Politics

రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారు – TNI రాజకీయ వార్తలు

రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారు – TNI రాజకీయ వార్తలు

* తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని.. తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అయ్యన్నది కబ్జా కాదన్న చంద్రబాబు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం 600 ఎకరాల ఎస్సీ భూములు చెరబట్టడం కబ్జా అని ధ్వజమెత్తారు. నిత్యం తెదేపా నేతల హౌస్ అరెస్టులు జగన్ పిరికితనాన్ని చాటుతున్నాయని దుయ్యబట్టారు.ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం అక్రమమని చంద్రబాబు మండిపడ్డారు. గట్టిగా గళం వినిపిస్తున్న తెదేపా బీసీ నేతలపై కేసులు, అరెస్టులు, ఇళ్లపై దాడులతో జగన్ వేధించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతి అధికారి మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రభుత్వ ప్రాపకం కోసం నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించి అధికారులు చిక్కుల్లో పడవద్దని చంద్రబాబు సూచించారు.

*వ్యక్తిత్వ వికాసం…సమాజ వికాసానికి చదువు దోహదం: Errabelli
చదువు వ్యక్తిత్వ వికాసానికి, సమాజ వికాసానికి దోహదం చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సామాజిక గౌరవాన్ని కలిగించే చదువు ఒక్కటే మనిషిని సమున్నతంగా తీర్చిదిద్దుతుందని కాబట్టిఅందరూ బాగా చదువుకోవాలని చెప్పారు.మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు లోని అంబేద్కర్ కాలనీ లో ఏర్పాటు చేసిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు అక్షరాలు దిద్దించారు.అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విద్ అభివృద్ధికి బాటలు వేస్తుందన్నారు. అన్నివర్గాలు బాగా అభివృద్ధిలోకి రావాలన్నారు.సీఎం కేసిఆర్ కూడా తెలంగాణలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.మన ఊరు మన బడి కింద 7,289 కోట్ల తో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు పెంచుతున్నామని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమం లోకి మారుస్తున్నామన్నారు.అనేక ఆశ్రమ పాఠశాలలు పెట్టీ ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు.ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామన్నారు.విదేశీ విద్య కోసం ప్రత్యేక పథకం పెట్టీ పేద విద్యార్థులను చదివిస్తున్నామని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ వాసులు, పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

*అమిత్‌షాను Etela కలవడంలో తప్పేముంది?: Bandi Sanjay
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలవడంలో తప్పేముందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. ఈటల-అమిత్‌షా భేటీపై అపార్థాలు సరికాదన్నారు. జాతీయ నేతలను కలిసే స్వేచ్ఛ పార్టీలో అందరికీ ఉందన్నారు. కేసీఆర్ పార్టీ మాదిరి కాదని.. బీజేపీ లో ఎవర్ని ఎవరైనా కలవొచ్చని బండి సంజయ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ అవినీతి పాలనను గద్దెదించడమే బీజేపీ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో దందాలన్నీ టీఆర్ఎస్(TRS) నేతలే చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌(KCR) సర్కార్‌ విఫలమైందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయన్నారు. తెలంగాణలో నియంతపాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం సాగిస్తోందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

*సికింద్రాబాద్ ఘటన.. అధికార పార్టీ డబ్బులిచ్చి చేయించిందే: Raghunandan rao
గత రెండు మూడు రోజులుగా భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ ప్రతిపక్షాలు, ఈ రాష్ట్ర పాలక పక్షం ప్రవర్తించిన తీరు బాధకారమని ఎమ్మెల్యే రఘనందన్ రావు అన్నారు. పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీజేపీ శక్తి కేంద్రాల ఇంచార్జీల, కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేల పర్యటనలలో ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్న పోలీసులు… రైల్వే స్టేషన్‌లో రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీ డబ్బులిచ్చి కావాలని చేయించిందే ఈ ఘటన అని ఆరోపించారు. ఈ దేశానికి సేవ చేయాలినుకునే అభ్యర్థులు ఇతరుల మాట విని తప్పుదోవ పట్టవద్దని సూచించారు. ఎంతోమంది మేధావుల ఆలోచనలు, సమీక్షల తరువాతే తీసుకొచ్చిన పథకం అగ్నిపథ్ అని చెప్పుకొచ్చారు. జులై 2,3 న హైదరాబాద్‌లో జరిగే ప్రధాని సభకు జిల్లాకు లక్షమంది చొప్పున తరలించడానికి జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు.

*ఆ ఘనత కేసీఆర్‌దే: మంత్రి హరీశ్‌రావు
సింగూర్ జలాలు మెదక్ జిల్లాకు ఇచ్చిన ఘనత సీఎం కేసిఆర్ దేనని మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రావడం వల్లనే మంజీరా జలాలు మెదక్‌కు వస్తున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరిని సింగూర్ ప్రాజెక్ట్‌కు అనుసంధానం చేయడం ద్వారా అందోల్ ప్రాంతం సస్యశ్యామలం చేస్తామన్నారు. మల్లన్న సాగర్ నుండి కాలువల ద్వారా గోదావరి జలాలు సింగూర్‌కు తరలిస్తున్నామని చెప్పారు. అందోల్ నియోజకవర్గంలోనే ఒక లక్ష 80 ఏకరాలకు సాగునీరు ఇవ్వబోతున్నామని తెలిపారు. ఈ ప్రాంతం మరో కోనసీమ కాబోతుందన్నారు. డబుల్ ఇంజిన్ రాష్ట్రలలో కరెంట్ కూడా లేదన్నారు. కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. అగ్నిపథ్ పెట్టి సైనికులను అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం పోరాడే సైనికుల పట్ల కిషన్‌రెడ్డి మాట్లాడుతున్న తీరు సరిగా లేదన్నారు. ఆర్మీలో కుడా కాంట్రాక్ట్ పద్దతి తెచ్చి దేశాన్ని ప్రమాదంలో పడేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దీతో దేశాన్ని ఏమి ఉద్దరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కాళేశ్వరంకు జాతీయ హోదా బీజేపీ ఇవ్వలేదన్నారు.

*ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడతారా..?: Bonda Uma
బీసీ(BC)లపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ(TDP) ఆందోళన నిర్వహించింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ.. ఇక మున్ముందు ప్రభుత్వ వైఫల్యాన్ని మరింత గట్టిగా ప్రశ్నిస్తామన్నారు. టీడీపీకి బ్యాక్ బోన్‌గా ఉన్న బీసీ నేతలను చిత్రహింసలకు గురి చేస్తున్నారన్నారు. అయ్యన్న ఇంటిని అర్ధరాత్రి కూల్చడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడతారా..? అని నిలదీశారు. గడపగడపకూ వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు ఛీ కొడుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిపాజిట్‌కే వైసీపీ పరిమితమవుతుందని బోండా ఉమ జోస్యం చెప్పారు.

*జగన్‌ రెడ్డి…ఇకనైనా కక్ష సాధింపులు మాని…: Devathoti
వైసీపీ ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తున్నందుకే టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి పై కక్ష సాధింపులు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ… అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షనేతల ఇళ్ల గోడలు కూల్చుతున్న అరాచక ప్రభుత్వం ప్రజల చేతిలో కూలిపోక తప్పదని హెచ్చరించారు. జగన్ రెడ్డి బెదిరింపులకు భయపడేవారెవరూ టీడీపీ లేరన్నారు. ‘‘జగన్ రెడ్డి.. ఇకనైనా కక్ష సాధింపులు మాని రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టండి’’ అంటూ దేవతోటి నాగరాజు హితవుపలికారు.

*అర్ధరాత్రి కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు Jagan సమాధానమేంటి?: Chandrababu
అర్ధరాత్రి కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్స మాధానమేంటని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించక తప్పదన్నారు. అయ్యన్న కాదు.. ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా అని పేర్కొన్నారు. చలో నర్సీపట్నం కార్యక్రమానికి వెళ్తున్న నేతలను అరెస్ట్ చేయడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ బీసీ నేతల అరెస్టులు జగన్ వేధింపుల ప్రయత్నం కాదా? అని ప్రశ్నించారు. జగన్ కక్ష సాధింపు కోసం కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తారా? అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

*నా భర్త Ayyanna తప్పుగా ఏం మాట్లాడలేదు: Padmavati
ప్రభుత్వం కక్షసాధింపులను ఖండిస్తున్నామని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతి అన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన భర్త అయ్యన్న తప్పుగా ఏం మాట్లాడలేదని, మంత్రి రోజా వ్యాఖ్యలకు కౌంటర్ మాత్రమే ఇచ్చారన్నారు. నోటీసులు కూడా ఇవ్వకుండా గోడ కూల్చారని, ఈ ఘటనకు పాల్పడిన అధికారులను కోర్టుకు ఈడుస్తామని ఆమె స్పష్టం చేశారు. అధికారులంటే గౌరవం ఉండాలి.. భయం కాదన్నారు. ఇలాంటి ఘటనలతో ప్రజలకు ఏం భరోసా ఇస్తున్నారని పద్మావతి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

*‘అగ్నిపథ్’ మంటలు చల్లారలేదు: VH
‘‘అగ్నిపథ్’’ మంటలు చల్లారలేదని.. దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని మాజీ పీసీసీ అధ్యక్షులు వి.హనుమంత రావు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ…ఆర్మీ అధికారులు మాటలు అగ్నికి ఆజ్యం పోసినట్లుందని మండిపడ్డారు. పార్లమెంట్‌లో చర్చలు ఉండవని.. ప్రతిపక్షంతో చర్చలు లేవని అన్నారు. ప్రధాని మోదీ(Modi).. కార్పొరేట్ కంపెనీల చేతిలో బందీ అయ్యారని ఆరోపించారు. నరేంద్రమోదీ.. ఇకనైనా మన్మోహన్ సింగ్ పాలనను గుర్తు చేసుకోవాలని హితవుపలికారు. ఆఖరికి సైన్యాన్ని కూడా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సేవ చేసే వారి విషయంలో అవమానకరంగా వ్యవహరిస్తోందన్నారు. సైనికుల పట్ల అవమానకరంగా మాట్లాడిన బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్ వర్గిపై చర్యలు తీసుకోవాలని వీహెచ్ డిమాండ్ చేశారు.

*ధూళిపాళ్ల అరెస్ట్ అప్రజాస్వామికం: Lokesh
దోపిడీని ప్రశ్నించిన టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అప్రజాస్వామికమని మాజీమంత్రి లోకేశ్‌ తప్పుబట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ధూళిపాళ్లపై దాడి, అరెస్ట్‌ల వెనక మట్టి మాఫియా ఉందని ఆరోపించారు. వైసీపీ ఒక్క చాన్సే చివరిదని ఆ పార్టీ నేతలకు అర్థమైందన్నారు. అందుకే అన్ని విధాలా దోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని దోచుకోవడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో మట్టి, గ్రావెల్ మాఫియాకు వైసీపీ అండదండలున్నాయని లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లా అనుమర్లపూడిలో ధూళిపాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అక్రమ మైనింగ్‌ను నిరసిస్తూ ‘చలో అనుమర్లపూడి’కి టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ చలో అనుమర్లపూడికి టీడీపీ నేతలను పోలీసులు అనుమతిలేదని అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది.

*అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందే: మంత్రి Indrakaran reddy
అగ్నిపథ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందేనని అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి డిమాండ్ చేశారు.ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అగ్నిపధ్ పై ఆయన స్పందించారు. అన్ని రంగాల్లోను దేశాన్ని అథోగతి పాలుచేసిన ప్రభుత్వం ఇప్పుడు అగ్నిపత్ప్ర కటించిందన్నారు.ఈ పథకానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యువకులు కధం తొక్కారని, ఇది మరింత పెద్దదిగా కాకముందే మోదీ మేలుకుంటే మంచిదని హితవు పలికారు. ప్రధాని మోదీ ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాలను వీడనాడాలన్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరనడానికి రైతు ఉద్యమాలు, ఇలా అగ్నిపత్ పథక వ్యతిరేఖ పోరాటాలే నిదర్శనమన్నారు.

*పులివెందుల పిల్లి భయపడింది: లోకేశ్‌
నర్సీపట్నం పులిని చూసి, పులివెందుల పిల్లి భయపడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశా రు. నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్‌ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూ ల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్లు కనిపిస్తోందని ఆదివారం ట్వీట్‌ చేశారు.

*మతాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు: ఓం బిర్లా
మతం విషయంలో ప్రజల విశ్వాసాలను రెచ్చగొట్టే రీతిలో పార్లమెంట్‌ సభ్యులు వ్యాఖ్యలు చేయకూడదని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు. ప్రజలు తమకు ఇష్టం ఉన్న మతాన్ని ఆచరించే హక్కును రాజ్యాంగం కల్పించిందన్నారు. ఈ విషయంలో సభ్యులందరూ శ్రద్ధతో పార్లమెంటరీ వ్యవస్థ ఆచార, సాంప్రదాయాలను పాటించాల్సి ఉందని తెలిపారు. లోక్‌సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లన సందర్భంగా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓం బిర్లా ఈ విషయాలు చెప్పారు.

*ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రలోనూ కార్గో : పువ్వాడ
టీఎ్‌సఆర్టీసీ కార్గో సేవలను ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలోని నగరాలకూ విస్తరించినట్టు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు. అసలే ఇబ్బందుల్లో ఉన్న ఆర్టీసీకి కరోనా ఉధృతి మరింత నష్టం కలిగించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పార్సిల్‌, కొరియర్‌, కార్గో సేవలను 2020 జూన్‌ 19న ప్రారంభించినట్టు గుర్తు చేశారు. కార్గో, పార్సిల్‌ సేవలు అద్భుతంగా కొనసాగుతున్నాయని, రూ.120.52 కోట్ల ఆదాయం ఆర్జించిందన్నారు.

*దేశం మొత్తం వ్యతిరేకత ఉంది: Sridhar Babu
అగ్నిపథ్‌ పై దేశం మొత్తం వ్యతిరేకత ఉందని, ఆర్మీ (Army)ని రక్షించుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సేవ్ ఆర్మీ పేరుతో ముందుకు పోవాలన్నారు. ఆర్మీలోకి వెళ్ళాలనుకునే యువతకు గత రెండు సంవత్సరాలుగా నిరాశే మిగిలిందన్నారు. ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ సోల్జర్‌ను తయారు చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. అగ్నిపథ్‌లో 75 శాతం మందిని ఇంటికి పంపిస్తే.. వాళ్లు ఏం చేయాలని ప్రశ్నించారు. అగ్నిపథ్‌ను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్మీ ద్వారా ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అగ్నిపథ్ స్కీం తీసుకొచ్చారని, సైనికులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో భారత ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సోల్జర్ విధానం వల్ల దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని శ్రీధర్ బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.

*బీసీలను అణచివేయడమే జగన్‌ లక్ష్యం: టీడీపీ
రాష్ట్రంలో బీసీలను అణచివేయడమే ధ్యేయంగా జగన్‌రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అయ్యన్న ఇంటిని జగన్‌రెడ్డి కూల్చడం చట్టవ్యతిరేకమని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. అయ్యన్న ఇల్లు ధ్వంసం చేయడం వైసీపీ అరాచకాలకు పరాకాష్ఠ అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేర్కొన్నారు. బలమైన బీసీ గొంతుక అయ్యన్నపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. శని, ఆదివారాలను బుల్‌డోజర్స్‌ దినంగా ప్రకటించాలని మాజీ మంత్రి జవహర్‌ వ్యంగంగా అన్నారు. దొంగోడు పాలకుడైతే యంత్రాంగమంతా దొడ్డిదారిన వస్తుందనటానికి అయ్యన్న ఇంటిపై అధికారుల దాడి మరో నిదర్శనమని మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

*జగన్‌రెడ్డికి కౌంట్‌డౌన్‌ మొదలైంది: బుద్దా వెంకన్న
‘‘చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారని స్పష్టమయింది. వైసీపీకి ఓట్లేయరనే ఉద్దేశంతో కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేసిన సీఎం జగన్‌.. ఇప్పుడు బీసీ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారు’’ అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగన్‌రెడ్డికి కౌంట్‌డౌన్‌ మొదలైందని, వైసీపీ నేతలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేస్తామని వెంకన్న హెచ్చరించారు.

*అయ్యన్న కుటుంబం ఆక్రమణలు చేస్తుందా?: పట్టాభి
‘‘నర్సీపట్నం ప్రాంతంలో భూములు దానం చేసిన చరిత్ర ఉన్న అయ్యన్న పాత్రు డు కుటుంబానికి ప్రభుత్వ భూమిని ఆక్రమించాల్సిన ఖర్మ ఏమిటి? కబ్జాల చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన జగన్‌రెడ్డి అందరిపై అదే బురద చల్లాలని చూస్తున్నారు’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. ‘‘అయ్యన్న తాత లచ్చాపాత్రుడు స్వాతంత్య్ర సమర యోధుడు. 1957లోనే ఆయన ఎమ్మెల్యేగా చేశారు. నర్సీపట్నం దగ్గరలో అయ్యన్నపాలెం అనే ఒక ఊరే ఆ కుటుంబం పేరుతో ఉంది. ఆ ఊరికి భూములు దానం చేసింది కూడా ఈ కుటుంబమే. ఆయన ఏం తప్పు చేశారని ఇంటిపైకి పోలీసులు, జేసీబీలు పంపారు?’’ అని ప్రశ్నించారు.

*అక్కసుతోనే అయ్యన్నపై చీకటి దాడి: బాబు
జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటిపై వైసీపీ ప్రభుత్వం చీకటి దాడులకు దిగిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. నర్సీపట్నం ఘటనపై ఆయన ఆదివారం ట్విటర్‌లో స్పందించారు. ‘‘అయ్యన్న ఇంటి గోడను అర్ధరాత్రి జేసీబీలతో కూలగొట్టడం ముమ్మాటికీ వైసీపీ కక్ష సాధింపే. టీడీపీలో బలమైన బీసీ నేతలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు, అరెస్టులు, దాడులకు జగన్‌రెడ్డి పాల్పడుతున్నారు. అయ్యన్న వెంట మొత్తం టీడీపీ ఉంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

*ఉచిత విద్యుత్తు రద్దుపై ఆందోళన: సీపీఎం బాబూరావు
దళిత, గిరిజన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ఇచ్చే ఉచిత విద్యుత్తుకు వైసీపీ ప్రభుత్వం ఎసరు పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌.బాబూరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో ఐదు లక్షల గిరిజన దళిత కుటుంబాలు ఉచిత విద్యుత్తు పథకానికి దూరమయ్యాయన్నారు. దీనివల్ల ఈ కుటుంబాలపై ఏటా రూ.600 కోట్ల భారం పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*అయ్యన్న పాత్రుడుపై మండిపడ్డ జోగి రమేష్
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. మాజీ మంత్రి ఐతే ప్రభుత్వ భూముల్లో అక్రమణలు చేయొచ్చా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. బీసీలు అయితే ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణలు చేయొచ్చా? అని ఆయన ప్రశ్నించారు. స్థిరత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతు సంక్షేమం ప్రభుత్వమన్నారు. కౌలు రైతులను గుర్తించిన ప్రభుత్వం సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వమన్నారు. జనసేన అధినేత ప్రస్తుతం నడి రోడ్డుపై ఉన్నారని విమర్శించారు. రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్
అన్నారు. జర్నలిస్టులకు త్వరలోనే ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

*జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన నక్కా ఆనంద్ బాబు
రాష్ట్రంలో రైతులు దుర్భర పరిస్థితులకు నిదర్శనం రైతులు క్రాప్ హాలిడే ప్రకటించటమేమొన్న కోనసీమ అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. నిన్న గోవాడ, నేడు పాంచాళవరం, ఇంకా ఎన్ని గ్రామాల్లో క్రాప్ హాలిడే ప్రకటిస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకింటించుకునే దుర్బరపరిస్థితులు వచ్చాయంటే ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు మేలు జరిగితే క్రాప్ హాలిడే ప్రకటిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. పెట్టుబడులు పెరిగి దిగుబడులు రాక, గిట్టుబాటు ధరలు లేక రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని చెప్పారు. ఎరువులు,పురుగు మందులు రైతులకు అందకుండా బ్లాక్ మార్కెట్ నడిపిన ఘనత జగన్ ప్రభుత్వందేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో వైసీపీ వాళ్లు దళారుల అవతారం ఎత్తి రైతులను దోచుకున్నారని మండిపడ్డారు. గతంలో పట్టుసీమ నుంచి వచ్చిన నీటి వల్ల డెల్టా ప్రాంతాల్లో అధిక దిగుబడులు వచ్చాయన్నారు. పట్టుసీమ చంద్రబాబు తెచ్చింది కాబట్టి డెల్టాకు నీళ్లు ఇవ్వకూడదని ఆపిన దుర్మార్గపు ప్రభుత్వమన్నారు. మోసపురితమైన విధానాలతో వాగ్దానాలతో రైతులను మభ్యపెడుతు నిలువెల్లా మోసపు చర్యల వల్లే రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

*జగన్ సీబీఐ కేసులపై బాపట్ల జిల్లా పర్యటనలో పవన్‌ కీలక వ్యాఖ్యలుt
‘‘నేను ప్రజలకు దత్తపుత్రుడిని. సీఎం జగన్ మాత్రం కచ్చితంగా సీబీఐ కి దత్తపుత్రుడే. భవిష్యత్లో జగన్ సీబీఐ కేసులు ఎదుర్కోక తప్పదు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జోస్యం చెప్పారు. బాపట్ల జిల్లా పర్చూరులో పవన్ పర్యటించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పరామర్శించారు. పర్చూరు బహిరంగ సభలో బాధితులకు ఆర్థికసాయం చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన 80 రైతు కుటుంబాలకు సాయం అందించారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఏ ప్రభుత్వం కూడా కౌలురైతులను గుర్తించడం లేదని, కౌలు రైతులకు ఎటువంటి గుర్తింపు పత్రాలు ఉండవని, సీఎం జగన్కు తప్ప అందరికీ ఈ విషయం తెలుసని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మరచిపోవడమే వైసీపీ లక్షణమని తప్పుబట్టారు. ఉత్తర ప్రగల్భాలు పలకడమే వైసీపీ నైజంగా మారిందని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు

*వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది: బీజేపీ నేత
నెల్లూరు జిల్లాలో రాష్ట్ర మంత్రులు ఉండి కూడా ఏ మాత్రం అభివృద్ధి నోచుకోలేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ ప్రాంతానికి ఏమి అభి వృద్ధి చేయలేదన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి భయంతో వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రితో ప్రచారం చేయిస్తున్నారని చెప్పారు. మరో వైపు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి రైతులు చాలా కష్టాలు పడుతున్నారని చెప్పారు. ఇసుక మాఫియా..లిక్కర్మా ఫియా.. మైనింగ్ మాఫియా, రివర్స్ టెండరింగ్ మాఫియా.. వైసిపి ప్రభుత్వమే ఓ మాఫియా అన్నారు. మద్యం షాపుల్లో నగదు లావా దేవీలు ఉంటే గోల్‌మాల్ చేయొచ్చని ఆన్ లైన్‌లో పేమెంట్లు అందుబాటులో ఉంచలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లా అండ్ ఆర్డర్ లేదన్నారు. అలాగే ప్రజలకు రక్షణ లేదని పేర్కొన్నారు.