేస్తున్నప్పటికీ ఎదురుదాడి చేయకుండా పోలీసులు సంయమనం పాటించారన్నారు. పోలీసులు గాయపడినప్పటికీ ప్రజలకు రక్షణగా ఉంటూ ఆందోళనకారులను అదుపు చేశారన్నారు. మంగళవారం పోలీసులు వ్యవహరించిన తీరు ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు నిదర్శనమంటూ, పోలీసులను అభినందించారు. కాగా అమలాపురం అల్లర్ల ఘటనపై విచారణ జరుగుతోందని, తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని పర్యాటక శాఖ మంత్రి రోజా అన్నారు. కాగా కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే వద్దనడం సరికాదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. కోనసీమ ఘటనపై విచారణ జరుగుతోందన్నారు.

*అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వివాదాస్పదం చేస్తున్న ప్రతిపక్షాలు: రోజా
అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రి రోజా దుయ్యబట్టారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలే ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. సూసైడ్ చేసుకుంటానన్న వ్యక్తి జనసేన వాడేనని వెల్లడించారు. అమలాపురం ఘర్షణలో ఇప్పటివరకు దాదాపు 60 మందిని అరెస్ట్‌ చేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చదివారని రోజా ఎద్దేవాచేశారు.

*అన్యం సాయి Janasena కార్యకర్తే : సజ్జల
అమలాపురంలో మంగళవారం జరిగిన దాడులు.. కుట్రపూరిత దాడులని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని తప్పికొట్టారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే కారణం అంటున్నారని, వైసీపీ వాళ్లే అయితే.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు జరిగేవా? అని ప్రశ్నించారు. టీడీపీ, పవన్, బీజేపీ ఒకే ఆరోపణలు చేస్తున్నారని, పార్టీల స్పందన చూస్తుంటే.. అందరూ ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోందన్నారు. టీడీపీ స్క్రిప్టునే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చదివారని, ఆయనకు కనీస అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవాచేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన కోరాయని, ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. పేరుపై అభ్యంతరాల నమోదుకు అన్ని జిల్లాలకు గడువు ఇచ్చామని సజ్జల గుర్తుచేశారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని, అన్యం సాయి జనసేన కార్యకర్తేనని సజ్జల తెలిపారు. అతను జనసేన నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయని, అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

*మోదీ వస్తున్నారనే.. కేసీఆర్‌ వెళ్తున్నారు: కె.లక్ష్మణ్‌
ప్రధాని మోదీ వస్తున్నారనే సీఎం కేసీఆర్‌ రాష్ట్ర విడిచి పోతున్నారని, ప్రధానికి స్వాగతం పలికే ఆనవాయితీని సీఎం కాలరాశారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ విమర్శించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ద్విదశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్న మోదీని సన్మానించేందుకు బేగంపేట విమానాశ్రయంలో పార్టీ తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయంలో సంబంధిత ఏర్పాట్లను లక్ష్మణ్‌తోపాటు బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్ట పోయిన తెలంగాణ రైతులను ఆదుకోకుండా.. ఇతర రాష్ర్టాల రైతులకు డబ్బులు ఇవ్వడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అవినీతి రహిత, కుటుంబ రహిత పాలన రావాలని రాష్ట్ర ప్ర జలు కోరుకుంటున్నారని తెలిపారు. పంచాయతీలకు నిధులు ఇవ్వక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

*మోదీ తెలంగాణ పర్యటనకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న సందర్భంగా ఆయన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరగనుంది. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం వద్ద జరిగే ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పాల్గొననున్నారు.

*సంజయ్‌ వ్యాఖ్యలు చట్టవిరుద్ధం: తమ్మినేని
‘మసీదులన్నింటిని తవ్వాలి. వాటిలో శవాలు బయటపడితే మీవి. శివలింగాలు బయట పడితే మావి’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు చట్టవిరుద్ధమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే సంజయ్‌ కరీంనగర్‌లో మత విద్వేశాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న సంజయ్‌ ఈ తరహా యాత్రలు చేయడమే తప్పు అని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

*6 లక్షల మందితో ‘రెడ్డి సింహగర్జన’:జేఏసీ
తమ డిమాండ్ల సాధన కోసం రెడ్డి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే 29వ తేదీన నిర్వహించ తలపెట్టిన ‘రెడ్డి సింహగర్జన’ సభకు నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఘటకేసర్‌ ప్రధాన రహదారి పక్కన వంద ఎకరాల స్థలంలో జరిగే ఈ సభకు ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీంతో జన సమీకరణ కోసం రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 5 వేల వాహనాలు సిద్ధం చేసినట్లు జేఏసీ నేతలు వెల్లడించారు. ఈ మేరకు రెడ్డి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం సమావేశమైన నేతలు సింహగర్జన సభ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మాట్లాడుతూ రెడ్లతోపాటు ఇతర ఓసీ కులాల్లో పేద సంక్షేమానికి గతంలో ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం కరీంనగర్‌, వరంగల్‌, హైదరాబాద్‌ ప్రాంతాల్లో గతంలో రెడ్డి గర్జన నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినా సానుకూల స్పందన లేదన్నారు. సింహగర్జన సభ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డి జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు అప్పమ్మగారి రాంరెడ్డి, గోపు జయపాల్‌రెడ్డి, ఓసీ సామాజిక సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తదితరులు పాల్గొన్నారు.

*అన్ని ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తా: అన్వితా రెడ్డి
ప్రపంచంలోని అన్ని ఖండాల్లో ఉన్న ఎత్తెన పర్వతాలన్నింటినీ అధిరోహించడమే తన లక్ష్యమని పర్వతారోహకురాలు పడమటి అన్వితా రెడ్డి తాజాగా వెల్లడించారు. భువనగిరి జిల్లా ఎర్రంబల్లి చెందిన అన్విత చదువులో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె తండ్రి మధుసూదన్‌ రైతు కాగా అమ్మ చంద్రకళ భువనగిరిలోని అంగన్‌వాడీలో పనిచేస్తున్నారు. ఇటీవల అన్విత ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించి బుధవారం నగరానికి చేరుకున్న సందర్భంగా అన్వితా గ్రూప్‌ అధినేత అచ్యుత రావు, ఇతర సిబ్బంది ఆమెకు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఎర్రమంజిల్‌లో మీడియాతో అన్విత మాట్లాడారు. ‘‘17ఏళ్ల నుంచే నాకు పర్వతారోహణపై ఆసక్తి కలిగింది. భువనగిరిలోని రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌లో బేసిక్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌, ఇన్‌స్ట్రక్టర్‌ శిక్షణను పూర్తి చేసి, పర్వతారోహణ సంస్థల్లో ప్రాథమిక, అడ్వాన్స్‌ కోర్సులను పూర్తి చేశాను. అన్వితా గ్రూప్‌లో మార్కెటింగ్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్న నాకు మా సంస్థ యాజమాన్యం స్పాన్సర్‌గా నిలిచింది. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు ఏప్రిల్‌ మొదటి వారంలో నేపాల్‌కు చేరుకున్నా. అక్కడనుంచి ఎవరెస్ట్‌ శిఖరారోహణను ప్రారంభించాను. 9 రోజుల తర్వాత గత నెల 17న 5300ఎత్తులో ఉన్న మాచ్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నాను. తర్వాత 7,100 మీటర్ల ఎత్తుకు చేరుకున్నాను. ఈ నెల 12న బేస్‌ క్యాంప్‌ నుండి ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించి, 16న ఉదయం 9.30 గంటలకు శిఖరాన్ని (8848.86 మీటర్లు) చేరుకుని నా కల సాకారం చేసుకున్నాను. గత ఏడాది జనవరిలో ఆఫ్రికా ఖండంలోనే ఎత్తైన కిలిమంజారోను, డిసెంబరులో ఐరోపా ఖండంలోనే ఎత్తెన మౌంట్‌ ఎల్‌బ్ర్‌సను అధిరోహించాను. నాకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న అన్వితా గ్రూప్‌కు నా కృతజ్ఞతలు’’ అని అన్విత పేర్కొన్నారు.