DailyDose

అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలి – TNI తాజా వార్తలు

అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలి  –  TNI  తాజా వార్తలు

*అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించాలని సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. పేదలు, కార్మికుల ఆకలి తీర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చాయి.‘‘మీరు అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే పేద‌ల‌పై కోప‌మో..అన్న‌గారి పేరుమీద ద్వేష‌మో..ఆక‌లి జీవులంటే అస‌హ్య‌మో తెలియ‌దు కానీ అన్న క్యాంటీన్లను మూసేశారు. రాష్ట్రంలో4.31 కోట్ల మంది పేదల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లకి రంగులు మార్చి తాళాలు వేయ‌డంతో పేద‌లు, కూలీలు, అభాగ్యులు ఆక‌లితో అలమటిస్తున్నారు. పట్టణాలకు ప‌నుల మీద వ‌చ్చేవారంద‌రికీ రూ.5కే చక్కని భోజనం, అల్పాహారం అందించాలని .. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రుచిగా..శుచిగా ఆహారం అందించే బాధ్య‌త‌ను హరేకృష్ణా అనే సేవా సంస్థకు అప్ప‌గించిన విష‌యం మీకు తెలిసిందే. అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించాం. మీరు అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ల బిల్లులు ఆపేశారు. అన్న క్యాంటీన్ల‌ను మూసేసే కుట్ర జ‌రుగుతోంద‌ని మేము అడిగితే, లేద‌ని స‌మాధానం ఇచ్చిన మీ ప్ర‌భుత్వం.. ఆ త‌రువాతి రోజే వాటిని మూసేసింది. దీంతో నిరుప‌యోగంగా ఉన్న అన్న క్యాంటీన్లు అసాంఘిక కార్య‌కలాపాల‌కు అడ్డాగా మారాయి. మ‌రికొన్నింటిని వార్డు స‌చివాల‌యాలుగా వాడుతున్నారు. కొన్నింటిని జేసీబీల‌తో కూల‌గొట్టారు. మీ రివర్స్ పరిపాలన కారణంగా గతంలో ఉన్న అన్న క్యాంటీన్ల సంఖ్య రెండింతలు పెంచాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది.’’ అని నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.

*కటారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణలో పోలీసులు జాప్యం చేస్తున్నారని.. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. హత్యకేసులో కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించి.. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారని.. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

*ధూళిపాళ్ల వీరయ్యచౌదరి మెమోరియల్ ట్రస్టుకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ట్రస్టు ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో సమాధానం చెప్పాలంటూ దేవదాయ శాఖ నోటీసులిచ్చింది. ట్రస్టు వ్యవహారంపై ఇప్పటికే న్యాయస్థానంలో కేసు కొనసాగుతోంది. ఎలాంటి తదుపరి చర్యలూ వద్దంటూ కోర్టు గతంలో ప్రభుత్వానికి స్పష్టం చేసింది. న్యాయస్థానంలో ఈనెల 29న కేసు విచారణకు రావాల్సి ఉంది. ఈలోగా మరోసారి సెక్షన్ 43 కింద దేవదాయశాఖ నోటీసులు జారీచేసింది. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడమంటే.. న్యాయ ఉల్లంఘనే అని తెలుగుదేశం వర్గాలు ఆరోపించాయి. ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేతలు మండిపడుతున్నారు. మే 30వ తేదీ తారీఖుతో రూపొందించిన ఈ నోటీసులు ట్రస్టుకు ఆలస్యంగా అందాయి.

*అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీ కేంద్రంలో శుక్రవారం “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పంచాయతీ పరిధిలోని గిరిజనులు సమస్యలు ఏకరువుపెట్టారు. తమ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని.. రహదారులు, మంచినీటి, మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకునే కనీస మట్టం స్థాయి(ఎండీడీఎల్‌)పై రెండు తెలుగు రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. ఎండీడీఎల్ ట్రైబ్యునల్ అవార్డు మేరకే కొనసాగించాలని తెలంగాణ కోరుతుంటే.. 854 అడుగుల స్థాయి ఉండేలా చూడాలని ఏపీ ప్రతిపాదించింది. చెన్నై తాగునీటి సరఫరా కమిటీ సమావేశంలో ఈ చర్చ జరిగింది.

*తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతి ఏటా ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ టీచర్లు స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా అనుమతి తప్పసరి చేస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలిచ్చింది.

*విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మ ఆలయంలో చీరల మాయం విషయంలో రికార్డు అసిస్టెంట్‌ సుబ్రహ్మణ్యం సస్పెన్షన్‌కు గురయ్యారు. చీరల ఇండెంట్లు సమర్పించలేదని ఆలయ ఈవో భ్రమరాంబ అతడిని సస్పెండ్ చేశారు. 2019-20లో భక్తులు సమర్పించిన 77 చీరలు మాయమైనట్లు గుర్తించిన అధికారులు విచారణ జరిపారు.చీరల విలువ రూ. 7లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా సుబ్రహ్మణ్యం గతంలోనూ చీరల మాయం విషయంలో ఆరు నెలల పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. తాజా చీరల గల్లంతులోనూ నిర్లక్ష్యం వహించినందుకుగాను మరోసారి అతడిపై ఆరునెలల పాటు వేటు వేశారు.

*ప‌ద్మా న‌ది(గంగా న‌ది)పై నిర్మించిన ప‌ద్మా బ్రిడ్జ్‌ను ఇవాళ బంగ్లాదేశ్ ప్ర‌ధాని షేక్ హసీనా ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ పొడువు 6.15 కిలోమీట‌ర్లు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వ‌ల్ల ఢాకా, మోంగ్లా సీపోర్ట్ మ‌ధ్య దూరం త‌గ్గ‌నున్న‌ది. ఇది రెండు అంత‌స్తులు బ్రిడ్జ్‌. దీంతో రోడ్డుతో పాటు రైలు మార్గం కూడా ఉంది. బ్రిడ్జ్ పూర్తి కావ‌డం అంటే 17 కోట్ల మంది బంగ్లాదేశ్ ప్ర‌జ‌లు క‌ల నిజ‌మైన‌ట్లు అని ప్ర‌భుత్వ అధికారి తెలిపారు. ప‌ద్మా బ్రిడ్జ్‌ను పూర్తి చేయ‌డానికి 25 ఏళ్లు ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. 1997లో తొలిసారి ప‌ద్మా బ్రిడ్జ్ నిర్మాణంపై ప్ర‌ధాని హ‌సీనా ప్ర‌తిపాద‌న చేశారు. చైనా మేజ‌ర్ బ్రిడ్జ్ ఇంజ‌నీరింగ్ కంపెనీ ఈ బ్రిడ్జ్‌ను నిర్మించింది.

*ఏపీలోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఉప ఎన్నికల కౌంటింగ్‌కు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 24న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. మొత్తం 178 పోలింగ్‌ బూత్‌ ల పరిధిలో 2,13, 644 మంది ఓటర్లు ఉండగా 1,37,038 (64.17 శాతం ) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.నియోజకవర్గంలోని ఆరు మండలాల పరిధిలో పోలింగ్‌ జరగగా చేజర్ల మండలంలో అత్యధికంగా 67.9 శాతం , అత్యల్పంగా మర్రిపాడులో 59.8 శాతం నమోదైంది. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 82.49 శాతం ఓట్లు పోలవగా ఈ ఎన్నికల్లో 64.17 శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులకు, సిబ్బందికి ఒకరోజు ముందుగానే శిక్షణ ఇచ్చి ఎన్నికల నిబంధనలను వివరించారు. ఉదయం 7 గంటలలోగా కౌంటింగ్‌ కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

*బీసీ గురుకులాలు, హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ పాఠాలు బోధించనున్నారు.
బీసీ సంక్షేమ శాఖ, ఉస్మానియా యునివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో.. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను శనివారం కలిసి తమ ప్రతిపాదన తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి బీసీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

*మహారాష్ట్రలో పొలిటికల్‌ హైడ్రామా కొనసాగుతున్నది. సంక్షోభం నేపథ్యంలో శివసేన జాతీయ కార్యవర్గం సమావేశమైంది. సమావేశంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే హాజరయ్యారు. అయితే, అంతకు ముందు పుణేలోని ఏక్‌నాథ్‌ షిండే వర్గం ఎమ్మెల్యే తానాజీ సావంత్ ఇల్లు, కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలో 144 సెక్షన్ విధించారు. అలాగే ఏక్‌నాథ్ షిండే థానే నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

*ఈ విద్యాసంవత్సరా(2022-23)నికి ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన కొత్త పాఠ్యపుస్తకాలు ఈ నెల 27 నుంచి రాష్ట్ర ంలో డీఈఓ గుర్తించిన అన్ని బుక్‌ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పాత పాఠ్యపుస్తకాలే వాడుకున్నారని, ఈ విద్యాసంవత్సరం మార్పులు, చేర్పులతో కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రించినట్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రాపకులు, ప్రచురణకర్తల ప్రతినిధి కె.బాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం అన్ని సబ్జెక్టులు, అన్ని చాప్టర్లలో ఈ విద్యాసంవత్సరం ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించినట్లు పేర్కొన్నారు. క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా ఆయా పాఠ్యాంశాలను ఆడియో, వీడియో రూపంలో వినడానికి, చూడటానికి అవకాశం ఉండేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ రూపొందించింది.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 71,589 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి 41,240 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.30 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

*తెలంగాణ బిసి గురుకులాల్లో,హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ చదువులు రానున్నాయి.బిసి సంక్షేమ శాఖ , ఉస్మానియా యునివర్సిటీ(ou), హార్వర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను శనివారం కలిసి తమ ప్రతిపాదన తెలియజేశారు.వచ్చే ఏడాది జనవరి నుంచి బిసి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా బుర్రా వెంకటేశంకి వారు తెలిపారు.

* సివిల్ కేసులు,చిన్నచిన్నవివాదాలకు సంబంధించిన కేసులను వెంటనే సెటిల్ చేసేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈనెల 26న ‘నేషనల్ లోక్ అదాలత్’ ఏర్పాటుచేస్తున్నట్టు మెంబర్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలోని అన్ని స్ధాయిల్లో హైకోర్టు నుంచి తాలుకా స్ధాయిలోని కేసులన్నింటినీ ఈ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నారు. అలాగే క్రిమినల్ కేసులను చీఫ్ జస్టిస్, ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ల మార్గదర్శకంలో ఈ అదాలత్ నిర్శహిస్తున్నారు.
*సివిల్ కేసులు,చిన్నచిన్నవివాదాలకు సంబంధించిన కేసులను వెంటనే సెటిల్ చేసేందుకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో తెలంగాణలో ఈనెల 26న ‘నేషనల్ లోక్ అదాలత్’ ఏర్పాటుచేస్తున్నట్టు మెంబర్ సెక్రటరీ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలోని అన్ని స్ధాయిల్లో హైకోర్టు నుంచి తాలుకా స్ధాయిలోని కేసులన్నింటినీ ఈ అదాలత్ ద్వారా పరిష్కరించనున్నారు. అలాగే క్రిమినల్ కేసులను చీఫ్ జస్టిస్, ప్యాట్రన్ ఇన్ చీఫ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ల మార్గదర్శకంలో ఈ అదాలత్ నిర్శహిస్తున్నారు.

*జూన్ 25న బ్లాక్ డే అని.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన దుర్దినమని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. నేడు తమ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. నిర్బంధాల మధ్య దిన పత్రికలు నడిపిన చీకటి రోజుల ని.. 21 నెలల ఎమర్జెన్సీని పారద్రోలి మళ్ళీ ప్రజాస్వామ్యా న్ని పునరుద్ధరించామన్నారు. నాటి నిర్బంధం ఎలా ఉందో ఈ రోజు తెలంగాణ లో అదే పరిస్థితి ఉందన్నారు. ఒక గిరిజనురాలిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినా ఇప్పటివరకూ కేసీఆర్ నోరు మెదపలేదన్నారు. నాడు ఇందిరాగాంధీ ఎలాగైతే ప్రజామ్యం గొంతు నులిమి, నియంత పాలన సాగించాలని కోరుకుందో.. నేడు రాష్ట్రంలో అదే పరిస్థితి ఉందన్నారు. తెలంగాణలో నేడు నిర్బంధాలు, ఒత్తిళ్లు, పోలీస్ పాలన తప్ప మరేమీ లేదన్నారు. తెలంగాణోద్యమంలో ప్రాణ త్యాగాలు చేసిన వారికి, పోరాటాలు చేసిన వారికి ఎలాంటి గుర్తింపు లేదన్నారు. తమ కుటుంబ పాలన సాగించాలనే దుర్మార్గపు ఆలోచనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారన్నారు. వీరి దుర్మార్గపు పాలన ఇంకా ఎంతో కాలం కొనసాగదని రఘునందన్ పేర్కొన్నారు.

*కోడుమూరులో డీఈడీ పేపర్లీ కేజీ కలకలం రేపింది. జడ్పీ బాలుర హైస్కూల్‌లో డీఈడీ ఆప్షనల్ సబ్జెక్ట్ప రీక్షలు జరుగుతున్నాయి. ఈ రోజు పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యింది. బస్టాండ్ దగ్గర ఓ జిరాక్స్ సెంటర్‌ లో.. ప్రశ్నపత్రాన్ని డీఈడీ కాలేజీ నిర్వాహకులు మైక్రో జిరాక్స్ తీసుకున్నారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులను చూసి డీఈడీ కాలేజీ నిర్వాహకులు పరారయ్యారు.

*నంద్యాల శోభా హోటల్‌లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్స మావేశం జరుగుతోంది. దుల్హన్ పథకం పై వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేయడంతో పాటు ముస్లిం సమాజానికి సీఎం జగన్ రెడ్డి చేసిన మోసపూరిత విధానాలను ఖండిస్తూ ముస్లిం, ప్రజా సంఘాలతో సమావేశమైంది. ఈ సమావేశంలో నంద్యాల పార్లమెంటు కార్యదర్శి ఎన్ ఎమ్ డి.ఫిరోజ్, టీడీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు

*ఏపీ (AP) వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమంలో పలు పోస్టుల భర్తీకి అధికారులు అడ్డగోలు విధానం పాటిస్తున్నారు. రోస్టర్ పాయింట్లు పాటించకుండానే పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ మేరకు ఇచ్చిన జీవో నెంబర్ 472 విడుదల అక్రమమని ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు అంటున్నారు. 2,195 పోస్టుల భర్తీకి ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో 1952 పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందివిగా గుర్తించారు. వాటిని టీచింగ్ కాలేజీలు, హాస్పిటల్స్‌లో భర్తీ చేయాలని నిర్ణయించారు. పారామెడికల్ సిబ్బందిని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా నియమించాలని, రుల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే అభ్యర్ధులు లేకపోవడంతో రోస్టర్ పాయింట్లను పక్కన పెట్టి ఓపెన్ కంపిటేషన్‌లో భర్తీ చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవి చంద్ర ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

*బీఎస్ఎఫ్(BSF) జవాన్‌కు గౌరవ మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ఉంగుటూరు మండలం తేల్లప్రోలు తన సొంత గ్రామంలో బీఎస్ఎఫ్ జవాన్ కూరపాటి దేవదానం(55) అంత్యక్రియలు జరిగాయి. 30 సంవత్సరములుగా బీఎస్ఎఫ్‌లో వెల్డర్‌గా దేవదానం విధులు నిర్వర్తిస్తున్నాడు. విధినిర్వహణలో జవాన్ దేవదానం గుండెపోటుతో మృతి చెందాడు.

*ఎన్టీఆర్ జిల్లా: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జి.కొండూరు మండలంలో పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో రహదారుల దుస్థితిని ప్రభుత్వానికి తెలిపేందుకు దుగ్గిరాల పాడు గ్రామం నుంచి జి.కొండూరు వరకు పాదయాత్ర ప్రారంభించారు. దుగ్గిరాల పాడులో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దేవినేని ఉమా పాదయాత్రకు మద్దతుగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మొహరించారు. పాదయాత్ర జరిగే గ్రామాల్లో పోలీసులు పీకేటింగ్ ఏర్పాటు చేశారు.

* మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలోని జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు ఉదయం వాకింగ్ చేస్తండగా మంత్రి అస్వస్థత‌కు లోనయ్యారు. లో బిపి, ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆయనకు జార్జి ఇంజనీరింగ్ కాలేజీలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ యశోద హాస్పిటల్‌లో మంత్రి సురేష్‌కు వైద్యులు యాంజియోగ్రామ్ చేసిన విషయం తెలిసిందే.

*ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని, మద్యం తాగుతున్న వారి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఏపీలో వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల్లో మందు బాటిల్స్‌ను సేకరించి టెస్టులు చేయించామని, ఆంధ్రా గోల్డ్‌ విస్కీ, 9సీ హార్స్‌ విస్కీలో కెమికల్‌ కాపౌండ్స్‌ ఉన్నాయని ఆరోపించారు. వైరాగేలా, ఐసోప్లురిక్‌ యాసిడ్‌ కెమికల్‌ కాపౌండ్స్‌ ఉన్నాయన్నారు. ఆ మద్యం బాటిల్స్‌లో హానికర కెమికల్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయని, ల్యాబ్‌ స్పష్టంగా నివేదిక ఇచ్చిందన్నారు. వాటిలో ఎలాంటి ప్రాణహాని లేదంటూ ప్రభుత్వం ఇచ్చిన వివరణ వట్టి బూటకమన్నారు. అలాంటి విష పదార్ధాలు లేవని ప్రభుత్వం నిరూపించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.

*తెలంగాణ బిసి గురుకులాల్లో,హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థుల చెంతకు ప్రముఖ విదేశీ విశ్వవిద్యాలయం హార్వర్డ్ చదువులు రానున్నాయి.బిసి సంక్షేమ శాఖ, ఉస్మానియా యునివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నాయి. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ డైరెక్టర్ డొమినిక్ మావో, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మల్లేశం, బిసి సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను శనివారం కలిసి తమ ప్రతిపాదన తెలియజేశారు.వచ్చే ఏడాది జనవరి నుంచి బిసి విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ల ద్వారా తరగతులు నిర్వహిస్తామని ఈ సందర్భంగా బుర్రా వెంకటేశంకి వారు తెలిపారు.

*ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజు (జూన్25)న ప్రస్తుత జగన్ ప్రభుత్వం ప్రజా వేదికను అక్రమ కట్టడంగా పేర్కొంటూ కూల్చివేయించింది. దీనిపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా వేదిక కూల్చివేతకు నిరసనగా.. టీడీపీ శ్రేణులు ఉండవల్లికి వస్తాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరికాసేపట్లో ప్రజావేదిక వద్దకు కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు, తెలుగు యువత నాయకులు రానున్నట్లు సమాచారం.

*ఈ విద్యాసంవత్సరా(2022-23)నికి ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు కావాల్సిన కొత్త పాఠ్యపుస్తకాలు ఈ నెల 27 నుంచి రాష్ట్ర ంలో డీఈఓ గుర్తించిన అన్ని బుక్‌ షాపుల్లో అందుబాటులో ఉండనున్నాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పాత పాఠ్యపుస్తకాలే వాడుకున్నారని, ఈ విద్యాసంవత్సరం మార్పులు, చేర్పులతో కొత్త పాఠ్యపుస్తకాలు ముద్రించినట్లు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రాపకులు, ప్రచురణకర్తల ప్రతినిధి కె.బాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం అన్ని సబ్జెక్టులు, అన్ని చాప్టర్లలో ఈ విద్యాసంవత్సరం ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌లను ముద్రించినట్లు పేర్కొన్నారు. క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేయడం ద్వారా ఆయా పాఠ్యాంశాలను ఆడియో, వీడియో రూపంలో వినడానికి, చూడటానికి అవకాశం ఉండేవిధంగా రాష్ట్ర విద్యాశాఖ రూపొందించింది.

* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 15వ స్నాతకోత్సవాన్ని జూలై 20న రవీంద్రభారతిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ శుక్రవారం ప్రకటించారు. కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌, చాన్సలర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధ్యక్షత వహిస్తారని ఆయన తెలిపారు.

*ఇంజనీరింగ్‌, డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసినవారికి అప్రెంటిస్‌షిప్‌ కోసం జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. జూన్‌ 1న తిరుపతి శ్రీవేంకటేశ్వర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 9గంటలకు జాబ్‌మేళాను ప్రారంభిస్తామన్నారు. 2019సెప్టెంబరు తర్వాత ఇంజనీరింగ్‌, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు 3సెట్లు, బయోడేటా తీసుకురావాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులు ఎంహెచ్‌ఆర్‌డిఎన్‌ఏటిఎస్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. యూజర్‌ ఐడీ, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ వివరాలు, ఉత్తీర్ణత అయిన సంవత్సరానికి సంబంధించిన నాలుగు సెట్ల జిరాక్స్‌లను కూడా తీసుకురావాలన్నారు. శిక్షణ కాలంలో నెలకు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.9వేలు, డిప్లొమా వారికి రూ.9వేలు అందిస్తారని తెలిపారు.

*శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో అధికార పార్టీలో నెలకొన్న వర్గపోరు తారస్థాయికి చేరింది. హిందూపురం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఉదయం ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వ్యతిరేక వర్గం ప్రెస్‌మీట్‌ పెట్టడానికి ప్రయత్నించింది. దీనికోసం హిందూపురం ఎంపీపీ రత్నమ్మ అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌ వర్గీయులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వైసీపీలోని దళిత నాయకులు ఆమెను ప్రెస్‌క్లబ్‌ బయటకు పిలిపించారు. వారు మాట్లాడుతుండగానే హిందూపురం మున్సిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్‌ ఇర్షాద్‌ అక్కడికి వచ్చారు. ఆయనపై ఎమ్మెల్సీ వర్గీయులైన వార్డు కౌన్సిలర్‌ భర్త కిరోసిన్‌ బాబు వార్డు కౌన్సిలర్‌ భర్త నాగరాజు దాడికి యత్నించారు. ఈ విషయాన్ని పార్టీ అసమ్మతి నాయకులకు ఇర్షాద్‌ తెలిపారు. దీంతో సాయంత్రం అసమ్మతి నాయకులైన మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బలరాం రెడ్డి చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తం రెడ్డి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్‌ రెడ్డిపలువురు కౌన్సిలర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

*ఆలయాల్లో జరిగే వ్యాపారాలకు వృత్తి పన్నును ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇప్పటివరకూ వాణిజ్య పన్ను ల శాఖ వ్యాపార నిబంధనల ప్రకారం ఎవరి వృత్తికి తగ్గట్టుగా వారు పన్ను చెల్లించాలి. కానీ, చాలా వ్యాపారాల్లో ఇది కచ్చితంగా అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో దేవదాయశాఖ ఓ అడుగు ముందుకేసి ఆలయాల వరకూ వృత్తి పన్ను కచ్చితంగా చెల్లించాలనే నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆలయాల్లో వ్యాపారాలు చేసే వారి లైసెన్సులు, రిజిస్ర్టేషన్లు, రెన్యువళ్లకు వృత్తి పన్నును తప్పనిసరి చేస్తూ దేవదాయ చట్టంలో నిబంధనలు సవరించారు.

*సివిల్‌ సర్వీసె్‌సలో 2020 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి పి. ధాత్రీరెడ్డి ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. 2019 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ ఆఫీసర్‌ కొమ్మి ప్రతాప్‌ శివ కిశోర్‌ కు, ధాత్రీరెడ్డితో వివాహం కావడంతో ఆమె ఏపీ క్యాడర్‌కు వచ్చేందుకు అనుమతి కోరారు. దీంతో ఏపీ, ఒడిసా ప్రభుత్వాలు ధాత్రీరెడ్డిని ఏపీ కేడర్‌కు బదలాయించడానికి కేంద్రానికి విన్నవించాయి. దీంతో కేంద్రం ఏపీ కేడర్‌కు కేటాయించింది.

*గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు సీఎం శుక్రవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. అర్హులైన గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగులను జూలై 1 నుంచి క్రమబద్ధీక రించేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కలెక్టర్లు ప్రొబేషన్‌ ప్రకటిస్తూ ఆదేశాలిచ్చారు. దానికి సంబంధించిన ఫైల్‌ను ఆయా జిల్లా కలెక్టర్లు గ్రామ, వార్డ్‌ సచివాలయ శాఖకు పంపారు. ఆ శాఖ నుంచి పంపిన ఫైల్‌ సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. శుక్రవారం సీఎం ఆ ఫైల్‌పై సంతకం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

*సహకార సంస్థల పాలకవర్గాల గడువును మరో 6 నెలలు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగినా.. ఉమ్మడి 13 జిల్లాల స్థాయిలోనే డీసీసీబీలు, డీసీఎంఎ్‌సలు కొనసాగుతున్నాయి. ఇందులో డీసీఎంఎ్‌సల పాలకవర్గాల గడువును 2023 జనవరి వరకు పెంచాలని సహకార మంత్రి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. డీసీఎంఎ్‌సలతో పాటు డీసీసీబీల పర్సన్‌ ఇన్‌చార్జిలను, పీఏసీఎ్‌సల త్రిసభ్య కమిటీలను కూడా 6 నెలలు పొడిగించే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సహకార రంగంలో సంస్కరణలు తేవాలని రెండేళ్లుగా భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ఏ చర్య తీసుకోకుండా.. పీఏసీఎ్‌సలు, డీసీసీబీలు, డీసీఎంఎస్‌లు, ఆప్కా్‌పకు నాన్‌ అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌చార్జిలతో నెట్టుకోస్తోంది. సహకార సంస్థల పాలకవర్గాల్లో వివిధ రంగాల్లో నిపుణులైన వారిని డైరెక్టర్లుగా నియమించాలని, భూమి ఉన్న రైతులతో పాటు సహకార సంఘాల్లో ఆర్ధిక లావాదేవీలు నిర్వహించే వారందరిని పీఏసీఎ్‌సల్లో ఓటర్లుగా చేర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ రెండేళ్లుగా బిల్లు తేలేకపోయింది. అసెంబ్లీలో సంస్కరణల బిల్లు పెట్టడంలో ఆలస్యమవుతున్నందున అధికార పార్టీకి చెందిన వ్యక్తులతో నియమించిన పర్సన్‌ ఇన్‌చార్జి కమిటీలను మరికొంత కాలం కొనసాగించాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు చెప్తున్నారు.

*కర్నూలు నగరం నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలోని టీజీవీ సంస్థలకు చెందిన 88 సెంట్ల స్థలం, భవనాన్ని వాసవీ సత్రం సముదానికి ఆ సంస్థ సీనియర్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ విరాళంగా అందజేశారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ స్థలం విలువ రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. శుక్రవారం స్థానిక మౌర్య ఇన్‌లోని తన చాంబరులో జరిగిన కార్యక్రమంలో వాసవీ సత్రం పేరున రిజిస్ట్రేషన్‌ చేయించిన దస్తావేజు పత్రాలను టీజీ వెంకటేష్‌, ఆయన తనయుడు, టీజీవీ సంస్థల జూనియర్‌ చైర్మన్‌ టీజీ భరత్‌ వాసవీ సత్రం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లే ఆర్యవైశ్య విద్యార్థులకు వసతి భవనం నిర్మాణం కోసం ఈ స్థలం వినియోగించాలని కమిటీ సభ్యులకు సూచించారు. పేద విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.

*ప్రభుత్వోద్యోగులకు సీఎం జగన్‌ షాక్‌ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దుచేస్తే 2035 నాటికి పింఛన్ల భారం మోయలేక ప్రభుత్వం నడపడమే కష్టమవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తేల్చిచెప్పారు. ఈ భారం నుంచి ఉపశమనం కోసమే గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌ను (జీపీఎస్‌) ప్రవేశపెడతామని చెబుతున్నామని మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై ఉద్యోగుల నుంచి సానుకూలత వస్తే.. జీపీఎ్‌సను అమలు చేస్తామన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి ప్రభుత్వం వెనక్కు తగ్గుతోందంటూ ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ‘మైనారిటీలకు వంచన’ శీర్షిక పేరిట ప్రచురితమైన కథనంతోసహా, ఇదే అంశంపై వచ్చిన పలు కథనాలు కేబినెట్‌ భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అధికారిక అజెండా అంశాలపై కేబినెట్‌ తీర్మానాలు పూర్తయ్యాక, మంత్రులతో సీఎం జగన్‌ మాట్లాడారు.

*రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల పరిపాలనా బాధ్యతలను విద్యాశాఖకు అప్పగిస్తూ మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ పాఠశాలల్లో పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న 2,114 మున్సిపల్‌ పాఠశాలలు ఇక నుంచి విద్యాశాఖ పరిధిలోకి రానున్నాయి. ఈ పాఠశాలల్లో 345 ఉన్నత, 149 ప్రాథమికోన్నత, 1,620 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలలతో సమానంగా మునిసిపల్‌ పాఠశాలల్లో సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ లేదు. శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్‌ పాఠశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రత్యేక అధికారుల కొరత కూడా ఉంది. దీంతో మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. జడ్పీ, ఎంపీపీ పాఠశాలల విషయంలో పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల పరిపాలన నియంత్రణను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది. ఇప్పుడు మునిసిపల్‌ స్కూళ్ల వ్యవహారాన్ని విద్యాశాఖకు అప్పగించారు.

*గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)లకు అనుగుణంగా సౌర, పవన విద్యుదుత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయాలని ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం, డిస్కమ్‌లు పట్టించుకోవడం లేదని ఆయా విద్యుదుత్పత్తి సంస్థలు శుక్రవారం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చాయి. ఈ విషయంలో కోర్టుధిక్కరణ వ్యాజ్యాలు దాఖలు చేశామని.. దానిపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించాయి. పిటిషన్లను పరిశీలించి విచారణకు వచ్చేలా చూస్తామని చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం పేర్కొంది

*మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని స్పెషల్‌ మార్జిన్‌ పేరుతో ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు మళ్లించి, ఆ సొమ్మును ఆదాయంగా చూపి రుణాలు పొందడాన్ని సవాల్‌ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని నిరర్ధక వ్యాజ్యంగా పేర్కొంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది.

*గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి, ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. ఫలితాలు ప్రకటించవద్దంటూ అప్పీలుదారులు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఫలితాల ప్రకటన, పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చినట్లైతే.. అవి ప్రధాన వ్యాజ్యాలలో కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పింది. ఆ విషయాన్ని పోస్టింగ్‌ ఆర్డర్స్‌లో ప్రస్తావించాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. అలాగే కోర్టు ఇచ్చే తుది తీర్పునకు కట్టుబడి ఉంటామని, ఉద్యోగాలకు ఎంపికైన నేపథ్యంలో భవిష్యత్తులో చట్టబద్ధమైన హక్కు కోరబోమని పోస్టింగ్‌ తీసుకున్న అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకోవాలని పేర్కొంది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలలో ప్రతివాదులుగా చేరాలంటే ఎంపికైన అభ్యర్థులు చేరవచ్చని స్పష్టం చేసింది.

* కోనసీమజిల్లా పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో జరిగిన హింసాత్మక ఘటనలపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీనిని ప్రచార, రాజకీయ ప్రయోజనాల పిల్‌గా అభివర్ణించింది. నిరర్ధక వ్యాజ్యాలను దాఖలు చేస్తే ఖర్చులు విధిస్తామని హెచ్చరించింది. వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. కోనసీమజిల్లా పేరును అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చవద్దంటూ జరిగిన ఆందోళనల సందర్భంగా అమలాపురంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వ్యవహారంలో నమోదైన కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి. శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆందోళనల సందర్భంగా మంత్రి విశ్వరూప్‌ నివాసాన్ని కాల్చివేశారన్నారు. అల్లర్లలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్‌ పాత్ర ఉందని తెలిపారు. అయితే, దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆయనను ప్రశ్నించలేదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. రాజకీయ వ్యవహారాలతో తమకు సంబంధం లేదని వ్యాఖ్యానించింది. అల్లర్లకు పాల్పడినవారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొంది. నిరర్థక పిల్‌ వేసినందుకు పిటిషనర్‌కు రూ.25 లక్షలకు తగ్గకుండా జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఖర్చులు విధించవద్దని న్యాయవాది ప్రాధేయపడడంతో అంగీకరిస్తూ వ్యాజ్యాన్ని కోట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

*వ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల పరిపాలనా బాధ్యతలను విద్యాశాఖకు అప్పగిస్తూ మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ పాఠశాలల్లో పనితీరును మరింత మెరుగుపరిచేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న 2,114 మున్సిపల్‌ పాఠశాలలు ఇక నుంచి విద్యాశాఖ పరిధిలోకి రానున్నాయి. ఈ పాఠశాలల్లో 345 ఉన్నత, 149 ప్రాథమికోన్నత, 1,620 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అయితే, ప్రభుత్వ, జడ్పీ, ఎంపీపీ పాఠశాలలతో సమానంగా మునిసిపల్‌ పాఠశాలల్లో సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ లేదు. శాశ్వత ప్రాతిపదికన మున్సిపల్‌ పాఠశాలల్లో అకడమిక్‌ కార్యకలాపాలను పర్యవేక్షించే ప్రత్యేక అధికారుల కొరత కూడా ఉంది. దీంతో మున్సిపల్‌ పాఠశాలల్లో విద్యా పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు ఉన్నాయి. జడ్పీ, ఎంపీపీ పాఠశాలల విషయంలో పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయుల పరిపాలన నియంత్రణను పాఠశాల విద్యాశాఖకు బదిలీ చేసింది. ఇప్పుడు మునిసిపల్‌ స్కూళ్ల వ్యవహారాన్ని విద్యాశాఖకు అప్పగించారు.

*తిరుపతి జిల్లా చంద్రగిరిలో వైసీపీ కార్యాలయం ఏర్పాటుకు రెండెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి స్టే ఇవ్వాలన్న పిటిషనర్‌ గౌస్‌ బాషా అభ్యర్థనను తోసిపుచ్చింది. గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ కార్యాలయం ఏర్పాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌తో ప్రస్తుత పిల్‌ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈమేరకు చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది.

*విశాఖపట్నం జిల్లాలో నర్సింగ్‌ విద్యార్థిని ని కిడ్నాప్‌ చేసి మావోయిస్టు దళంలో చేర్పించారన్న అభియోగంపై అరెస్టయిన ముగ్గురు మహిళల్లో ఇద్దరిని శుక్రవారం ఎన్‌ఐఏ పోలీసులు విజయవాడలోని మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. విశాఖ జిల్లా పెదబయలు పోలీ్‌సస్టేషన్‌లో నమోదైన కేసును ఎన్‌ఐఏ తిరిగి కొత్త కేసుగా నమోదుచేసిన విష యం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు శిల్ప, దేవేంద్ర, స్వప్నలను అరెస్టు చేశారు. వారిలో శిల్ప, దేవేంద్రలను విజయవాడలోని కోర్టులో హాజరుపరిచారు. స్వప్న మూడు నెలల గర్భిణి కావడంతో తీసుకురాలేదు. ఆమెను హైదరాబాద్‌లో ఉన్న ఎన్‌ఐఏ కోర్టులో హాజరుపరిచారు. ఎన్‌ఐఏ న్యాయవాది సిద్ధి రాములు, మహిళల తరఫున న్యాయవాది జి. రామ్మోహన్‌ వాదప్రతివాదనలు వినిపించారు.

*తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి సర్వదర్శన భక్తులకు దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పడుతోంది. విద్యార్థుల పరీక్ష ఫలితాలు వెలువడడంతో పాటు వేసవి సెలవులు ముగుస్తున్న క్రమంలో ఉదయం నుంచి తిరుమలకు భక్తుల రాక పెరిగింది. మొక్కులున్న భక్తులు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో కాలినడకన భారీగా తిరుమలకు వస్తున్నారు.

*రాజమహేంద్రవరం క్వారీ సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు. గతంలో టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్‌ నిర్వహించిన ప్రాంతానికి ఎదురుగానే ఒక భవనంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు ఆదిరెడ్డి వాసు, యర్రా వేణుగోపాల రాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌లతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ప్రారంభించారు.

*వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. శుక్రవారం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో చేరారు. కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన ఆయన ఇక్కడి టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గ ఇన్‌చార్జి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో ఆయన పార్టీ సభ్యత్వం స్వీకరించారు.

*కర్నూలు నగరం నంద్యాల చెక్‌పోస్టు ప్రాంతంలోని టీజీవీ సంస్థలకు చెందిన 88 సెంట్ల స్థలం, భవనాన్ని వాసవీ సత్రం సముదానికి ఆ సంస్థ సీనియర్‌ చైర్మన్‌, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ విరాళంగా అందజేశారు. మార్కెట్‌ విలువ ప్రకారం ఆ స్థలం విలువ రూ.20 కోట్లకు పైగానే ఉంటుందని స్థానికులు అంటున్నారు. శుక్రవారం స్థానిక మౌర్య ఇన్‌లోని తన చాంబరులో జరిగిన కార్యక్రమంలో వాసవీ సత్రం పేరున రిజిస్ట్రేషన్‌ చేయించిన దస్తావేజు పత్రాలను టీజీ వెంకటేష్‌, ఆయన తనయుడు, టీజీవీ సంస్థల జూనియర్‌ చైర్మన్‌ టీజీ భరత్‌ వాసవీ సత్రం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా టీజీ మాట్లాడుతూ ఉన్నత చదువులకు వెళ్లే ఆర్యవైశ్య విద్యార్థులకు వసతి భవనం నిర్మాణం కోసం ఈ స్థలం వినియోగించాలని కమిటీ సభ్యులకు సూచించారు. పేద విద్యార్థులకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.

* ‘దళిత, గిరిజనులకు 3 ఎకరాల చొప్పున ఇచ్చేందుకు భూమి లేదు కానీ..వందల కోట్ల ఆస్తులున్న కేసీఆర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ(టీఆర్‌ఎస్‌)కు మా త్రం 33 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రజల భూమిని దోచి పెట్టారు. ఈ బరితెగింపును ఇట్లాగే వదిలేద్దామా?’అని రేవంత్‌ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్‌ చేసిన ఆయన..‘కారు చౌక’ పేరుతో ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్నీ పోస్ట్‌ చేశారు.

*చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జా కృష్ణా ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు వైసీపీ ఎంపీ ఆర్‌ కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గుజ్జ కృష్ణ మాట్లాడుతూ… వచ్చే సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టకపోతే దేశంలో కేంద్ర మంత్రులను తిరగనివ్వబోమని, మిలిటెంట్‌ తరహా పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీసీల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

*ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి, డాక్యుమెంటరీ ఫిలిం డైరెక్టర్‌ కాకర్ల సజయకు కేంద్ర సాహిత్య అకాడమీ 2021వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక అనువాద పురస్కారాన్ని శుక్రవారం ప్రకటించింది. జర్నలిస్టు భాషాసింగ్‌ పారిశుధ్య కార్మికులపై హిందీలో రచించిన ‘అదృశ్య భారత్‌’ అనే పుస్తకాన్ని ‘అశుద్ధ భారత్‌’ పేరిట సజయ తెలుగులోకి అనువదించారు. ఈ పుస్తక అనువాదానికే ఆమెకు ఈ పురస్కారం లభించింది. రూ.50 వేల నగదు బహుమతి, జ్ఞాపికను పురస్కారంలో భాగంగా అందిస్తామని అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివా్‌సరావు ఓ ప్రకటనలో తెలిపారు. అకాడమీ అనువాద పురస్కార ఎంపిక జ్యూరీలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆచార్యురాలు శేషారత్నం, సీనియర్‌ కవి ముకుందరామారావు, డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు ఉన్నారు. ఈ సందర్భంగా సజయ మాట్లాడుతూ.. ‘‘ఈ పురస్కారం నా ఒక్కరికి కాదు.

*మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం అస్వస్థతకు గురై చనిపోయాడు. విద్యార్థి అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు అప్రమత్తమై 108 వాహనంలో మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులపేట మండలం ముంగిమడుగు పకీరా తండాకు చెందిన భూక్య అఖిల్‌ (14) మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో తొమ్మిదోతరగతి చదువుతున్నాడు. మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం హాస్టల్‌ నుంచి పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తరగతి గదిలో కూర్చున్న అఖిల్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. తక్షణమే అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానిక ఆర్‌ఎంపీతో ప్రాథమిక చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో 108లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అఖిల్‌ను పరీక్షించిన వైద్యులు మార్గం మధ్యలోనే చనిపోయాడని ధ్రువీకరించారు.

*రాజస్థాన్ కిషన్పోల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ కాగ్జీ తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తన నియోజకవర్గంలోని నలుగురు వైద్యులను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ జైపుర్లోని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి పర్సాది లాల్ మీనా నివాసం వద్ద అనుచరులతో కలిసి ధర్నాకు దిగారు అమీన్ కాగ్జీ. మంత్రి కాసేపటి తర్వాత బదిలీలపై ఆలోచిస్తానని హామీ ఇవ్వగా ధర్నాను విరమించారు అమీన్. అధికార పార్టీ ఎమ్మెల్యేను మంత్రి ఇంటి ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది.