Movies

ఈద్‌ ముబారక్‌ చెప్పిన రష్మిక

ఈద్‌ ముబారక్‌ చెప్పిన రష్మిక

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా ‘సీతారామం’ అనే చిత్రం రూపుదిద్దుకొన్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్‌ తెరకెక్కించింది. హను రాఘవపూడి దర్శకుడు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయికగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతోంది. అయితే ఇందులో రష్మిక కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఆమె కథానాయిక కాదు కానీ…. కథని మలుపుతిప్పే పాత్ర అది. ఇందులో అఫ్రీన్‌ అనే ముస్లిం యువతిగా రష్మిక కనిపించనున్నారు. ఆదివారం బక్రీద్‌. ఈ సందర్భంగా ‘సీతారామం’లోని రష్మిక కొత్త లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో.. ‘ఈద్‌ ముబారక్‌’ చెబుతున్న పోస్టర్‌ అది. 1965 నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటికే టీజర్‌తో పాటు కొన్ని పాటలు విడుదలయ్యాయి. అవన్నీ ఈ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇటీవల బ్రిగేడియర్‌ విష్ణు శర్మగా సుమంత్‌ని పరిచయం చేసింది చిత్రబృందం. మిలటరీ అధికారిగా.. సుమంత్‌ లుక్‌ కొత్తగా అనిపించింది. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.