Movies

నటి పూర్ణ కాబోయే భర్త ఇతనే..

నటి పూర్ణ కాబోయే భర్త ఇతనే..

ప్రముఖ నటి పూర్ణ తన కాబోయే భర్తను పరిచయం చేసి సర్‌ప్రైజ్ చేసింది. ఇటీవల కాలంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు తారలు పెళ్ళి చేసుకొని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్ణ కూడా త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది. తెలుగులో పూర్ణ నటించిన మొదటి సినిమా శ్రీ మహాలక్ష్మి . నటుడు, దర్శకుడు రవిబాబు తెరకెక్కించిన అవును , అవును 2 , అలాగే అల్లరి నరేష్హీ రోగా నటించిన సీమ టపాకాయ్ చిత్రాలలో హీరోయిన్‌గా నటించి టాలీవుడ్‌లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే, హీరోయిన్‌గా పూర్ణ స్టార్ స్టేటస్‌ను దక్కించుకోలేపోయింది. దాంతో తనకి అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాలో మంచి పాత్ర పోషించింది. ప్రస్తుతం బుల్లితెరపై వస్తున్న పాపులర్ షోలతో బిజీగా ఉంది పూర్ణ. కాగా, త్వరలో ఆమె పెళ్లి చేసుకోనున్నట్టు సమాచారం. తాజాగా, జీవిత భాగస్వామిని పరిచయం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.ఇందులో తన కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను జతచేసింది. షానిద్ ఆసిఫ్ ఆలీ తో తనకు ఎంగేజ్ మెంట్ జరిగిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తున్నానని తెలియజేసింది. ఈ సందర్భంగా ఎంగేజ్ మెంట్ రింగ్ ఎమోజీని కూడా పోస్ట్ చేసింది పూర్ణ. కాగా, తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జె బి ఎస్ గ్రూప్ కంపెనీ ఫౌండర్ షనీద్ అసిఫ్ ఆలీని పెళ్లి చేసుకోబోతున్న పూర్ణకు సోషల్ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక తనది ప్రేమ వివాహమా.. లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది తెలియాల్సి ఉంది.
https://www.instagram.com/p/CeQBKYSDO1k/?utm_source=ig_embed&ig_rid=c46e5730-ff2c-4e3a-af93-01865c5bc070