NRI-NRT

ఫిలడెల్ఫియాలో తానా వనభోజనాల సందడి

ఫిలడెల్ఫియాలో తానా వనభోజనాల సందడి - TANA Picnic In Philadelphia 2022.

అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, ఓక్స్ నగరంలోని లోయర్ పెర్కియోమెన్ వ్యాలీ పార్కులో ఆదివారం నాడు మిడ్-అట్లాంటిక్ తానా విభాగం ఆధ్వర్యంలో వనభోజనాలు ఏర్పాటు చేశారు. 800మంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలలో ఉన్న సృజనాత్మకతకు పోటీలను నిర్వహించారు. న్యూజెర్సీ, డెలావేర్ నుంచి కూడా తెలుగువారు హాజరయ్యారు. పసందైన విందులతో, ఆటపాటలతో కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. టెక్సాస్ నుండి నాగరాజు నలజుల, వర్జీనియా నుండి బాబీ యెర్ర, ఫ్లోరిడా నుండి సాయి జరుగులలు పాల్గొన్నారు.
vindu1
2023 జులై 7 నుండి 9 వరకు ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటరులో నిర్వహించే తానా మహాసభల సన్నాహక సమావేశం నవంబర్ 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు సభల సమన్వయకర్త పొట్లూరి రవి, మిడ్-అట్లాంటిక్ తానా ప్రతినిధి కోగంటి సునీల్‌లు తెలిపారు.
vindu2
రవి పొట్లూరి, సునీల్ కోగంటి, రవి మందలపు, కిరణ్ కొత్తపల్లి, సతీష్ తుమ్మల, హరి మోటుపల్లి, రఘు ఎద్దులపల్లి, హరనాథ్ దొడ్డపనేని, హరి మోటుపల్లి, సాంబయ్య కోటపాటి, ఫణి కంతేటి, రంజిత్ మామిడి, చలం పావులూరి, రామ ముద్దన, కోటిబాబు యాగంటి, మోహన్ మల్ల, వంశి నలజాల, అను తుమ్మల, రవి తేజ ముత్తు, లీల కృష్ణ దావులూరి, సుధాకర్ కంద్యాల, ఇందు సందడి, సరోజ యాగంటి, రాజేశ్వరి కోడలి, స్వరూప కోటపాటి, కవిత మందలపు, రూప ముద్దన, లక్ష్మి అద్దంకి, కవిత చిడిపోతు, లక్ష్మి అడ్డంకి, భవాని మామిడి, విజయశ్రీ పరుచూరి, మనీషా మేకా, నాయుడమ్మ యలవర్తి, భాస్కర్ దొప్పలపూడి తదితరులు ఇతోధికంగా సాయమందిచారు. రాజా కసుకుర్తి, విద్య గారపాటి, శ్రీనివాస్ ఓరుగంటి, విశ్వనాధ్ కోగంటి, శ్రీనివాస్ భారతవరపు, కృష్ణ నందమూరి, రాహుల్ యెర్ర, సాయి జరుగుల, రత్న మూల్పూరి, మూర్తి నూతనపాటి, రవి ఇంద్రకంటి, పవన్ నడింపల్లి, హరీష్ అన్నాబత్తిన, ప్రవీణ్ ఇరుకులపాటి, సురేష్ కంకణాల, శ్రీధర్ సాదినేని, శ్రవణ్ లంక, గౌరీ కర్రోతు, సతీష్ నల్లా, సౌజన్య ఉన్నవ, మన్విత యాగంటి తదితరులు పాల్గొన్నారు.
vindu3