NRI-NRT

6 నెలలు మించి స్వదేశంలో ఉంటే వీసా రద్దు

6 నెలలు మించి స్వదేశంలో ఉంటే వీసా రద్దు

గత కొన్ని నెలలుగా స్వదేశంలో ఉంటున్న ప్రవాసీయులందరూ తిరిగి జూన్‌లోగా కువైత్‌ రావాల్సి ఉంటుంది. రాని పక్షంలో వారి వీసా రద్దవుతుందని కువైత్‌ ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ నిబంధన కేవలం ఆర్టికల్‌ 20 వీసా ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. కువైత్‌, మిగిలిన అన్ని గల్ఫ్‌ దేశాల్లో నివాసముంటున్న విదేశీయులందరూ తాము పని చేస్తున్న దేశం బయట ఆరు నెలల కంటే మించి ఉండకూడదు. కానీ కరోనా ఆంక్షల నేపథ్యంలో కువైత్‌ ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఆర్టికల్‌ 20 వీసా వారు తిరిగి రావడానికి తగిన గడువు ఇచ్చింది. తమ ఉద్యోగుల పక్షాన గడువు పొడిగింపు చేసుకోవడానికి యాజమానులకు కూడా ఆవకాశం ఇచ్చింది. ఈ క్యాటగిరీ వీసా కలిగిన ప్రవాసాంధ్రులు అత్యధిక సంఖ్యలో కువైత్‌లో ఉన్నారు. ఇళ్లల్లో పని చేసే వృత్తుల వారికి ఆర్టికల్‌ 20 వీసా ఉంటుంది. ఇలాంటి వారు కువైత్‌లో ఆరు లక్షల మందికిపైగా విదేశీయులు పని చేస్తుండగా అందులో 3.25 లక్షల మంది భారతీయులే. అందునా అత్యధికులు ఏపీలోని అన్నమయ్య జిల్లాకు చెందిన వారు ఉన్నారు. కోనసీమ జిల్లా వారు కూడా గణనీయంగానే ఉన్నారు. కువైత్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వీరందరిపై ప్రభావం చూపనుంది.