Politics

ఆయన చరిత్ర తెలుసుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది – TNI రాజకీయ వార్తలు

ఆయన చరిత్ర తెలుసుకుంటేనే ఒళ్లు పులకరిస్తుంది – TNI రాజకీయ వార్తలు

* స్వాతంత్య్రం కోసం చాలామంది ఉద్యమాలు చేశారని, కానీ పోరాటం చేసి బలిదానమైన వాళ్లు కొంతమందని, వాళ్లలో సీతారామరాజు ఒకరని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఇవాళ జిల్లాలోని భీమవరంలోని జరిగిన మావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన పేరు వింటేనే, ఆయన చరిత్ర తెలుసుకుంటేనే మనకు ఒళ్లు పులకరిస్తుందన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి అనేది ఒక భీమవరంలోనే కాదని, అన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీలోని విజ్ఞాన‌భవన్‌లో జరపాలనేది తన ఆకాంక్ష అన్నారు. జూలై 4న ప్రత్యేక విమానంలో మోడీ విజయవాడ వచ్చి అక్కడి నుంచి డిఫెన్స్ హెలికాప్టర్‌లో భీమవరం వస్తారని తెలిపారు. విశాఖ జిల్లాలో అల్లూరి సీతారామరాజు పేరిట 35కోట్ల రూపాయలతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

*ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తా: YS Sharmila
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూనే.. అధికారంలోకి వస్తే తానేం చేస్తానో చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం మడుపల్లి గ్రామస్థులతో ఆమె మాట్లాడారు. ‘ఉద్యమ కారుడు కదా అని కేసీఆర్‌కు ముఖ్యమత్రి పీఠం అప్పజెపితే 8 ఏళ్లు ఆడింది ఆట .. పాడింది పాటగా పాలన సాగుతోంది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోంది. ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టాం. ఆశీర్వదించి గెలిపించండి.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తా. పోడు భూములకు పట్టాలు ఇస్తా. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం నిలబడతా. కేసీఆర్ చేతిలో ఈ సారి మళ్ళీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేస్తారు’’ అని షర్మిల పేర్కొన్నారు.

*ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుంది: దుట్టా రామచంద్రరావు
వచ్చే ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని వైసీపీ సీనియర్ నాయకుడు దుట్టా రామచంద్ర రావు తెలిపారు. తనకు ఎంపీ సీటు కావాలా? లేక ఎమ్మెల్యే సీటు కావాలా? అని జగన్ అడిగారని చెప్పారు. వంశీకి టిక్కెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించేది లేదని.. కానీ పార్టీలోనే ఉంటానని సీఎంకు తెలిపానని దుట్టా చెప్పారు. తాను ఇప్పటివరకూ చంద్రబాబు‌ను నేరుగా చూడలేదన్నారు. టీడీపీ వారితో తనకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు.

*మద్యంపై మాట తప్పినందుకు Jagan ఏం చెబుతారు?: Raghurama
ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలో ఏపీలో మద్యపానం నిషేధిస్తామని చెప్పారని.. ఇప్పుడు మద్యంపై మాట తప్పినందుకు ఏం చెబుతారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దశలవారీగా రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్నారు… ఇప్పుడు మద్యం బాండ్లతో సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. మద్య నిషేధం హామీని వైసీపీ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. మాట నిలబెట్టుకోకుంటే కాలర్ పట్టుకుని నిలదీయాలని ఆనాడు జగన్ అన్న వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు.

*జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపానాన్ని నిషేధించాలి: ఆచంట సునీత
జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని టీడీపీ మహిళా నేత ఆచంట సునీత డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన జగన్ మాట మార్చి మరీ మద్యాన్ని అమ్మిస్తున్నాడని ఆరోపించారు. మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయంతో పాలన సాగించే స్థితికి రాష్ట్రాన్ని తెచ్చారని విమర్శించారు. మహిళా పక్షపాతిని, మహిళా సంక్షేమమే తన ధ్యేయం అని చెబుతూనే.. మహిళల మాన ప్రాణాలతో ఆడుకోవడం దుర్మార్గమన్నారు.

*బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలి: కొనకళ్ల నారాయణరావు
మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఫైర్ అయ్యారు. పేర్ని నాని, తనకు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని బాలశౌరి ఆరోపించాడో సమాధానం చెప్పాలని కొనకళ్ల డిమాండ్ చేశారు. పేర్ని నాని తనకు ఓ రాజకీయ ప్రత్యర్థి అని, ఆయనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారని, నేనొక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నానన్నారు. నా గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై నిరాధార వ్యాఖ్యలు చేసిన బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

*వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయం:Etala
వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని బిజెపి సీనియర్ నాయకుడు , ఎమ్మెల్యే ఈటల రాజేందర్అ న్నారు.తెలంగాణ సంపదకు ప్రజలు యజమానులు కేసీఆర్ కాదని ఆయన స్పష్టం చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో రూ.600 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చు చేశారని ఈటల ప్రశ్నించారు.రాష్ట్రంలోని రైతులు, ప్రమాదంలో చనిపోయినవారిపై లేని ప్రేమపంజాబ్ రైతులపై ఎందుకు?అని అన్నారు.సీఎస్, కలెక్టర్లు మద్యంను ప్రమోషన్ చేసే పనిలో ఉన్నారు.కేసీఆర్‌కు పోయేకాలం వచ్చినందుకే పీకే అవసరం వచ్చిందని ఈటల వ్యాఖ్యానించారు.

*దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసింది: హర్షకుమార్
దళితులకు ఇచ్చే పథకాలను వైసీపీ రద్దు చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్ దుయ్యబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో దళితులు హత్యలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను ఏకతాటిపైకి తెచ్చి దళిత సింహగర్జన చేపడతామని ప్రకటించారు. సెప్టెంబర్‌లో భారీ ఎత్తున దళిత సింహగర్జన నిర్వహిస్తామని హర్షకుమార్ తెలిపారు.

*YCP సర్కార్ AP జెన్‌కోను ఆదానీ జెన్‌కోగా మార్చేస్తోంది: Pattabhiram
జెన్‌కోను ఆదానీ జెన్‌కోగా మార్చేందుకు YCP సర్కార్ శ్రీకారం చుట్టిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ థర్మల్ ప్రాజక్టులను పూర్తిగా నిర్వీర్యం చేసి నష్టాల ఊబిలోకి నెడుతోందని ఆరోపించారు. ఏప్రిల్‌లో 382 మిలియన్ యూనిట్లు కూడా విద్యుత్ సరఫరా చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ 18, కర్నాటక 18, కేరళ 12, తమిళనాడు 67, పాండిచ్చేరి 1 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత మాత్రమే ఉంటే.. ఏపీలో అది 382 మిలియన్ యూనిట్లకు చేరిందన్నారు. జగన్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌ల నుంచి గత మూడు నెలల కాలంలో అత్యధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేయడం వలన రూ.1037 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడుతోందన్నారు. ఈ భారం చార్జీల రూపంలో ప్రజలపై మోపుతూ వారి నడ్డి విరుస్తోందన్నారు. ఈ సందర్భంగా విద్యుత్ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదికను పట్టాభిరామ్ మీడియా సమావేశంలో బయటపెట్టారు.

*బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు.. మోసాలకు అడ్డూ అదుపూ లేదు: లోకేశ్‌
ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్న జగన్‌.. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ని సంపూర్ణ మద్యపానప్రదేశ్‌గా మార్చారని లోకేశ్‌ విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చారని మండిపడ్డారు. బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు, మోసాలకు అడ్డూ అదుపు లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అని.. ఎన్నికల తరువాత రాష్ట్రాన్ని సంపూర్ణ మద్యపానప్రదేశ్గా మార్చారని విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ, మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ.8300 కోట్ల అప్పు తెచ్చారని మండిపడ్డారు. జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

*సంపూర్ణంగా మద్యం మీదే ప్రభుత్వ ఆదాయం: పవన్ కల్యాణ్
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు.రాష్ట్రంలో మద్యం విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విమర్శనాస్త్రాలు సంధించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని.. చిన్న గమనిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.వీటి ద్వారా వచ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అని ఆరోపించారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు.

*సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే: Pawan
జనసేన అధినేత పవన్ కల్యాణ్ట్వి ట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తాం ‘కాదు కాదు’ సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తాం.. చిన్న గమనిక.. సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే. ఆ అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే.. సామెతలు 12:22 అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు’’ అంటూ పవన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

*నాడు జగనన్నకి మద్యం వద్దు.. నేడు మద్యమే ముద్దు: Lanka Dinakar
బీజేపీ నేత లంకా దినకర్ సీఎం జగన్‌ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘‘నాడు జగనన్నకి మద్యం వద్దు, నేడు మద్యమే ముద్దు.. నాడు జగనన్న ప్రజలకు మద్యం నిషేధం హమీ.., నేడు బాండ్ల ద్వార రూ. 8వేల కోట్ల రుణసేకరణ కోసం మద్యం నిషేదం లేదని హమీ… నాడు మద్యంతో ఆరోగ్యం గుల్లన్న జగన్.. నేడు అప్పుల కోసం తప్పదు మద్యం బుడ్డి అన్నట్టుంది జగన్ పాలన… నాడు మద్యం డీఏడిక్షన్ అవసరం అన్న జగన్, నేడు మద్యం ద్వారానే కలెక్షన్ అంటున్నారు.. నాడు ప్రతిపక్షనాయకుడిగా మద్యం సేవించడం తప్పన్న జగన్.. నేడు ఆదాయనికి మద్యమే ఒప్పు అంటున్నారని’’ లంక దినకర్ విమర్శించారు.

*సంపూర్ణ మద్యపాన ప్రదేశ్: Nara Lokesh
బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు.. మోసాలకు అడ్డూ అదుపూ లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్ పాదయాత్రలో ఏపీలో మద్యపానం నిషేధిస్తామని చెప్పారని.. అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ మద్యపాన ప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ, మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ. 8,300 కోట్ల అప్పు తెచ్చారని ఆరోపించారు. జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుందని లోకేష్ అన్నారు.

*వైసీపీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే పల్లా సవాల్
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు వస్తే తాము పార్టీ మూసుకుంటామని, లేకపోతే వైసీపీని మూసేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఎంతో మంది టీడీపీ నేతలు,కార్యకర్తలను పొట్టన పెట్టుకుని, పల్నాడుని వల్లకాడు చేశారని ఆరోపించారు. జగన్ సొంత బాబాయిని ఎవరు హత్య చేశారో అందరికి తెలుసన్నారు. వైసీపీ నేతల వేధింపులు కారణంగానే డ్రైవర్ సుబ్రహ్మణ్యం నుంచి డాక్టర్ సుధాకర్ వరకు ప్రాణాలు విడిచారని తెలిపారు.

*ఆ పథకాలకే పేరు మార్చి అమలు చేస్తున్నారు : ఫరూక్చం
ద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పథకాలకే పేరు మార్చి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఫరూక్ అన్నారు. నంద్యాలలో 17 మంది వైసీపీ మంత్రులు కార్యక్రమం ఏర్పాటు చేస్తే 200 మంది కూడా లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆళ్ళగడ్డలో టీడీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీమంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. తన తండ్రి భూమా నాగిరెడ్డి కార్యకర్తలకోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు నెరవేర్చడమే తన బాధ్యత అన్నారు. తన తమ్ముడు విఖ్యాత్‌ను ఎంపీగా గెలిపించడమే కాకుండా.. తాను నేను కూడ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చుంటానన్నారు.

*బీజేపీ నేతలంతా సత్యహరిశ్చంద్ర బంధువులా?: కేటీఆర్‌t
బీజేపీ, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. గత ఎనిమిదేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఎంతమంది బీజేపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు నిర్వహించారో తెలుపాలని మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీ నేతలంతా సత్యహరిశ్చంద్ర బంధువులా? అంటూ శనివారం ట్విటర్‌ ద్వారా ప్రశ్నించారు. ప్రతిపక్షాల నేతలను బెదిరించేందుకు కేంద్రం ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను వినియోగిస్తోందంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

*ప్రభుత్వాలు,మీడియా, శాస్త్రవేత్తలు, రైతుల పట్ల పక్షపాతం చూపాలి:ఉపరాష్ట్రపతి
ప్రభుత్వాలు, మీడియా, శాస్త్రవేత్తలు, ప్రజలు రైతుల పట్ల పక్షపాతం చూపాల్సిన అవసరం ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ చొరవ అత్యంత ఆవశ్యకమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. మట్టిసారాన్ని మనుగడకు ఉపయోగపడే ఆహారంగా మార్చే పవిత్ర యజ్ఞమే వ్యవసాయం అన్న ఆయన, ఈ విషయంలో దిగుబడి ఎంత ముఖ్యమో, ప్రకృతి పరిరక్షణ కూడా అంతే ముఖ్యమని తెలిపారు. స్వతహాగా రైతు బిడ్డ అయిన ఆయన, చిన్నతనం నుంచి తమ తాతగారు చేసే పర్యావరణ హిత వ్యవసాయాన్ని చూస్తూ పెరిగానని, ఆ తర్వాత వచ్చిన మార్పులు తనను కాస్తంత ఆందోళనకు గురి చేశాయని, ఇప్పుడు మళ్ళీ క్రమంగా పర్యావరణ హితమైన ప్రకృతి వ్యవసాయంవైపు రైతులు మళ్ళుతుండడం ఆనందదాయకమని తెలిపారు.

*అధికారంలోకి రాగానే..వరంగల్ డిక్లరేషన్ అమలు: సీతక్క
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కొండపాక మండలం మంగోల్ గ్రామంలో వరంగల్ డిక్లరేషన్‌పై రైతులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి అవగాహన కల్పించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, మౌలిక వసతులు సరిగా లేవన్నారు. ఎర్రవల్లి, ఫామ్ హౌస్ తప్ప ఎక్కడా అభివృద్ధి జరగలేదని.. అందుకు చుట్టుపక్కల గ్రామాలే సాక్ష్యమన్నారు. తెలంగాణ వస్తే యువతకు ఉపాధి, ఉద్యోగలు కల్పిస్తానన్నకేసీఆర్ వారి కుటుంబానికే మాత్రమే ఉద్యోగాలు కల్పించారని విమర్శించారు. యాసంగిలో రైతులకు వరి వేయొద్దని చెప్పిన కేసీఆర్ .. తాను మాత్రం ఫామ్ హౌస్‌లో వరి పండించారని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానన్న కేసీఆర్ ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు వరంగల్ డిక్లరేషన్ హామీలను నెరవేరుస్తామన్నారు.

*బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలి? : Mamata Banerjeet
పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శుక్రవారం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి మమత బెనర్జీ బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ చేసిన పాపానికి ప్రజలెందుకు బాధపడాలని ప్రశ్నించారు. హౌరాలో జరుగుతున్న సంఘటనల వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయన్నారు. అల్లర్లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బీజేపీ నుంచి సస్పెండయిన నూపుర్ శర్మ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మహమ్మద్ ప్రవక్త పై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమెను అరెస్టు చేయాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. హౌరాలో జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.

*దళిత బంధును సద్వినియోగం చేసుకోవాలి:Gangula kamalakar
అంబేద్కర్ కన్న కలలు దేశంలో ఎక్కడా లేకున్నా తెలంగాణ లో నెరవేరుతున్నాయని బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దళితులు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్ నియోజకవర్గంలో దళిత బంధులో భాగంగా తాహెర్ కొండాపూర్ గ్రామానికి కేటాయించిన యూనిట్లను ఎంపీడీవో కార్యాలయంలో శనివారం లబ్ధిదారులకు మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి ద్వారా మన పల్లెలను మన భావితరాలకు అందించడానికి తెచ్చిందే ఈ కార్యక్రమమని అన్నారు.

*రైతులను సీఎం ఆదుకోవాలి: నారా లోకేష్
అన్నదాతలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రైతులు క్రాప్‌హాలీడే విర‌మించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని కోరారు. సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో.. క్రాప్‌హాలీడే వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..‘‘క‌డ‌ప‌ జిల్లాలో నీరు పుష్కలంగా ఉన్నా గ‌తేడాది నుంచి రైతులు పంట విరామం కొనసాగిస్తున్నారు. గోదావ‌రి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరులో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పంట విరామం ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేసి నష్టపోయిన రైతులకు ప్ర‌భుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వక‌పోవ‌డం దారుణం. మా ప్ర‌భుత్వ హ‌యాంలో ధాన్యం బకాయిలు వారంలోనే చెల్లించగా, నేడు 3 నెలలు దాటినా బకాయిలు చెల్లించకపోవడం రైతు ద్రోహం కాదా? ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలి. క్రాప్ హాలీడే ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో మీరు నేరుగా ప‌ర్య‌టించి, ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంద‌నే భ‌రోసా నింపి రైతాంగాన్ని పంట‌లు వేసేలా ప్రోత్స‌హించాలి.

*రైతులను సీఎం ఆదుకోవాలి: నారా లోకేష్
అన్నదాతలను ఆదుకోవాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. రైతులు క్రాప్‌హాలీడే విర‌మించేలా చ‌ర్‌ీలు తీసుకోవాలని కోరారు. సరైన గిట్టుబాటు ధర లభించకపోవడంతో.. క్రాప్‌హాలీడే వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని లోకేష్ పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే..‘‘క‌డ‌ప‌ జిల్లాలో నీరు పుష్కలంగా ఉన్నా గ‌తేడాది నుంచి రైతులు పంట విరామం కొనసాగిస్తున్నారు. గోదావ‌రి జిల్లాలు, అనంతపురం, కర్నూలు, నెల్లూరులో పలు ప్రాంతాల్లో ఇప్పటికే పంట విరామం ప్రకటించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5 లక్షల ఎకరాల్లో మిర్చి వేసి నష్టపోయిన రైతులకు ప్ర‌భుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వక‌పోవ‌డం దారుణం. మా ప్ర‌భుత్వ హ‌యాంలో ధాన్యం బకాయిలు వారంలోనే చెల్లించగా, నేడు 3 నెలలు దాటినా బకాయిలు చెల్లించకపోవడం రైతు ద్రోహం కాదా? ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.7 లక్షలు ఇవ్వాలి. పంట నష్టపరిహారం చెల్లించాలి. పోలవరం పూర్తిచేసి నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్ర, రాయలసీమకు సాగునీరు, తాగునీరు అందించాలి. క్రాప్ హాలీడే ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో మీరు నేరుగా ప‌ర్య‌టించి, ప్ర‌భుత్వం అండ‌గా వుంటుంద‌నే భ‌రోసా నింపి రైతాంగాన్ని పంట‌లు వేసేలా ప్రోత్స‌హించాలి. మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాలతో 50 లక్షల ఎకరాలలో పంట నష్టం ఏర్పడితే ఒక్క రైతును కూడా ప్రభుత్వం పూర్తిగా ఆదుకోలేదు. పెట్రోల్‌, డీజిల్‌, వ్యవసాయం, యంత్ర పనిముట్లు ధరలు పెరిగిన స్థాయిలో వ‌రి మద్దతు ధర పెంచ‌క‌పోవ‌డంతో వ్య‌వ‌సాయం న‌ష్టాల‌మ‌యం అవుతోంది. ప్రభుత్వ చర్యలతో రైతు ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మూడోస్థానంలో ఉండగా, కౌలు రైతుల మరణాల్లో రెండో స్థానంలో నిల‌వ‌డం వ్య‌వ‌సాయ‌రంగ సంక్షోభాన్ని సూచిస్తోంది. ఇప్పటికి 3వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.’’ అని పేర్కొన్నారు.

*ఏపీ‌లో మద్యనిషేధం హుళక్కే..Nadendla Manohart
ఏపీలో మద్యనిషేధం ఉత్తి మాటేనని జనసేన పార్టీ ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మద్యనిషేధం పాక్షికంగా కూడా ఉండదని కార్పొరేషన్‌కు హామీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, వివిధ రకాల లిక్కర్‌ బ్రాండ్లను విడుదల చేసి రూ.8 వేల కోట్లను సేకరించిందని చెప్పారు. దీనికి ప్రతిఫలంగా ప్రభుత్వానికి మూడు నెలలకు ఓసారి వడ్డీ ఇస్తామని కార్పొరేషన్‌ పేర్కొంది. ఇది స్పిరిటెడ్‌ విజనరీ … జగన్‌ గారి మ్యానిఫెస్టో అని నాదెండ్ల మనోహర్‌ సెటైర్లు వేశారు.

*మంత్రి పదవి రాకున్నా పార్టీ మారను: ఎమ్మెల్యే శిల్పా
మంత్రి పదవి రానంత మాత్రాన ఏ పార్టీకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్పష్టం చేశారు. ‘నేను అలిగే వ్యక్తిని కాదు. పోరాడే వ్యక్తిని.. సీఎం జగన్మోహన్ రెడ్డిపై నాకు అపారమైన నమ్మకం ఉంది. వారితోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తాం. ప్రతిసారి పార్టీలు మారే ఆలోచన నాకు లేదు. మహానాడును అంతా బూచిగా చూపించారు.. త్వరలో నిర్వహించే వైసీపీ ప్లీనరీ చూస్తే టీడీపీ వాళ్లకు దిమ్మ తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధితో వచ్చే ఎన్నికలలో 175 సీట్లలో గెలుస్తాం.’ అని ఎమ్మెల్యే శిల్పా అన్నారు

*నాడు-నేడు పేరుతో YCP నేతల దోపిడీ: నక్కా ఆనంద్‌బాబు
నాడు-నేడు పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు వాస్తవాలు మాట్లాడడం చేతకాదన్నారు. చదువు లేని బేవర్స్‌ బ్యాచ్‌ని మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టారని తప్పుబట్టారు. విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఏపీలో అసలు సంక్షేమ పరిపాలనే లేదన్నారు. ఆకతాయితనంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆనంద్‌బాబు మండిపడ్డారు.

*వివేకా హత్య గురించి సీఎంకు తెలుసు: buddha venkanna
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్‌ హత్యపై జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. హత్య కేసు నిందితులంతా అనుమానాస్పదంగా చనిపోన్నారని తెలిపారు. గంగాధర్‌రెడ్డి మృతివెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని అడిగారు. గంగాధర్ రెడ్డి మరణంపై కూడా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ సునీతా రెడ్డి, అతని భర్తకు రక్షణ కల్పించాలన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సహనం పెరిగిపోతోందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు

*అభివృద్ధి చేతగానివాళ్లు మాకు అడ్డుతగులుతున్నారు: ధూళిపాళ్ల
అభివృద్ధి చేతగానివాళ్లు తమకు అడ్డుతగులుతున్నారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో డెయిరీ నిధులతో రోడ్డు వేస్తే శిలాఫలకం ధ్వంసంచేస్తారా? అని ప్రశ్నించారు. రూ.29.52 లక్షల సంగం డెయిరీ నిధులతో రోడ్డు నిర్మించామని, రహదారిని జీవీ అంజనేయులు ఈనెల 9న ప్రారంభించారని తెలిపారు. బాధ్యత లేనివాళ్లు శిలాఫలకం ధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధూళిపాళ్ల నరేంద్ర హెచ్చరించారు

*పంట విరామం జగన్ పాలనా పాపమే: Jawahar
ఏరువాక సమయంలో పంట విరామం జగన్ పాలనా పాపమే అని మాజీ మంత్రి జవహర్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ… ధాన్యం డబ్బులు నేటికి రైతు ఖాతాలోకి జమ కాలేదని తెలిపారు. వ్యవసాయ ప్రోత్సాహకాలు ప్రచారానికి పరిమితమయ్యాయన్నారు. పంట బోదెల పూడికకు చర్యలు శూన్యమని విరుచుకుపడ్డారు. నీటి తీరువా ప్రణాళిక విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుకు భరోసా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. పాడి పంటలు జగన్ పాలనలో కుధేలవుతున్నాయన్నారు. వ్యవసాయం అంటేనే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. పుండు మీద కారం లా మోటర్లకు మీటర్లు అని… ఏ ప్రయోజనాల కోసం మీటర్లు పెడుతున్నారో చెప్పాలని జవహర్ డిమాండ్ చేశారు.

*విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం: దేవతోటి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు విమర్శలు గుప్పించారు. ‘‘సూట్ కేస్ కంపెనీల సృష్టి కర్త, అవినీతి సొమ్ముకు గుత్తెదారు విజయసాయి రెడ్డి చర్చలకు పిలవడం హాస్యాస్పదం. విజయ సాయి రెడ్డి సవాల్ విసిరడ౦… పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉంటుంది. వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. ఎవరు ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు’’ అంటూ దేవతోటి నాగరాజు వ్యాఖ్యలు చేశారు

*ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌ని గ‌వ‌ర్న‌ర్ చేయాల్సిరావడం దుర‌దృష్ట‌కరం: Vijayashanti
ప్ర‌భుత్వం చేయాల్సిన ప‌ని గ‌వ‌ర్న‌ర్ చేయాల్సిరావడం నిజంగా దుర‌దృష్ట‌కరమని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. ఇటీవల గవర్నర్ తమిళిసై రాజ్భవన్లో మహిళా దర్బార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంపై విజయశాంతి తన ఫేస్ బుక్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు. ‘‘గవర్నర్ తమిళిసై నిర్వహించిన మహిళా దర్బార్‌కు భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 500 మందికిపైగా మహిళలు, వృద్ధులు, వివిధ ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ప్రతినిధులు వచ్చి వినతిపత్రాలు అందజేశారు. మహిళా దర్బార్ ఏర్పాటు చేయడంపై గవర్నర్‌కు నా ధన్యవాదాలు. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ మహిళలకు సోదరిగా సేవ చేస్తున్నారు. సమస్యలతో వచ్చిన మహిళలను స్టేజ్ మీదకు పిలిపించుకొని మాట్లాడారు. అండగా ఉంటానని భరోసా ఇవ్వడం అభినందనీయం. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వరకట్న వేధింపులు, టీఆర్ఎస్ నేతలు, ఇతరుల భూకబ్జాలు, 317 జీవో, ఉద్యోగుల బదిలీ వంటి పలు సమస్యలు గవర్నర్ దృష్టికి వచ్చాయి. పలు స్వచ్ఛంద సంస్థలు ఇచ్చిన విరాళాలు రూ.2 కోట్లు ఉన్నాయని, వాటి నుంచి ఆర్థిక సాయం చేస్తామని బాధితులకు గవర్నర్ భరోసా ఇవ్వడం హర్షనీయం.

*నాడు-నేడు పేరుతో YCP నేతల దోపిడీ: నక్కా ఆనంద్‌బాబు
నాడు-నేడు పేరుతో వైసీపీ నేతలు దోపిడీకి పాల్పడుతున్నారని టీడీపీ నేత నక్కా ఆనంద్‌బాబు ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలకు వాస్తవాలు మాట్లాడడం చేతకాదన్నారు. చదువు లేని బేవర్స్‌ బ్యాచ్‌ని మంత్రులు, ఎమ్మెల్యేలుగా పెట్టారని తప్పుబట్టారు. విద్యావ్యవస్థను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. ఏపీలో అసలు సంక్షేమ పరిపాలనే లేదన్నారు. ఆకతాయితనంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆనంద్‌బాబు మండిపడ్డారు.

*వివేకా హత్య గురించి సీఎంకు తెలుసు: buddha venkanna
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య గురించి సీఎం జగన్‌కు తెలుసని టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. బాబాయ్‌ హత్యపై జగన్‌ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నిందితులను ఎందుకు కాపాడుతున్నారని నిలదీశారు. హత్య కేసు నిందితులంతా అనుమానాస్పదంగా చనిపోన్నారని తెలిపారు. గంగాధర్‌రెడ్డి మృతివెనుక ఉన్న మిస్టరీ ఏంటి అని అడిగారు. గంగాధర్ రెడ్డి మరణంపై కూడా సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్ సునీతా రెడ్డి, అతని భర్తకు రక్షణ కల్పించాలన్నారు. జగన్‌ ప్రభుత్వంపై ప్రజల్లో సహనం పెరిగిపోతోందని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు.