NRI-NRT

వేడుకగా బాటా అర్ధ శతాబ్ది మహోత్సవం

వేడుకగా బాటా అర్ధ శతాబ్ది మహోత్సవం

అమెరికాలో బే ఏరియా తెలుగు అసోసియేష‌న్(BATA) ఏర్పడి 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ‘డైమండ్‌ జూబ్లీ’ వేడుక‌లను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడి శాంతా క్లారా క‌న్వెన్షన్‌ సెంట‌ర్‌లో ఏర్పాటు చేసిన ఈ స్వర్ణోత్సవాల్లో.. ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్‌, శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్‌ జనరల్‌ డాక్టర్‌ టీవీ నాగేంద్ర ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రముఖ వైద్యులు, దాత డాక్టర్‌ ల‌కిరెడ్డి హ‌నిమిరెడ్డికి `దాతృత్వ సింధు`, జ‌య‌రాం కోమ‌టికి `ప్రవాస బంధు` బిరుదులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అమెరికాతోపాటు భార‌త్ నుంచీ భారీ సంఖ్యలో అతిథులు హాజ‌ర‌య్యారు.