NRI-NRT

“తానా” ఆధ్వ‌ర్యంలో అమెరికాలో వైభవోపేతంగా బంగారు బ‌తుక‌మ్మ ఉత్సవం.

“తానా” ఆధ్వ‌ర్యంలో అమెరికాలో వైభవోపేతంగా బంగారు బ‌తుక‌మ్మ ఉత్సవం.

8
అమెరికాలోని న్యూయర్క్ టైమస్క్వేర్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం, “తానా” ఆధ్వర్యంలో
అక్టోబర్ 8వ తేదీన నిర్వహించిన బంగారు బ్రతుకమ్మ ఉత్సవం అంగరంగ వైభవం గా జరిగింది. ప్ర‌పంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో 20 అడుగులఎత్తున తీర్చిదిద్దిన బ్రతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆహుతులని , విదేశీయులను ఎంతగానో ఆకర్షించింది. తెలంగాణా సంస్కృతికి గ‌ర్వ‌కారణమైన బతుకమ్మ అలంకరణ, పాటలు, ఆటలు విశ్వవేదిక అయిన టైమ్ స్క్వేర్‌లో పండ‌గ కాంతులు పంచాయి. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ లతో పాటు అమెరికా లోని వివిధ రాష్ట్రాలనుంచి వంద‌లాది మంది తెలుగువారు ఈ కార్యక్రమానికి తరలి వచారు. స్వయంగా తాము తయారు చేసిన బతుకమ్మలతో ఆడపడుచులు ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. రక రకాల పూలతో సర్వాంగసుందరమైన బతుకమ్మ అలంకరణ అందర్నీ విశేషంగా ఆకర్శించింది.
11
తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్ళూరి, తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని, రీజిన‌ల్ రిప్ర‌జెంటేటివ్‌- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, venkat chintalappali మరియు దీపిక సమ్మెట ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు టైమ్ స్క్వేర్ ని వైవిధ్య భరితమైన పూలవనంగా మార్చాయి. సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు సాగిన ఈ వేడుకలలోపాల్గొన్న తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి ప్రత్యక ఉపన్యాసం చేసారు. ఈ పండగను విశ్వవేదిక మీద జరుపుకోవడం గర్వంగా ఉందని, సమిష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి మన తెలుగుజాతి సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఈవేడుకలో తెలుగువారందరిని సమన్వ‌య ప‌రిచి, ఇత పెద్ద ఎత్తున ఈ ఉత్సవం నిర్వహించి విజయవంతం చేయటంలో కీలక పాత్ర వహించిన తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల కృషిని కొనియాడుతూ అలాగే ఈ భారీ కార్యక్రామానికి సహకరిoచిన ఆడపడుచులందరికీ, అలాగే కార్యక్రమ విజయవంతానికి కృషిచేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ప్రత్యకంగా అభినందించారు. ఈసందర్భంగా తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ మాట్లాడుతూ మన సంప్రదాయంలో దేవుళ్ళని పూలతో పూజించే మనం, ఈ పండగకి మాత్రం పూలనే దేవుళ్లుగా చేసి పూజించటంలోని విశిష్టతను తెలియ జేశారు.
10
అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రెసిడెంట్ ఎలెక్ట్ నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ తానా ఎల్లప్పుడూ వినూత్నమైన కార్యక్రమాలు చేస్తుందన్న మాటని రుజువు చేసుకుంటూ సంస్థ ప్రతిష్టని మరిoత పెంచే విధంగా బంగారు బ్రతుకమ్మ ఉత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు.
9
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ కనులవిందుగా అలంకరిచిన బతుకమ్మ టైమ్ స్క్వేర్‌ కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, ఇంతటి మంచి కార్యక్రమాన్ని న్యూయార్క్ నగరంలో చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా తనకు భారత దేశ సంప్రదాయాలను, పండుగల గురి౦చి తెలుసుకునే అవకాశం కల్పించినందుకు తానా సంస్థకు అభినందనలు తెలియజేసారు. అలాగే భారతీయ సంసృతీ సంప్రదాయాలను విశ్వవ్యా ప్తం చేయడంలో తానా సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్రూక్లీన్ బరో ప్రెసిడెంట్ ఆఫీసు ప్రతినిధి, దక్షిణ ఆసియావ్యవహారాల డైరెక్టర్ దిలీప్ చౌహాన్ చేస్తున్న తానా సంస్థకు మేయర్ ద్వారా జారీ చేయబడిన అభినందన పత్రాన్ని అందించారు.
13
ప్రత్యేక అతిథులుగా హాజరైన ప్రఖ్యాత టీవీ, సినీన‌టి అన‌సూయ‌, ప్రముఖ జానపదగాయ‌ని మంగ్లీ, తమ ఆటపాటలతో హో రెత్తించారు. అలాగే మిమిక్రీ ర‌మేష్ తమదైన హాస్యంతో ఆహుతులకు హాస్యాన్ని పంచారు.
ఈ సందర్భంగా తెలుగుద‌నం ఉట్టి పడేలా సంప్ర‌దాయ‌మైన అలంక‌ర‌ణ‌ల‌తో తెలుగు ఆడపడుచులు ఉత్సాహభరితమైన బతుకమ్మ పాటలు, నృత్యాల తో సంద‌డి చేశారు. అలాగే సంప్రదాయ నృత్యాలు Tarika, మహిషాసుర మర్ధిని నృత్య రూపకం hamsini,Ashok chinthakunta,Madhavi soleti చిన్నారుల జానపద నృత్యాలను ప్రదర్శించిna Swathi Atluri gaari studnets brundham, ఆహూతులని ఆనందింపజేశారు.
6
అమెరికాలోని వివిధ నగరాలనుంది తానా సంస్థ నాయకులు విచ్చేసారు.
3
ఈ కార్యక్రమాniki foundation chairman venkata ramana yarlagadda,evp niranjan srungavarapu,ఫౌండేష‌న్ ట్ర‌స్టీ విశ్వ‌నాథ్ నాయునిపాటి, ఫౌండేష‌న్ ట్ర‌స్టీలు సుమంత్ రామిశెట్టి-విద్య గార‌పాటి-శ్రీనివాస్ ఓరుగంటి, రీజిన‌ల్ రిప్ర‌జెంటేటివ్‌- న్యూజెర్సీ వంశీ వాసిరెడ్డి, రీజిన‌ల్ రిప్ర‌జెంటేటివ్‌- న్యూయార్క్ దిలీప్ ముసునూరు, రీజిన‌ల్ రిప్ర‌జెంటేటివ్‌- న్యూ ఇంగ్లాండ్ ప్ర‌దీప్ గ‌డ్డం, క‌మ్యూనిటీ స‌ర్వీస్ కోఆర్డినేట‌ర్ రాజా క‌సుకుర్తి,Ravi mandalapu,Ravi potluri,Ram upputuri, sunil koganti,Venkat chintalappali palgonnaru.
ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వారిలో నిర్మాత విశ్వప్రసాద్ పాటు ఫౌండేష‌న్ చైర్మ‌న్ వెంక‌ట‌ర‌మ‌ణ యార్ల‌గ‌డ్డ‌ తో పాటు సంస్థ ట్రస్టీ సభ్యులు రవి సామినేని, పద్మజ బెవర, మాధురి ఏలూరి, రాంచౌదరి ఉప్పుటూరి లు పాల్గొన్నారు. అలాగే ఇరురాష్ట్రాల తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా హాజరై వైభ‌వంగా బ‌తుక‌మ్మ సంబురాల‌ను నిర్వ‌హించిన తానా సంష్టను ప్రశంసించారు.. విచ్చేసిన వారందరికీ తెలుగు వంటకాలతో కమ్మని విందు beenz restaurant vaaru అందించారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసిన TV9 కి తానా నేతలు కృతజ్ఞతలు అందజేశారు.
4
ఇంతటి మహా కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించడానికి వారాల తరబడి కృషి చేసిన వారందరికీ తానా సంస్థ తరఫున తానా కల్చరల్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల నేతృత్వంలో న్యూజెర్సీ BOD లక్ష్మి దేవినేని,ధన్యవాదాలు తెలియజేశారు.
2