Politics

కేసీఆర్‌కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు – TNI రాజకీయ వార్తలు

కేసీఆర్‌కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు  – TNI  రాజకీయ వార్తలు

*తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఈనెల21 నుంచి పల్లె ఘోస- బీజేపీ భరోసా పేరుతో యాత్ర పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన వివరించారు.వచ్చేఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని బిజెపి నిర్ణయించిందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.మూడో విడతలో బండి సంజయ్‌ 20 రోజుల పాదయాత్ర చేస్తారని తరుణ్‌చుగ్ తెలిపారు.

*కాంగ్రెస్‌లో కలవరం.. బీజేపీతో టచ్‌లో కీలక నేతలు!
దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా మహారాష్ట్రలో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. దీంతో, శివసేనకు ఊహించని షాక్‌ తగిలింది. ఇదిలా ఉండగా.. గోవా కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. హస్తం పార్టీలో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, శనివారం జరిగిన పార్టీ సమావేశానికి ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో వారు అధికార బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో, ఒక్కసారిగా గోవా పాలిటిక్స్‌ హీటెక్కాయి. మరోవైపు.. గోవా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి.ఈ నేపథ్యంలో విపక్ష పార్టీ కాంగ్రెస్‌.. హస్తం నేతలతో సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించేందుకు ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం నిర్వహించింది. ఈ కీలక మీటింగ్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గైర్హాజరు అవడం హస్తం నేతలకు కలవరపాటుకు గురిచేసింది. అయితే, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థిగా బరిలో నిలిచిన దిగంబర్ కామత్, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి రాలేదు. వారిలో కాగా, మైఖేల్ లోబోను కాంగ్రెస్‌ తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నియమించడంపై దిగంబర్ కామత్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం. దీంతో, వీరు కీలక సమావేశానికి డుమ్మా కొట్టడంతో బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నరనే వార్తలు బయటకు వచ్చాయి. ఇక, గోవా అసెంబ్లీ సమావేశాలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి.

*అధికార దుర్వినియోగ సభగా జగన్ ప్లీనరీ: Jawahar
టీడీపీ మాజీ మంత్రి జవహర్ గుంటూరు వైసీపీ ప్లీనరీ సమావేశాలపై స్పందించారు. సీఎం జగనపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పార్టీ ప్లీనరీని జగన్ భజన సభగా జవహర్ అభివర్ణించారు. ప్లీనరిలో పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి విజయమ్మతో రాజీనామా ప్రకటన చేయించాడని, రెండోరోజు మీడియా ఛానళ్లపై వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులతో బూతులు మాట్లాడించాడని విమర్శించారు. యువజన సంక్షేమం, ఉపాధిపై సీఎం నోరు మెదపలేదని, మొత్తంగా చూస్తే అధికార దుర్వినియోగ సభగా జగన్ ప్లీనరి ముగిసిందన్నారు

*ఇళ్లు, స్థలాలు కబ్జా చేయడం గూండాల‌ ప్రవృత్తి: పవన్‌
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడలో ‘జనవాణి-జనసేన భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలపై ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. పేదల కోసమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్‘‘రేణిగుంట తారకరామానగర్‌లో ఓ కుటుంబానికి 2004లో వైయస్ ప్రభుత్వం ఇల్లు ఇచ్చింది. ఆ ఇంటిని లాక్కునెందుకు వైసీపీ ఎంపీటీసీ దౌర్జన్యం చేశారు. ఇలాంటి ఘటనలో తరుచూ జరుగుతున్నా.. యథా రాజా తథా ప్రజా రీతిలో వైసీపీ పాలన సాగుతోంది. ఈ తరహా ఘటనల వల్లే తీవ్రవాద ఉద్యమాలు పుట్టుకొస్తాయి. అధికార మదంతో ఇలా చేస్తారని నేను గతంలోనే చెప్పాను. పేదల ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసమే కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టా. హోం మంత్రి, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి. వైసీపీ నాయకులు, కార్యకర్తలు నన్ను చాలా రకాలుగా బెదిరిస్తున్నారు. నేను వారికి భయపడను… పేదల జోలికి వస్తే ఊరుకోను’’ అని పవన్ హెచ్చరించారు

*సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నాను: లక్ష్మీనారాయణ
2024 ఎన్నికల్లో మార్పు తెచ్చేందుకు పనిచేస్తున్నాని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నానని ప్రకటించారు. రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రజల్లోనే ఉందని, పార్టీల్లో కాదన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని లక్ష్మీనారాయణ చెప్పారు

* ప్లీనరీ మొత్తం అబద్ధాల పుట్ట : సోము వీర్రాజు
రాష్ట్రంలో భాజపా రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్లీనరీలో వైకాపా చెప్పినవన్నీ అవాస్తవాలేనని ఆక్షేపించారు.అవన్నీ అవాస్తవాలు.. రాజ్యాధికారం దిశగా భాజపాపార్టీ ప్లీనరీలో వైకాపా నేతలు అన్నీ అవాస్తవాలే చెప్పారని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చేశాయంటూ చేసిన తీర్మానంతోపాటు అన్నింటిపైనా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రంలో భాజపా రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తోందన్న సోము.. పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేయాలని శ్రేణులకు సూచించారు.

*కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలకు భద్రత: మంత్రి Koppula
ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలకు ఎంతో భద్రత వుందని, అలాగే మిగిలిన వర్గాలు కూడా శాంతి సమైఖ్యతతో ఉంటున్నారని ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బక్రీద్పం డుగ సందర్భంగా తెలంగాణ వాసులు,దేశ విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలైన ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి కొప్పుల శుభాకాంక్షలు తెలిపారు.ముస్లింలు రంజాన్(ఈదుల్ ఫితర్)మాదిరిగానే బక్రీదు (ఈదుల్ అధా )ను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.ఇస్లాం ధర్మాన్ని ప్రపంచంలో కోట్లాది మంది అవలంభిస్తున్నారని,ఇది శాంతి,సహనం, దయ, కరుణ,ప్రేమ,ఐకమత్యం, మానవత్వాన్ని బోధిస్తున్నది వివరించారు.

*నాకు జేపీ నడ్డా చెప్పిన మాట ఇదే: లక్ష్మణ్బీ
జేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… మర్యాదపూర్వకంగా జేపీ నడ్డాను కలిశాన్నారు. యూపీ నుంచి నన్ను రాజ్యసభకు పంపారంటే ప్రధాన కారణం.. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కోసమేనన్నారు. తెలంగాణలో బీజేపీకి సంఖ్యా బలం లేనందునే యూపీ నుంచి రాజ్యసభకు నన్ను ఎంచుకున్నారని చెప్పారు. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నడ్డా చెప్పారని వ్యాఖ్యానించారు.

*కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలకు భద్రత: మంత్రి Koppula
ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలకు ఎంతో భద్రత వుందని, అలాగే మిగిలిన వర్గాలు కూడా శాంతి సమైఖ్యతతో ఉంటున్నారని ఎస్సీ, మైనారిటీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్అన్నారు. బక్రీద్పండుగ సందర్భంగా తెలంగాణ వాసులు,దేశ విదేశాలలో నివసిస్తున్న తెలంగాణ బిడ్డలైన ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి కొప్పుల శుభాకాంక్షలు తెలిపారు.ముస్లింలు రంజాన్(ఈదుల్ ఫితర్)మాదిరిగానే బక్రీదు (ఈదుల్ అధా )ను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.ఇస్లాం ధర్మాన్ని ప్రపంచంలో కోట్లాది మంది అవలంభిస్తున్నారని,ఇది శాంతి,సహనం, దయ, కరుణ,ప్రేమ,ఐకమత్యం, మానవత్వాన్ని బోధిస్తున్నది వివరించారు.ఆర్థిక స్థోమత కలిగిన వారు ఈ పండుగ సందర్భంగా మేకలు,గొర్రెలను ఖుర్బానీ ఇచ్చి మాంసాన్ని పేదలు,బంధుమిత్రులకు పంచి పెడతారని, విందు భోజనం పెడతారని,తమ పూర్వీకులను కొలుస్తారని మంత్రి తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో మైనారిటీలు,అన్ని వర్గాల ప్రజలు ఎలాంటి అభద్రతకు లోను కాకుండా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా జీవిస్తున్నారని కొప్పుల పేర్కొన్నారు.తమ ప్రభుత్వం 204 గురుకుల పాఠశాలల ద్వారా మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నదని..రంజాన్ సందర్భంగా విందులు ఏర్పాటు చేస్తూ,పేదలకు దుస్తులు అందజేస్తున్నామని వివరించారు.

* జగన్‌ మళ్లీ గెలిస్తే.. సంక్షేమ పథకాలే ఉండవు: వర్ల
‘‘జగన్‌రెడ్డి మరోసారి గెలిస్తే రాష్ట్రంలో ఇక సంక్షేమ పథకాలు ఉండవు. జగన్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే సామర్థ్యం లేదు. కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. ఆయన మరోసారి గెలిస్తే ఆ రోజు నుంచే పథకాలు నిలిచిపోతాయి. మరోసారి గెలవడం కోసం పంటిబిగువున లాక్కొస్తున్నారు. ఈ విషయం ఆ పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు’’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన చేశారు. కోడి కత్తి కుట్ర… నారాసుర రక్తచరిత్ర పేరుతో వివేకా హత్యపై దుష్ప్రచార కుట్ర, సొంత మంత్రి ఇల్లు తగలబెట్టించిన కుట్ర అన్నీ జగన్‌వేననీ, అంతటి ఘనుడు ఆయనేనని వర్ల వ్యాఖ్యానించారు.

*పార్టీ ప్లీనరీలో స్పీకర్‌ ఎలా పాల్గొంటారు?: కూన
స్పీకర్‌ పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం వైసీపీ ప్లీనరీకి ఎలా వెళ్తారని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. స్పీకర్‌గా ప్రొటెక్షన్‌ తీసుకొంటూ పార్టీ సమావేశాలకు వెళ్లడం అనైతికం కాదా? అని ప్రశ్నించారు. స్పీకర్‌గా కోడెల ఏనాడూ టీడీపీ మహానాడు సమావేశాలకు రాలేదని, ప్రభుత్వం తరఫున అధికారికంగా నిర్వహించిన మహిళా సాధికారత సమావేశాల్లో మాత్రమే పాల్గొన్నారని కూన పేర్కొన్నారు.

*జగన్‌ భజనకే వైసీపీ ప్లీనరీ: అనిత
ముఖ్యమంత్రి జగన్‌కు భజన చేసేందుకే వైసీపీ ప్లీనరీ ఏర్పాటు చేసినట్టుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శనివారం విశాఖ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. చంద్రబాబు విజన్‌ను చూసి వైసీపీకి భయపట్టుకుందని, అందుకే ఆయన పెట్టుకున్న ఉంగరాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని అనిత ఆరోపించారు.

*పంచాయతీ నిధులు కాజేసి.. వక్రభాష్యాలా?: వైవీబీ
‘‘పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7,660 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌లకు తెలియకుండా కాజేసింది. దానికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వక్రభాష్యం చెప్పడం దారుణం’’ అని ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్‌ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘గ్రామ పంచాయతీల నిధులను కరెంట్‌ బిల్లులకు కట్టామని వైసీపీ ప్లీనరీలో అబద్ధాలు మాట్లాడారు. గత మూడు సంవత్సరాల నుంచి కేంద్రం నిధులను కొల్లగొడుతున్న రాష్ట్ర సర్కార్‌ పంచాయతీలకు కరెంట్‌ బిల్లు చెల్లించినట్లు రశీదులు ఎందుకు ఇవ్వడం లేదు? ఆ బిల్లులే చెల్లించి ఉంటే విద్యుత్‌ అధికారులు బిల్లుల కోసం సర్పంచ్‌లను ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు? ముఖ్యమంత్రి, మంత్రి ప్రజలకు అబద్ధాలు చెప్పడం మానేసి రాష్ట్ర ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకున్న పంచాయతీల నిధులను ఆయా పంచాయతీలకు విడుదల చేయాలి. లేకపోతే రాజకీయాలకు అతీతంగా, రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లందరితో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమించి సర్పంచ్‌ల నిధులను తిరిగి రాబట్టుకుంటాం’’ అని వైవీబీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

*వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతర: రామకృష్ణ
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తమ పార్టీ ప్లీనరీలో తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకుని వైసీపీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఇంకా నయం.. ఏపీకి శాశ్వత ముఖ్యమంత్రిగా ప్రకటించుకోలేదు అంటూ ఎద్దేవా చేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన వైసీపీ ప్లీనరీని జగన్‌ను శాశ్వత అధ్యక్షుడిని చేయడానికి, ఆయనను పొగడ్తలతో ముంచెత్తడానికే నిర్వహించినట్లుందని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. వైసీపీ ప్లీనరీ వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి కేంద్రం చేసిన దోహంపై ప్లీనరీలో కనీసం చర్చించకుండా.. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 సంస్థలపై దుమ్మెతిపోయడం దుర్మార్గమని, పదే పదే పత్రికలు, మీడియా సంస్థలను తిట్టడం, బెదిరించడం ఇకనైనా మానుకోవాలని రామకృష్ణ సూచించారు.

*అలా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉంది: గంటా
నాడు-నేడు పథకంపై వైసీపీ నేతలు గొప్పగా చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు పేర్కొన్నారు. అది వైసీపీ పథకంగా చెప్పుకోడవం సరికాదన్నారు. టీచర్ల నియామకాలకు వదిలేసి వేల సంఖ్యలో స్కూళ్లను మూసివేశారని చెప్పారు.

*గుడివాడలో కొడాలి నానికి ఎదురుదెబ్బ
గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్న పాలంకి బ్రదర్స్ సారధిబాబు, మోహన్ బాబు జనసేన పార్టీలో చేరారు. రాజకీయ వ్యవహరాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కాగా వైకాపా నిర్వహించిన రెండు రోజుల ప్లీనరీ సమావేశాలపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ పంచ్లు వేశారు. ప్లీనరీ సమావేశాలు సర్కస్ కంపెనీని తలపించాయని ఎద్దేవా చేశారు. అధికార దుర్వినియోగానికి ఈ ప్లీనరీ పరాకాష్ట అని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాసంక్షేమం గురించి మాట్లాడకుండా నేతలు ఒకరినొకరు సింహాలు, పులులు అంటూ కితాబులిచ్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద గుడారాలు‌ వేసి.. సర్కస్ నిర్వహించిన విధంగా ప్లీనరీ నిర్వహించారని విమర్శించారు.

*అక్రమ కేసులు ఎత్తి వేయాలి.. లేదంటే: హర్షకుమార్ద
ళితుల భిక్షతోనే వైసీపీ ప్లీనరీ సమావేశాలు జరిగాయని మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. చెల్లిని, తల్లిని తరిమేసినట్టే ఏపీ లో దళితులను తరిమేస్తున్నారన్నారని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్పా లనలో దళితులను రెండో శ్రేణి ప్రజలుగా గుర్తిస్తున్నారని మండిపడ్డారు. రావులపాలెం ఎస్ఐ, సీఐని తక్షణమే సస్పెన్షన్ చేయాలన్నారు. ఈ నెల 12లోపు దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈనెల 13న ఛలో రావులపాలెం కు పిలుపునిస్తామని హర్షకుమార్‌ హెచ్చరించారు.

*జగన్ హయాంలో 7 గంటలే : సోమిరెడ్డి
వైసీపీ అధికారంలోకి వచ్చాక చాలా ఎక్కువగా దెబ్బతిన్నది వ్యవసాయ రంగమేనని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన రైతు పోరు బాట బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో 9 గంటలు నిరంతరంగా విద్యుత్ ఇస్తే.. జగన్ హయాంలో 7 గంటలు మాత్రమే అందుతోందని తెలిపారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే ప్రక్రియను కేంద్రం వెనక్కి తీసుకున్నా.. వైసీపీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూసార పరీక్షలు జరపడం ఆపివేయడంతో పంటదిగుబడి తగ్గిందని చెప్పారు. మునుపెన్నడూ లేని విధంగా రైతులు క్రాప్ హాలిడేకి వెళ్తున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్య‌లో ఆంధ్ర ప్రదేశ్ ముందు వరుసలో ఉందన్నారు.

*గొడ్డలితో వేసేసి గుండెపోటు అనడమా మీ క్రెడిబిలిటీ?: వర్ల
జగన్ నీతిపరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు హాజరవ్వడం లేదు?అని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబం ప్రకటించినట్లు జగన్‌ కూడా ఆస్తులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం, ఇసుక, సిమెంట్ సిండికేట్ వ్యాపారం చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ నేతలకు క్యారెక్టర్ లేదా? క్రెడిబిలిటీ లేదా?, చిన్నాన్నను గొడ్డలితో వేసేసి గుండెపోటు అనడమా మీ క్రెడిబిలిటీ? అని వర్ల రామయ్య ప్రశ్నించారు. జీవితకాల అధ్యక్షుడుగా ప్రకటించుకున్న జగన్‌ని మించిన పెత్తందారు లేరన్నారు.

* కేసీఆర్‌కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు:Tarun chug
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కు బైబై చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా వున్నారని బిజెపిరాష్ట్ర ఇన్ ఛార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఈనెల21 నుంచి పల్లె ఘోస- బీజేపీ భరోసా పేరుతో యాత్ర పేరుతో కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ఆయన వివరించారు.వచ్చేఎన్నికల వరకు ప్రజల్లో ఉండాలని బిజెపి(bjp) నిర్ణయించిందని తరుణ్‌చుగ్ పేర్కొన్నారు.ఆగస్టు 2 నుంచి ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత పాదయాత్ర కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.మూడో విడతలో బండి సంజయ్‌ 20 రోజుల పాదయాత్ర చేస్తారని తరుణ్‌చుగ్ తెలిపారు.