Movies

అవన్నీ అసత్యాలు 

అవన్నీ అసత్యాలు 

ఈమధ్య రాశీఖన్నా వ్యాఖ్యలు, దానిపై కామెంట్లు ఎక్కువ అవుతున్నాయి. దక్షిణాది సినీ పరిశ్రమను రాశి విమర్శించినట్లు వచ్చిన వార్తలు వేడెక్కాయి. అయితే అవన్నీ నిజం కాదంటూ స్పందించింది. “దక్షిణాది చిత్ర పరిశ్రమల్ని దూషిస్తూ వ్యాఖ్యలు చేశాననడం నిజంకాదు. నేను ఏ భాషలో సినిమాలు చేసినా ఆ భాషపట్ల, చేసిన సినిమా పట్ల నాకెంతో గౌరవ మర్యాదలుంటాయి. దయచేసి నాపై అసత్య ప్రచారాలు మానేయండి” అంటున్న రాశి చేతిలో తెలుగులో ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ సినిమాలు, హిందీలో ‘యోధ’ చిత్రాలున్నాయి.