Fashion

వ్యాయామ ఆహార నియమాలు అందుకే పనిచేయవు

వ్యాయామ ఆహార నియమాలు అందుకే పనిచేయవు

కొందరు ఆహార నియమాలు పాటిస్తున్నా.. వ్యాయామాలు చేస్తున్నా బరువు అంతగా తగ్గరు. దీనికి కారణం బద్ధకంతో కూడిన జీవనశైలి కావొచ్చు. రోజులో ఎక్కువసేపు కదలకుండా ఉండిపోతే ఆహార నియమాలు, వ్యాయామంతో చేకూరే ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. కొవ్వును కరిగించటంలో లైపేజ్‌ అనే ఎంజైమ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గంటలకొద్దీ అలాగే కూర్చుంటే శరీరం తగినంత లైపేజ్‌ను ఉత్పత్తి చేయలేదు. కాబట్టి రోజంతా చురుకుగా ఉండటం అలవాటు చేసుకోవాలి. గంటకోసారైనా కుర్చీలోంచి లేచి కాసేపు నడవాలి. వీలైతే రెండు మూడు బస్కీలు తీసినా మంచిదే. కంటి నిండా నిద్ర పోకపోయినా బరువు తగ్గకపోవచ్చు. నిద్రలేమితో ఆకలిని ఆపేసే లెప్టిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో జీవక్రియలు నెమ్మదిస్తాయి కూడా.