DailyDose

TNI నేటి నేర వార్తలు.

TNILIVE Default Featured Image

ఏసీబీ అధికారులు దాడులు అడంగల్ కు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డ వి ఆర్ ఓ.

వినుకొండ:- రైతు నుంచి 9,000 /- లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డ పిట్టంబండ వి ఆర్ ఓ.

money-crime

కృష్ణా జిల్లా:

సెంటర్: మచిలీపట్నం.

కృష్ణా జిల్లా SP P జాషువా IPS ఆదేశాల మేరకు బందరు ట్రాఫిక్ DSP భరత్ మాతాజీ ఆధ్వర్యంలో మచిలిపట్నంలో వివిధ ప్రాంతాలలో ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తున్న యువకులకు ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 25 మంది మైనర్ డ్రైవింగ్ చేస్తున్న వాహన దారులకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేసి, చట్టాలపై అవగాహన కల్పించి, ఇకపై ట్రిపుల్ డ్రైవింగ్ చేయకుండా వారితో ప్రతిజ్ఞ చేయించి, తగు జాగ్రత్తలు మరియు సూచనలు ఇవ్వడమైనది..

ఈ సందర్భంగా ట్రాఫిక్ SI రాజేష్ గారు మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఈ మధ్య కాలంలో జరిగిన రహదారి ప్రమాదాలు లో ఎక్కువ శాతం మంది యువకులే బలయ్యారని, సరదా కోసం వాహనాల జోలికెల్లి ప్రమాదాల బారిన పడవద్దని, యువకులకు హెచ్చరికలు జారీ చేశారు…

అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, బయటకు వెళ్ళిన తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు అంతేకాకుండా వారికి వాహన చట్ట ప్రకారం జరిమానా విధించి వెంటనే వారిచేత ఆ డబ్బులు కట్టించడం జరిగింది….

ఇకపై మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ నిరంతరం కొనసాగుతుంది అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ట్రాఫిక్ SI లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా:

కాజులూరు మండలం
పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని  చిత్ర హింసలకు  గురిచేస్తున్న యువకుడు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు  వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి కాళ్లతో తన్నుతున్నాడు.
అంతేకాకుండా తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంగా ప్రవర్తిస్తున్నాడు

తాగిన మత్తులో  ఈ యువకుడు తన తల్లిని  ఇలా చిత్ర హింసలకు గురిచేయడం ఈ ప్రాతంలో చర్చానీయాంశంగా మారింది

తిరువూరు

తిరువూరు మండలం గానుగపాడులో ఇసుక తరలింపులో చేతివాటం. అక్రమంగా సీనరేజ్ వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తులపై జిల్లా కలెక్టరు కు ఫిర్యాదు. అనధికారిక వసూళ్ల విషయం తమకు తెలియదంటున్న ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి

temple

కర్ణాటక రాష్ట్రంలో కోలార్ జిల్లాలో ఇటీవల ఒక ఎస్సీ బాలుడు దేవుని విగ్రహాన్ని ముట్టుకున్నాడని 6౦ వేల రూపాయల జరిమాన విధించారు.ఫైన్ కట్టాకే గ్రామంలో అడుగు పెట్టాలంటూ అగ్రవర్ణ దురహంకారంతో పెత్తందారులు హుకుం జారీ చేశారు. దీంతో జనంలో కనువిప్పు కలిగింది. నిరసన ఆందోళనలు కొనసాగుతున్నాయి.

murder

వేంపల్లె పట్టణ సమీపంలో దారుణ హత్య..

కడప జిల్లా :- పట్టణ సమీపంలోని ఈదల బావి వద్ద గుర్తు తెలియని వ్యక్తిని బండ రాళ్లతో కొట్టి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు..

రోడ్డుపైన చంపి ఈడ్చుకుంటూ వెళ్లి గుంతలో పడేసినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లు..

పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు..

వేంపల్లె పట్టణ సమీపంలో దారుణ హత్య జరిగి మృతి చెందిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు..

పట్టణ సమీపంలోని చింతలమడుగు పల్లి కు చెందిన మెకానిక్ మహేశ్వర్ రెడ్డి గా గుర్తించిన పోలీసులు..

భూ తగాదాలతో అన్నదమ్ములే హత్యచేశారని ఆరోపిస్తోన్న భార్య అమ్మన్ని..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన పోలీసులు

కన్నెర్ర చేస్తే చాలు.. యాత్రలు ఆగిపోతాయి:బొత్స

విశాఖ: విశాఖపట్టణాన్ని రూ.10వేల కోట్లతో అభివృద్ధి చేస్తే ముంబయిని తలదన్నే నగరమవుతుందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే నష్టమేంటని ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు. కాకినాడ నుంచి ఇచ్ఛాపురం వరకు అభివృద్ధి చెందాలన్నారు.
”యాత్రలను అడ్డుకోవడం ఐదు నిమిషాల పని. కన్నెర్ర చేస్తే చాలు యాత్రలు ఆగిపోతాయి.. కానీ అది పద్ధతి కాదు. ఒక ప్రాంతం.. కొందరు వ్యక్తుల కోసం ఆలోచించకూడదు. మూడు రాజధానులకు అనుకూలంగా సంఘాలన్నీ ర్యాలీలు చేయాలి” అని బొత్స వ్యాఖ్యానించారు.